ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి కేసులో నిందితులకు శిక్ష పడే వరకూ తన పోరాటం కొనసాగిస్తానని తండ్రి మురళీ కృష్ణ స్పష్టం చేశారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన గురువారం లేఖ రాశారు. తన కూతురు రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అనేక అనుమానాలున్నాయని పేర్కొన్నారు. రిషితేశ్వరిని మరికొందరు సీనియర్లు వేధించారని ఆరోపణలున్నా.. ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు.