
సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 12వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు.
12వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా క్రోసూరు చేరుకుంటారు. అక్కడ ఏపీ మోడల్ స్కూల్ వద్ద పెదకూరపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి, ప్రసంగం అనంతరం విద్యార్ధులకు కిట్స్ అందజేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment