
అమరావతి: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తెస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
2023-24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ రెండు సెమిస్టర్‌లు, పదో తరగతికి సంబంధించి 2024-25 సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్‌లకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment