
సమావేశంలో మాట్లాడుతున్న మురళీకృష్ణ
కోడుమూరు రూరల్: 2019ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని వైఎస్సార్ సీపీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. కోడుమూరులో బుధవారం మురళీకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ పాదయాత్రలో తమ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలొకొచ్చిన 6నెలల్లోగా కోడుమూరుకు శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు మంచినీరందక ప్రజలు అల్లాడిపోతుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల దరిచేరాలంటే టీడీపీ నాయకులకు ప్రజలు మామూళ్లను ఇచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. దళారులకంటే అధ్వానంగా టీడీపీ నాయకులు తయారై ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ స్థానిక నాయకులు రాజు, రాము, మద్దయ్య, శ్రీరాములు, అన్వర్, వీరేష్, మద్దిలేటి, అబ్దుల్, ఎల్లప్ప తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment