బాగున్నావా కేకే.. సీఎం జగన్‌ ఆత్మీయ పలకరింపు | CM YS Jagan Talks With KK Raju | Sakshi
Sakshi News home page

బాగున్నావా కేకే.. సీఎం జగన్‌ ఆత్మీయ పలకరింపు

Published Fri, Oct 9 2020 8:32 AM | Last Updated on Fri, Oct 9 2020 8:58 AM

CM YS Jagan Talks With KK Raju - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ‘కేకే.. హౌ ఆర్‌ యూ.. అంతా ఓకే కదా...’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజుని ఆప్యాయంగా పలకరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడులో గురువారం నిర్వహించిన ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం కేకే రాజు ముఖ్యమంత్రి వెంటే ఉన్నారు. ఈ సందర్భంగా కేకే రాజుని సీఎం ఆత్మీయంగా పలకరించారు. ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు వేశారు. కుటుంబసభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.   (ఇది మీ మేనమామ ప్రభుత్వం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement