సాక్షి, విజయవాడ: విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెనుమార్పులు తెచ్చారని తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. కృష్ణలంక లోని పొట్టి శ్రీరాములు నగర పాలక సంస్థ పాఠశాలలో విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు.
‘‘అమ్మఒడి, విద్యాకానుక లాంటి పథకాలతో పేద విద్యార్థులకు అండగా నిలిచారు. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నారు. ఇంగ్లీషు మీడియంతో నూతన సంస్కరణలు తెచ్చారు. చదువే ఆస్తిగా విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ ఇస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో జగనన్న విద్యాకానుక కిట్ ద్వారా 10 వేలపైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని’’ ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఇది మీ మేనమామ ప్రభుత్వం)
చేతకాని దద్దమ్మలు మాట్లాడే మాటలు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని అవినాష్ మండిపడ్డారు. గతఐదేళ్లు ప్రజలు అధికారం ఇస్తే విద్యార్థులను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. అమరావతి, దావోస్, స్విట్జర్ ల్యాండ్ అంటూ కాలయాపన చేశారని దుయ్యబట్టారు. ఏనాడైనా అమ్మఒడి, విద్యాకానుక లాంటి ఒక్క పథకాన్నైనా తీసుకువచ్చారా అంటూ టీడీపీని నిలదీశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ అమలు చేస్తుంటే.. టీడీపీ నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో ప్రజలు టీడీపీకి మరింత బుద్ధి చెబుతారని దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. (చదవండి: ‘అందుకే ఎమ్మెల్యేలు టీడీపీని వీడుతున్నారు’)
Comments
Please login to add a commentAdd a comment