
నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో శుభలగ్నం, మావిడాకులు, మిస్టర్ పెళ్ళాం.. వంటి సినిమాల్లోని ఆమె పాత్రల్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అనేక హిట్ చిత్రాల్లో నటించి సహజమైన తన నటనతో అందరి మన్ననలు అందుకున్నారు. కెరీర్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సినిమాల నుంచి తప్పుకొని వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయారు.
అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫస్ట్ మూవీ ‘జంబలకిడి పంబ’ షూటింగ్‌లోని ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. ఈ సినిమాలో మందుకొట్టే సీన్ ఉంటుందని డైరెక్టర్ ముందు నాకు చెప్పలేదు.
డైరెక్ట్‌గా షూటింగ్ స్పాట్‌కు వెళ్లాక ఆ సీన్ చేయాలన్నారు. బాటిల్‌లో ఏదైనా కూల్‌డ్రింక్ కలిపి ఇస్తారేమో అనుకున్నా. కానీ నిజంగానే బీర్ ఇచ్చి జస్ట్ ఒక సిప్ చేయమన్నారు. అప్పుడు హీరో నరేష్ కూడా ఏం కాదమ్మ తాగు అని అన్నారు. అలా మొదటి సినిమాలోనే మందుతాగే సీన్ చేశాను అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment