రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు అమలవుతున్న పరీక్షల విధానానికి బదులుగా సెమిస్టర్ పద్ధతిని అమలు చేయనున్నారు. ఉన్నత విద్యను పటిష్టపర్చడంలో భాగంగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు అన్ని యూనివర్సిటీలను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి, యూనివర్సిటీల వీసీలతో రాష్ట్ర గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. యూజీ కోర్సుల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.