Semester system
-
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం
అమరావతి: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తెస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ రెండు సెమిస్టర్లు, పదో తరగతికి సంబంధించి 2024-25 సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్లకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. -
Andhra University: ఏయూ దూరవిద్య.. మరింత చేరువ
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): దూరవిద్య విధానం ద్వారా అందరికీ నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) పనిచేస్తోంది. విద్యార్థులు దేశంలో ఎక్కడ నుంచైనా సేవలు పొందే దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ఆన్లైన్లో బీకామ్, ఎంఏ సోషియాలజీ కోర్సులను అందిస్తున్న ఏయూ దూరవిద్య కేంద్రం మరిన్ని సేవలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, పరీక్షలకు దరఖాస్తు, ఫీజుల చెల్లించడం వంటి వాటిని ఆన్లైన్లోనే చేసేలా చర్యలు తీసుకుంది. ఇప్పటికే సెప్టెంబర్ 5న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయగా ఆన్లైన్లో 250 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 25 వరకు దరఖాస్తుకు అవకాశముంది. ఈ దూర విద్యా కోర్సులకు రెగ్యులర్ కోర్సుల తరహాలోనే సెమిస్టర్ విధానం ఉంటుంది. అదేవిధంగా గ్రేడింగ్ విధానం కూడా ప్రవేశపెట్టారు. విద్యార్థుల ముంగిటకే సేవలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం సులువుగా తమకు నచ్చిన కోర్సులను అభ్యసించేలా ఆన్లైన్లో ప్రవేశాలు పొందే అవకాశం ఏయూ కల్పిస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులు andhrauniversity.edu.inలో నిర్దేశిత లింక్‌ను క్లిక్ చేయాలి. అనంతరం లెర్నర్ ఎన్రోల్మెంట్పై క్లిక్ చేయాలి. అక్కడ విద్యార్థులు తమ వ్యక్తిగత, సామాజిక, విద్యా సంబంధ వివరాలు సమర్పించాలి. అలాగే పదో తరగతి, కులధ్రువీకరణ, విద్యార్హత తెలిపే సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. దీంతో దరఖాస్తు చేయడం పూర్తవుతుంది. ఆ తర్వాత కోర్సుల వారీగా నిర్దేశిత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వర్సిటీ అధికారులు.. విద్యార్థుల దరఖాస్తు, తదితర వివరాలను పరిశీలించి.. అర్హత ఉన్నట్లయితే ప్రవేశాన్ని ధ్రువీకరిస్తారు. ఫోన్లో ఇంటర్నెట్ ద్వారా కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి దూరవిద్యా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు. -
పాఠశాల విద్యలోనూ సెమిస్టర్లు!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలంటూ నూతన విద్యా విధానం–2019 ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ సారథ్యంలోని కమిటీ... పాఠశాల విద్యలోనూ సెమిస్టర్ విధానం తీసుకురావాలని ప్రతిపాదించింది. సెకండరీ విద్య పరిధిలోకి 8వ తరగతి నుంచి 12వ తరగతిని తీసుకొచ్చి ఏటా రెండు సెమిస్టర్ల చొప్పున 8 సెమిస్టర్లను అమలు చేయాలని పేర్కొంది. అలాగే వృత్తివిద్యను కూడా పాఠశాల విద్యలో భాగంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లతో అనుసంధానించాలని, వీలైతే ఆ రెండింటినీ ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి తెచ్చి స్కూల్ కాంప్లెక్స్ పేరుతో నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌తోపాటు క్లాస్రూమ్ డెమో అమలును తప్పనిసరి చేయాలని సూచించింది. మరోవైపు త్రిభాషా విధానాన్ని ఆరో తరగతి నుంచి అమలు చేయాలని పేర్కొంది. ఈ విషయంలో కమిటీ సిఫార్సులపై తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో అన్ని భాషలకు సమ ప్రాధాన్యం ఉంటుందని, ఏ భాషపైనా వివక్ష చూపబోమని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం కమిటీ సిఫారసులపై ఈ నెల 30 వరకు అభిప్రాయాలను సేకరిస్తున్నామని, ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ స్పష్టం చేసింది. కమిటీ సిఫారసుల్లో మరికొన్ని ప్రధానాంశాలు... సెకండరీ విద్యగానే కొనసాగింపు.. ►హయ్యర్ సెకండరీ విద్యను, సెకండరీ విద్యను కలిపి సెకండరీ విద్యగానే కొనసాగించాలి. అందులో సెమిస్టర్ విధానం అమలు చేయాలి. 9, 10, 11, 12 తరగతుల్లో సెమిస్టర్ విధానం తీసుకురావాలి. ఏటా రెండు సెమిస్టర్ల చొప్పున 8 సెమిస్టర్లు అమలు చేయాలి. ►హయ్యర్ సెకండరీ లేదా జూనియర్ కాలేజీ విధానం తొలగించాలి. 11వ తరగతి, 12వ తరగతి విధానం అమలు చేయాలి. దాన్నీ సెకండరీ విద్య పరిధిలోకి తేవాలి. ►కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన కొనసాగించాలి. వీలైతే 8వ తరగతి వరకు కూడా మాతృభాషనే అమలు చేయాలి. వృత్తి విద్యను పాఠశాల విద్యలో భాగంగా కొనసాగించాలి. ►అంగన్వాడీ కేంద్రాలను ప్రీస్కూళ్లతో విలీనం చేయాలి. అవకాశం ఉన్న చోట అంగన్వాడీ కేంద్రాలు, ప్రీ స్కూళ్లను, ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి తేవాలి. స్కూల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసి నిర్వహించాలి. – ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌ను మానవ వనరుల అభివృద్ధిశాఖ పరిధిలోనే కొనసాగించాలి. ►ఉపాధ్యాయ నియామకాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షతోపాటు 5–7 నిమిషాల క్లాస్రూమ్ డెమోను కచ్చితంగా అమలు చేయాలి. ►ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని 1:30గా కొనసాగించాలి. ఎన్నికల విధులకు టీచర్లను దూరం చేయాల్సిందే... ►ప్రతిభావంతులైన వారు ఉపాధ్యాయ విద్యలోకి వచ్చేలా ప్రోత్సాహించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మెరిట్ ఆధారిత స్కాలర్షిప్ ఇస్తూ దేశంలో ఎక్కడైనా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చదివేలా ప్రోత్సహించాలి. ►టీచర్లకు బోధనతో సంబంధంలేని ప్రభుత్వ పనులను తగ్గించాలి. ప్రస్తుతం టీచర్లు ఆ పనులతో బిజీగా ఉంటున్నారు. వాటిని నుంచి దూరం చేయాలి. ఎన్నికల విధుల్లో భాగస్వాములను చేయవద్దు. పాలన పనులను అప్పగించవద్దు. వారు పూర్తిగా బోధన, అభ్యసన పనుల్లోనే నిమగ్నం అయ్యేలా చేయాలి. ►ప్రతి టీచర్ తన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు కనీసం 50 గంటలు కేటాయించేలా చూడాలి. ►ప్రైవేటు పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ అనే పదాన్ని వినియోగించకూడదు. ఆ పదం కేవలం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకే ఉండాలి. ►ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. యూజీసీ స్థానంలో ఎన్హెచ్ఈఆర్ఏ... ►యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్థానంలో నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలి. దీని ఆధ్వర్యంలోనే మొత్తం ఉన్నత విద్యతోపాటు వృత్తి విద్యా కోర్సులను కూడా పర్యవేక్షించాలి. ►ఏఐసీటీఈ, ఎన్సీటీఈ తదితర సంస్థలన్నింటినీ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ సెట్టింగ్ బాడీస్‌గా మార్పు చేయాలి. ► ఆన్లైన్లో నిర్వహించే కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ►దూరవిద్యను కూడా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) పరిధిలోకి తీసుకురావాలి. దూరవిద్య అధ్యయన కేంద్రాలుగా నాణ్యతా ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలనే ఎంపిక చేయాలి. ►న్యాక్ గ్రేడింగ్ విధానాన్ని సమూలంగా మార్చేయాలి. గ్రేడింగ్ విధానం ఉండొద్దు. న్యాక్ గుర్తింపు ఉందా లేదా అనే విధానమే తీసుకురావాలి. ►ఉన్నత విద్యాసంస్థలకు అనుబంధ గుర్తింపు విధానం తొలగించాలి. అవన్నీ బోధన కాలేజీలుగా కొనసాగేలా చర్యలు చేపట్టాలి. ప్రైవేటు విద్యాసంస్థలకు పరిశోధన నిధులు... ►ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా ప్రాజెక్టుల కోసం నిధులు పొందేలా చర్యలు చేపట్టాలి. ►ప్రభుత్వ విద్యాసంస్థలతో సమానంగా ప్రైవేటు విద్యాసంస్థలకు ఎన్ఆర్ఎఫ్ ఫండింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. ►పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చేలా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడంతోపాటు దానికి అదనంగా ప్రస్తుతం ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐసీఎస్ఎస్ఆర్ సంస్థలను కొనసాగించాలి. ►నీట్ తరహాలో ఎంబీబీఎస్ పూర్తయ్యే సమయంలో ఎగ్జిట్ పరీక్షగా కామన్ పరీక్షను ప్రవేశపెట్టాలి. ► అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ కేడర్ల మధ్యలో స్థాయిలను కొనసాగించాలి. ►ఎంఫిల్ విద్యా విధానాన్ని తొలగించాలి. -
’డిగ్రీ’ లోనూ సెమిస్టర్స్
- మెమోల్లోనూ క్రెడిట్స్, గ్రేడింగ్ - మార్కుల విధానానికి స్వస్తి - వచ్చే విద్యా సంవత్సరం నుంచే .. పూర్తికావొచ్చిన సిలబస్ మార్పులు - త్వరలో తెలుగు అకాడమీ ముద్రణకు అప్పగింత సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీ కోర్సుల పరీక్షల విధానం, సిలబస్‌లో సమూల మార్పులకు ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇకపై అన్ని డిగ్రీ కోర్సుల్లోనూ సెమిస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఏడాదికి రెండు సెమిస్టర్ల చొప్పున మూడేళ్ల డిగ్రీ కోర్సులకు మొత్తం ఆరు సెమిస్టర్లను అమలు చేయనుంది. అలాగే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో (సీబీసీఎస్) భాగంగా అందించే క్రెడిట్ పాయింట్లు, గ్రేడింగ్ విధానాన్నే డిగ్రీ కోర్సుల్లో పాటించి మెమోల్లోనూ మార్కుల స్థానంలో వాటినే ముద్రించనుంది. ఇందుకు అనుగుణంగా ఏడాదిగా సాగిస్తున్న సిలబస్ రివిజన్ పూర్తి కావచ్చింది. సంప్రదాయ డిగ్రీల్లోని 17 సబ్జెక్టుల్లో సిలబస్ మార్పులు పూర్తవగా ఈ నెల 31లోగా మరో రెండు సబ్జెక్టుల సిలబస్‌లలో మార్పులు పూర్తి చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. మార్చిన సిలబస్‌లోనే 2016-17 విద్యా సంవత్సరంలో బోధన ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 31 తరువాత మారిన సిలబస్ మొత్తాన్ని తెలుగు అకాడమీకి అప్పగించి పుస్తకాల ముద్రణ పూర్తయ్యాక జూన్ నాటికి కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. సిలబస్ మార్పులపై ఇటీవల అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య...సిలబస్ మార్పులను అన్ని వర్సిటీలు తమ అకడమిక్ కౌన్సిళ్లలో ఆమోదించి జూన్ నుంచి పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. మరో 50 స్పెషలైజ్డ్ సబ్జెక్టుల్లోనూ.