జె.బి.మురళీకృష్ణ
‘‘జంబ లకిడి పంబ’ కథను 116 మందికి చెప్పాను. అందరికీ నచ్చింది. కానీ, రెండో సగంలో ఆత్మలు మారడం అనేది చాలెంజింగ్ పార్ట్ కావడంతో సినిమా ప్రారంభం ఆలస్యమైంది’’ అని డైరెక్టర్ జె.బి.మురళీ కృష్ణ(మను) అన్నారు. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మించిన ‘జంబ లకిడి పంబ’ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు జె.బి.మురళీకృష్ణ పలు విశేషాలు పంచుకున్నారు.
► నేను పుట్టింది, పెరిగింది విజయనగరంలో. మా నాన్నగారు మలయాళీ, అమ్మ తెలుగు కుటుంబానికి చెందినవారు. అందుకే తెలుగు బాగా మాట్లాడుతున్నా. విక్రమ్ కుమార్‌గారి వద్ద ‘మనం’ చిత్రానికి సపోర్టింగ్ రైటర్‌గా పనిచేశా. ‘దృశ్యం’ సినిమా మలయాళం, తెలుగు, తమిళ వెర్షన్స్‌కు దర్శకత్వ శాఖలో పని చేస్తూనే, ఓ చిన్న పాత్ర చేశా.
► ఈ కథకు ముందు ‘కుడి ఎడమైతే’ టైటిల్ అనుకున్నా. ఆత్మలు మారే కథ కాబట్టి ‘జంబలకిడి పంబ’ టైటిల్ పెడితే కాస్త మైలేజ్ వస్తుందని శ్రేయోభిలాషులు చెప్పడంతో పెట్టాం. అయితే.. ఆ టైటిల్ పెట్టేటప్పుడూ.. ఇప్పుడూ భయంగానే ఉంది. పాత ‘జంబ లకిడి పంబ’ రేంజ్‌ను ఊహించుకుని ప్రేక్షకులు వస్తారేమోనని. మా సినిమా ఈవీవీగారి సినిమా రేంజ్‌లో ఉంటుందని చెప్పడం అహంకారం అవుతుంది. అయితే.. ఆ సినిమా పేరు మాత్రం పోగొట్టను. స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ ఫన్ ఉంటుంది. ఎక్కడా పాఠాలు చెప్పలేదు.
► శ్రీనివాసరెడ్డిగారు అయితేనే ఈ పాత్రకి న్యాయం చేయగలరనిపించింది. 36 మందిని ఆడిషన్స్ చేసి సిద్ధి ఇద్నాని తీసుకున్నాం. నా ప్రజెంట్, ఫ్యూచర్ ‘జంబ లకిడి పంబ’ చిత్రమే. దాని తర్వాత ఇంకా ఏమీ ఆలోచించలేదు. రెండు, మూడు అవకాశాలు వచ్చాయి. బౌండెడ్ స్క్రిప్ట్‌లు 5 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment