Jamba Lakidi Pamba
-
ఆ సినిమాలో నిజంగానే నాతో బీర్ తాగించారు: ఆమని
నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో శుభలగ్నం, మావిడాకులు, మిస్టర్ పెళ్ళాం.. వంటి సినిమాల్లోని ఆమె పాత్రల్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అనేక హిట్ చిత్రాల్లో నటించి సహజమైన తన నటనతో అందరి మన్ననలు అందుకున్నారు. కెరీర్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సినిమాల నుంచి తప్పుకొని వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయారు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫస్ట్ మూవీ ‘జంబలకిడి పంబ’ షూటింగ్‌లోని ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. ఈ సినిమాలో మందుకొట్టే సీన్ ఉంటుందని డైరెక్టర్ ముందు నాకు చెప్పలేదు. డైరెక్ట్‌గా షూటింగ్ స్పాట్‌కు వెళ్లాక ఆ సీన్ చేయాలన్నారు. బాటిల్లో ఏదైనా కూల్‌డ్రింక్ కలిపి ఇస్తారేమో అనుకున్నా. కానీ నిజంగానే బీర్ ఇచ్చి జస్ట్ ఒక సిప్ చేయమన్నారు. అప్పుడు హీరో నరేష్ కూడా ఏం కాదమ్మ తాగు అని అన్నారు. అలా మొదటి సినిమాలోనే మందుతాగే సీన్ చేశాను అంటూ చెప్పుకొచ్చారు. -
జంబలకిడిపంబ మూవీ టీమ్‌తో చిట్ చాట్
-
‘జంబ లకిడి పంబ’ మూవీ రివ్యూ
టైటిల్ : జంబ లకిడి పంబ జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళీ, వెన్నెల కిశోర్ సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : జేబీ మురళీ కృష్ణ నిర్మాత : ఎన్ శ్రీనివాస్ రెడ్డి, రవి, జోజో జోస్ 1993లో రిలీజ్ అయిన సూపర్ హిట్ క్లాసిక్ జంబ లకిడి పంబ. ఇవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించటమే కాదు కామెడీలో కొత్త ఒరవడికి తెరలేపింది. అయితే ఇన్నేళ్ల తరువాత అదే కాన్సెప్ట్ తో అదే టైటిల్ తో మరో సినిమా తెర మీదకు వచ్చింది. కమెడియన్‌గా కొనసాగుతూనే హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శ్రీనివాస్ రెడ్డి హీరోగా తెరకెక్కిన ఈ మోడ్రన్ జంబ లకిడి పంబ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? గతంలో క్లాసిక్ సినిమాలను టచ్ చేసిన చాలా మంది ఫెయిల్ అయ్యారు. మరి ఆ ట్రాక్ రికార్డ్‌ను ఈ సినిమా బ్రేక్ చేసిందా..? కథ : వరుణ్ (శ్రీనివాస్ రెడ్డి), పల్లవి (సిద్ధి ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట. పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇక కలిసి జీవించలేం అని నిర్ణయించుకున్న వరుణ్, పల్లవిలు విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. 99 జంటలకు విడాకులు ఇప్పించిన ఫేమస్ లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ (పోసాని కృష్ణమురళీ) వీరికి విడాకులు ఇప్పించి వంద మందికి విడాకులు ఇప్పించిన లాయర్ గా గిన్నిస్ రికార్డ్ సాధించాలనుకుంటాడు. కానీ వరుణ్, పల్లవికి విడాకులు రాకముందే హరిశ్చంద్ర ప్రసాద్ ఓ యాక్సిడెంట్లో భార్యతో సహా చనిపోతాడు. (సాక్షి రివ్యూస్) చేసిన పాపల కారణంగా ఆత్మగా మారిన హరిశ్చంద్ర ప్రసాద్ భార్యకు దూరమవుతాడు. తిరిగి తన భార్యను కలుసుకోవాలంటే వరుణ్, పల్లవిలను ఒక్కటి చేయమని దేవుడు(సుమన్) కండిషన్ పెడతాడు. దీంతో తిరిగి భూలోకంలోకి వచ్చిన హరిశ్చంద్రప్రసాద్ ఏం చేశాడు..? వరుణ్ శరీరంలోకి పల్లవి ఆత్మను, పల్లవి శరీరంలోకి వరుణ్ ఆత్మని ఎందుకు మార్చాల్సి వచ్చింది..? చివరకు వరుణ్, పల్లవిలు ఒక్కటయ్యారా..? లేదా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కమెడియన్‌గా మంచి ఇమేజ్ ఉన్న శ్రీనివాస్ రెడ్డి హీరోగానూ తన ఇమేజ్‌కు తగ్గ కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాడు. జంబ లకిడి పంబ సినిమాలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. కొన్ని సీన్స్ లో లవర్ భాయ్లా కనిపించే ప్రయత్నం చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కామెడీ పరంగా మాత్రం తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్గా పరిచయం అయిన సిద్ధి ఇద్నాని మంచి నటన కనబరించారు. చాలా సీన్స్ లో శ్రీనివాస్ రెడ్డిని డామినేట్ చేశారు.(సాక్షి రివ్యూస్) ముఖ్యంగా వరుణ్ ఆత్మ తనలోకి వచ్చిన తరువాత వచ్చే సీన్స్ లో చాలా ఈజ్‌తో నటించి ఆకట్టుకున్నారు. సినిమాలో మరో కీలక పాత్రలో పోసాని కృష్ణమురళి. తనకు అలవాటైన పాత్రలో పోసాని మరోసారి మంచి నటన కనబరిచారు. ఇతర నటీనటులకు పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు దక్కలేదు. విశ్లేషణ : జంబ లకిడి పంబ లాంటి క్లాసిక్‌ను టచ్ చేసే ధైర్యం చేసిన దర్శకుడు మురళీ కృష్ణ ఆ స్థాయిలో అలరించటంలో ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య జరిగే గొడవలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా టీవీ సీరియల్ సాగటం ప్రేక్షకులను విసిగిస్తుంది. (సాక్షి రివ్యూస్)కామెడీ సినిమా అనుకొని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు హర్రర్ కామెడీ, ఎమోషనల్ డ్రామాలను చూపించటం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. హీరో హీరోయిన్ల శరీరాలు మారిన తరువాత కూడా కథనం ఆసక్తికరంగా సాగలేదు. సెకండ్‌హాఫ్ లో మరింతగా కామెడీ పండించే అవకాశాలు ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా ఎమోషనల్ డ్రామాగా మీద దృష్టి పెట్టడం, కామెడీ ఆశించే ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. జంబ లకిడి పంబ లాంటి టైటిల్ ను ఎంచుకున్న దర్శకుడు ఆ స్థాయిలో నవ్వు తెప్పించే సన్నివేశాలు రాసుకోవటంలో విఫలమయ్యారు.(సాక్షి రివ్యూస్) గోపి సుందర్ సంగీతం పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అనవసర సన్నివేశాలకు కత్తెర వేస్తే సినిమా కాస్త ఆసక్తికరంగా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : టైటిల్ కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : బలమైన కథ లేకపోవటం ఆశించిన స్థాయిలో కామెడీ పండకపోవటం నెమ్మదిగా సాగే కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
బిగ్‌బాస్ హౌజ్.. ఇంకొంచెం మసాలా
తెలుగులో టాప్ షోగా దూసుకుపోతోంది బిగ్‌బాస్ రెండో సీజన్. ఏదైనా జరగవచ్చు, ఇంకొంచెం మసాలా అంటూ మొదలైన ఈ షో బాగానే ఆకట్టుకుంటోంది. ఈ మధ్యే మొదటి ఎలిమినేటర్‌గా బయటకు వచ్చిన సంజన, మిగతా పార్టిసిపెంట్స్‌పై విమర్శలు చేయడం వివాదాస్పదంగా మారింది. బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రతిరోజు జరిగే పరిణామాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రోజు జరిగే బిగ్‌బాస్ కార్యక్రమంలో ‘జంబలకిడిపంబ’ టీమ్ కూడా పాల్గొనబోతోంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా హీరో శ్రీనివాస్ రెడ్డి, హాస్య నటుడు వెన్నెల కిషోర్ ఈ రోజు షోలో కనిపించనున్నారు. వీరిద్దరు బిగ్‌బాస్ హౌజ్‌లో చేసే సందడి చూడాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే. ‘జంబలకిడిపంబ’ సినిమా రేపు (జూన్ 22) విడుదల కానుంది. #JambalakidiPamba stars @Actorysr & @vennelakishore makes crazy surprise entry to Bigg house 😂#BiggBossTelugu2 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/FmTmuAVtxa — STAR MAA (@StarMaa) June 21, 2018 -
ఫుల్ ఫన్.. నో లెసన్
‘‘జంబ లకిడి పంబ’ కథను 116 మందికి చెప్పాను. అందరికీ నచ్చింది. కానీ, రెండో సగంలో ఆత్మలు మారడం అనేది చాలెంజింగ్ పార్ట్ కావడంతో సినిమా ప్రారంభం ఆలస్యమైంది’’ అని డైరెక్టర్ జె.బి.మురళీ కృష్ణ(మను) అన్నారు. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మించిన ‘జంబ లకిడి పంబ’ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు జె.బి.మురళీకృష్ణ పలు విశేషాలు పంచుకున్నారు. ► నేను పుట్టింది, పెరిగింది విజయనగరంలో. మా నాన్నగారు మలయాళీ, అమ్మ తెలుగు కుటుంబానికి చెందినవారు. అందుకే తెలుగు బాగా మాట్లాడుతున్నా. విక్రమ్ కుమార్‌గారి వద్ద ‘మనం’ చిత్రానికి సపోర్టింగ్ రైటర్‌గా పనిచేశా. ‘దృశ్యం’ సినిమా మలయాళం, తెలుగు, తమిళ వెర్షన్స్‌కు దర్శకత్వ శాఖలో పని చేస్తూనే, ఓ చిన్న పాత్ర చేశా. ► ఈ కథకు ముందు ‘కుడి ఎడమైతే’ టైటిల్ అనుకున్నా. ఆత్మలు మారే కథ కాబట్టి ‘జంబలకిడి పంబ’ టైటిల్ పెడితే కాస్త మైలేజ్ వస్తుందని శ్రేయోభిలాషులు చెప్పడంతో పెట్టాం. అయితే.. ఆ టైటిల్ పెట్టేటప్పుడూ.. ఇప్పుడూ భయంగానే ఉంది. పాత ‘జంబ లకిడి పంబ’ రేంజ్‌ను ఊహించుకుని ప్రేక్షకులు వస్తారేమోనని. మా సినిమా ఈవీవీగారి సినిమా రేంజ్లో ఉంటుందని చెప్పడం అహంకారం అవుతుంది. అయితే.. ఆ సినిమా పేరు మాత్రం పోగొట్టను. స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ ఫన్ ఉంటుంది. ఎక్కడా పాఠాలు చెప్పలేదు. ► శ్రీనివాసరెడ్డిగారు అయితేనే ఈ పాత్రకి న్యాయం చేయగలరనిపించింది. 36 మందిని ఆడిషన్స్ చేసి సిద్ధి ఇద్నాని తీసుకున్నాం. నా ప్రజెంట్, ఫ్యూచర్ ‘జంబ లకిడి పంబ’ చిత్రమే. దాని తర్వాత ఇంకా ఏమీ ఆలోచించలేదు. రెండు, మూడు అవకాశాలు వచ్చాయి. బౌండెడ్ స్క్రిప్ట్‌లు 5 ఉన్నాయి. -
అబ్బాయిగా నటించడం ఈజీ కాదు
‘‘మా నాన్న సింధీ. మా అమ్మ గుజరాతీ. వాళ్లది ప్రేమ వివాహం. మా అమ్మ హిందీ టెలివిజన్ సీరియల్స్, గుజరాతీ చిత్రాల్లో నటించేవారు. చిన్నప్పుడు అమ్మతో కలిసి సీరియల్ సెట్‌కి వెళ్లేదాన్ని. 17 ఏళ్లకు తొలిసారి నటించా. ఆ తర్వాత దేవాంక్ పటేల్‌తో గుజరాతీ సినిమా చేశా’’ అని సిద్ధి ఇద్నాని అన్నారు. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా జె.బి.మురళీ కృష్ణ(మను) దర్శకత్వంలో రవి, జో జో జోస్, శ్రీనివాస రెడ్డి.ఎన్ నిర్మించిన ‘జంబ లకిడి పంబ’ ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సిద్ధి ఇద్నాని మాట్లాడుతూ– ‘‘ఓ వైపు సీరియల్స్, కమర్షియల్ యాడ్స్ చేస్తుండగా ఓ ఏజెన్సీ వాళ్లు ఫోన్ చేసి తెలుగు సినిమా ఉందని చెప్పారు. ఆడిషన్‌కి వెళ్లాను. రెండు రోజుల తర్వాత హైదరాబాద్‌కి రమ్మని పిలిచారు. మనుగారు, నిర్మాతలు, శ్రీనివాసరెడ్డి ఉన్నారు. నా కళ్లు, నవ్వు చూసి నేను చేస్తానని వాళ్లు నమ్మి ‘జంబ లకిడి పంబ’ లో అవకాశం ఇచ్చారు. నేను ఫస్టాఫ్‌లో డిజైనర్‌గా కనిపిస్తాను. ఇంటర్వెల్ తర్వాత పాత్రలు మారతాయి. ఓ అమ్మాయి అబ్బాయిగా నటించడం అంత ఈజీ కాదు. నా దృష్టిలో యాక్టింగ్ అంటే యాక్టింగే. భాష కన్నా భావాలు ఎక్కువగా మాట్లాడుతాయి. కామెడీ చేయడం చాలా కష్టం. భాష తెలియకపోతే మరీ ఇబ్బంది. అందుకే భాష నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు తెలుగు తెలుసు. ప్రస్తుతం కథలు వింటున్నా. ‘జంబ లకిడి పంబ’ విడుదల తర్వాత కొత్త చిత్రాలకు సంతకం చేస్తా’’ అన్నారు. -
ఆ టైటిల్ పెట్టినప్పుడు తిట్టారు
‘‘మేడమీద అబ్బాయి’ సినిమా నుంచి మనూగారితో మంచి పరిచయం ఉంది. ‘జంబ లకిడి పంబ’ టైటిల్ పెట్టడంతో అందరూ తిట్టారని మను అన్నారు. గతంలో నా సినిమాకి ‘అహ నా పెళ్ళంట’ టైటిల్ పెట్టినప్పుడు కూడా మమ్మల్ని తిట్టారు. అయితే మేం హిట్ కొట్టాం. నాన్నగారి (ఈవీవీ) ‘జంబ లకిడి పంబ’ సినిమా ఎంత విజయం సాధించిందో ఈ సినిమా అంతే పెద్ద సక్సెస్ కావాలి’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా జె.బి. మురళీ కృష్ణ (మను) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జంబ లకిడి పంబ’. రవి, జో జో జోస్, శ్రీనివాస రెడ్డి.ఎన్ నిర్మించిన ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. బీజేపీ ఎం.ఎల్.సి మాధవ్ ట్రైలర్ లాంచ్ చేయగా, బ్యానర్ లోగోను బీరం సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. జె.బి.మురళీకృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈవీవీగారి ‘జంబలకిడి పంబ’ సినిమా పేరు పెట్టుకున్నందుకు ఆ సినిమా పరువు మాత్రం తీయం’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా ఇది. ఈ నెల 22న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత రవి. ‘‘మా సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేయాలి’’ అన్నారు శ్రీనివాసరెడ్డి. సిద్ధి ఇద్నాని, నిర్మాతలు జో జో జోస్, శ్రీనివాస రెడ్డి.ఎన్, సంగీత దర్శకుడు గోపీసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘జంబలకిడి పంబ’ ట్రైలర్ విడుదల
-
ఆకట్టుకుంటున్న ‘జంబలకిడి పంబ’ ట్రైలర్
ఈవీవీ సత్యనారాయణ ‘జంబలకిడి పంబ’ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, ఆలీ, సీనియర్ నరేష్, కోట శ్రీనివాసరావు లాంటి దిగ్గజాలు చేసిన కామెడీని ఎప్పటికీ మరిచిపోలేము. మళ్లీ అలాంటి కాన్సెప్ట్‌తో, అదే టైటిల్‌తో తెరకెక్కిన సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. హీరో, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘జంబలకిడి పంబ’ ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మగవారు ఆడవారుగా, ఆడవారు మగవారుగా మారితే ఎలా ఉంటుందో ఈవీవీ తన సినిమాలో చూపించినా.. మళ్లీ అదే నేపథ్యంతో డైరెక్టర్ జెబీ మురళీ కృష్ణ మరో వినూత్న కథనంతో మళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ, జబర్దస్త్ కమెడియన్స్ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమా జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
జంబ లకిడి పంబ ట్రైలర్ విడుదల
-
మాస్ మహరాజ్ చేతుల మీదుగా
‘జంబ లకిడి పంబ’ సినిమా చూడని తెలుగు ప్రేక్షకులు బహుశా ఉండరు. సీనియర్ నరేశ్ హీరోగా, ఆమని హీరోయిన్గా ఈవీవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కామెడీ సినిమా. ఇప్పుడు అదే సినిమా టైటిల్‌తో శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్, మెయిన్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సినిమా తెరకెక్కిస్తున్నారు. జె.బి.మురళీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణం చివరి దశకు వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, గోపీ సుందర్ అందించిన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను మాస్ మహారాజ్ రవితేజ చేతుల మీదుగా సోమవారం(జూన్11న) రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నాయి. జూన్ 22న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు ఉన్నాయి. పలువురు స్టార్స్ ప్రమోషన్ లో పాలుపంచుకోవటం కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
ఆ సినిమాని మించి హిట్ అవ్వాలి
శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా తెరకెక్కిన చిత్రం ‘జంబలకిడి పంబ’. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మించిన ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ఈవీవీ సత్యనారాయణగారి ‘జంబలకిడి పంబ’ సినిమా మనందరికీ ఇప్పటికీ గుర్తే. ఆడవాళ్లు మగవాళ్లుగా మారడం.. మగవాళ్లు ఆడవాళ్లుగా మారడం వంటివి అప్పట్లో చాలా తమాషాగా చూశాం. ఈ సినిమా అంతకన్నా పెద్ద హిట్ సాధించాలి’’ అన్నారు. ‘‘మనుగారు ఫస్ట్ వేరే కథతో వచ్చారు. మాటల్లో ‘జంబలకిడి పంబ’ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా తెరకెక్కించారు’’ అన్నారు శ్రీనివాసరెడ్డి. ‘‘ప్రమోషనల్ సాంగ్ కాన్సెప్ట్ కథ అనుకున్నప్పటి నుంచే ఉంది. ఒక ప్రత్యేక బడ్జెట్లో ఈ సాంగ్‌ని చేయాలి. గోపీసుందర్‌కి ఈ సాంగ్ గురించి ముందే తెలుసు. ఒక ట్యూన్ పంపించారు. అది తెలుసుకుని నిర్మాతలు ఖర్చుకు వెనకాడొద్దని చెప్పారు. ప్రమోషనల్ సాంగ్ క్రెడిట్ వాళ్లదే’’ అన్నారు మురళీకృష్ణ. సిద్ధి ఇద్నాని, గేయ రచయిత కాసర్ల శ్యామ్, నటులు ‘వెన్నెల’ కిశోర్, ‘సత్యం’ రాజేశ్, నిర్మాత రవి, సంతోష్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు. -
టైటిల్ గమ్మత్తుగా ఉంది
‘జంబలకిడి పంబ’ టైటిల్ చాలా గమ్మత్తుగా ఉంది. గోపీసుందర్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. ‘మదిలో ఉన్న ప్రేమ’ పాట చాలా బాగుంది. శ్రీనివాసరెడ్డికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి’’ అని కథానాయిక రాశీఖన్నా అన్నారు. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి ఎన్. నిర్మించారు. ఈ చిత్రంలోని తొలి పాట ‘మదిలో ఉన్న ప్రేమ’ లిరికల్ వీడియోను రాశీఖన్నా శుక్రవారం విడుదల చేశారు. మురళీకృష్ణ మాట్లాడుతూ–‘‘మా చిత్ర కథకు చక్కగా సరిపోయే టైటిల్ ‘జంబలకిడి పంబ’. టైటిల్ చూసి సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కథ, స్క్రీన్‌ప్లే బాగా కుదిరాయి. శ్రీనివాసరెడ్డి కెరీర్లో ఈ సినిమా కీలకం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కామెడీ ఎంత బావుంటుందో, పాటలు కూడా అంతే బావుంటాయి’’ అన్నారు శ్రీనివాసరెడ్డి. ‘‘రొమాంటిక్ కామెడీ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది. జూన్ 14న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముత్యాల, సహ నిర్మాత: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సంతోష్. -
కాన్సెప్ట్ అదిరిపోయింది: నాని
‘‘ఈవీవీగారి ‘జంబలకిడి పంబ’ నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. అదే టైటిల్‌తో సినిమా అనగానే, అలాంటి కాన్సెప్ట్ మళ్లీ రావడం కష్టం కదా? ఎలా అనుకున్నాను. కానీ, వీళ్లకి అదిరిపోయే కాన్సెప్ట్ కుదిరింది. టైటిల్ కూడా కరెక్టుగా సరిపోయింది. మనం ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్ ఇది. చాలా సరదాగా చేసినట్టు అనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే కచ్చితంగా హిట్ సాధిస్తారనిపిస్తోంది’’ అని హీరో నాని అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా జె.బి.మురళీ కృష్ణ దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాస్ రెడ్డి. ఎన్ నిర్మిస్తున్న ‘జంబలకిడి పంబ’ సినిమా టీజర్‌ను నాని విడుదల చేశారు. జె.బి.మురళీ కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇదొక కల్ట్ మూవీ. ఈవీవీగారు ‘జంబలకిడి పంబ’ సినిమాతో కామెడీలో కొత్త కోణాన్ని చూపారు. అప్పటి ఆ సినిమాకు మా సినిమాకు సంబంధం లేదు. కథకు సూట్ అవుతుందని ఈ టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్‌ని నానీగారు రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. సినిమా తప్పకుండా అందర్నీ మెప్పించేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘సినిమా బాగా వస్తోంది. తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు నిర్మాత రవి. నిర్మాతలు జోజో జోస్, సహ నిర్మాత బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.