
'మాకూ హెల్త్ కార్డులు ఇవ్వాలి'
తెలంగాణ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం ఇచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ సర్కారు తమకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం ఇచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ సర్కారు తమకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ డిమాండ్ చేశారు. హుదూద్ తుపాను కారణంగానే ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వడంలో జాప్యం జరిగినట్టు భావిస్తున్నట్టు చెప్పారు.
తమ ఉద్యోగులకు ఎలాంటి ప్రీమియం లేకుండా ఆరోగ్య కార్డులు ఇవ్వనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. వారికి పూర్తిగా ఉచిత వైద్యం అందించేందుకు వీలుగా హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.