హైదరాబాద్: జూన్ 30 నాటికి తాము అమరావతికి వెళ్లడం ఖాయమని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ... తాత్కాలిక సచివాలయానికి తరలి వెళ్లడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించామన్నారు. విభజన కారణంగా ముందుగా నష్టపోయింది ఉద్యోగులేనని అన్నారు. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నందున తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అమరావతికి వెళ్లే ఉద్యోగులకు తలెత్తే సమస్యలను సీఎం, సీఎస్ దృష్టికి తీసువెళ్లి పరిష్కరించుకుంటామని మురళీకృష్ణ తెలిపారు.
‘జూన్ 30 నాటికి అమరావతి వెళ్తాం’
Published Thu, May 12 2016 6:23 PM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM
Advertisement
Advertisement