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిగ్రీ కోర్సుల్లో ఉన్న కోర్ సబ్జెక్టులతోపాటు వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు సొంతంగా, ప్రతే ్యకంగా నిర్వహిస్తున్న బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ వంటి 50కిపైగా స్పెషలైజ్డ్ సబ్జెక్టులను అందిస్తున్నాయి. ఇలాంటి ప్రత్యేక కోర్సులను ఒక్కో యూనివర్సిటీ ఒక్కో రకమైన కోర్సును కొనసాగిస్తోంది. కొన్ని ప్రధాన కాలేజీలూ పలు ప్రత్యేక సబ్జెక్టుల్లో యూనివర్సిటీ ఆమోదంతో డిగ్రీలను కొనసాగిస్తున్నాయి. అలాంటివన్నీ సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రస్థాయిలో అమలు చేసే కోర్ సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులను యూనివర్సిటీల ప్రొఫెసర్లతో ఉన్నత విద్యా మండలి చేయిస్తుందని, స్పెషలైజ్డ్ సబ్జెక్టుల సిలబస్‌లో స్థానికంగా యూనివర్సిటీలు, కాలేజీల పరిధిలోనే మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మల్లేశ్ స్పష్టం చేశారు. సిలబస్‌లో మార్పులు చేసిన సబ్జెక్టులు హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, సోషల్ వర్క్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కామర్స్ సబ్జెక్టుల్లో సిలబస్ మార్పులను ఉన్నత విద్యా మండలి గతంలో పూర్తి చేయగా ఇటీవల కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఇంగ్లిషు, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్ సిలబస్‌లలో మార్పులు చేసింది. ఈ నెల 31లోగా సైకాలజీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులు పూర్తికానున్నాయి. వివిధ సబ్జెక్టుల్లో ప్రధాన మార్పులు తెలుగు ద్వితీయ భాష, మోడర్ ్న లాంగ్వేజ్ తెలుగు సబ్జెక్టుల్లో తెలంగాణకు చెందిన ఆధునిక కవులకు పెద్దపీట. సివిల్స్, గ్రూపు-1 వంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా డిగ్రీలోని సోషియాలజీ, సోషల్ వర్క్, ఆంత్రోపాలజీ సబ్జెక్టుల్లో మార్పులు. కామర్స్‌లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొన్ని యూనిట్లకు చోటు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషనలో తెలంగాణ గ్రామ పరిపాలన వ్యవస్థకు పెద్దపీట. హిస్టరీలో దక్కన్ చరిత్రకు ప్రాధాన్యత. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, ప్రస్థానంపై ప్రముఖంగా పాఠ్యాంశాలు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వంటి సబె ్జక్టుల్లో సిలబస్ అప్‌గ్రేడ్. -
డిగ్రీ కాలేజీల్లో సెమిస్టర్ విధానం
-
డిగ్రీ కాలేజీల్లో సెమిస్టర్ విధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు అమలవుతున్న పరీక్షల విధానానికి బదులుగా సెమిస్టర్ పద్ధతిని అమలు చేయనున్నారు. ఉన్నత విద్యను పటిష్టపర్చడంలో భాగంగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు అన్ని యూనివర్సిటీలను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి, యూనివర్సిటీల వీసీలతో రాష్ట్ర గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. యూజీ కోర్సుల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సంస్కరణలకు సంబంధించి సిలబస్‌లో మార్పులు, పాఠ్యాంశాల రూపకల్పన వంటి అంశాల్లో ఉన్నత విద్యామండలి, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులన్నిటిలోనూ ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి ♦ అన్ని కాలేజీలు సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలి. ♦ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) పాట్రన్‌ను అనుసరించాలి. ♦ అన్ని కాలేజీలకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలి. ♦ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడేందుకు మొదటి సెమిస్టర్‌లోనే కార్యాచ రణ ప్రణాళికను తప్పనిసరిగా అమలుపరచాలి. ♦ సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలను మెరుగుపర్చడంతో పాటు బోర్డ్ ఆఫ్ స్టడీస్‌నుంచి అనుమతులు పొందాలి.