సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు అమలవుతున్న పరీక్షల విధానానికి బదులుగా సెమిస్టర్ పద్ధతిని అమలు చేయనున్నారు. ఉన్నత విద్యను పటిష్టపర్చడంలో భాగంగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు అన్ని యూనివర్సిటీలను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి, యూనివర్సిటీల వీసీలతో రాష్ట్ర గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. యూజీ కోర్సుల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సంస్కరణలకు సంబంధించి సిలబస్‌లో మార్పులు, పాఠ్యాంశాల రూపకల్పన వంటి అంశాల్లో ఉన్నత విద్యామండలి, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులన్నిటిలోనూ ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి
♦ అన్ని కాలేజీలు సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలి.
♦ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) పాట్రన్‌ను అనుసరించాలి.
♦ అన్ని కాలేజీలకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలి.
♦ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడేందుకు మొదటి సెమిస్టర్‌లోనే కార్యాచ రణ ప్రణాళికను తప్పనిసరిగా అమలుపరచాలి.
♦ సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలను మెరుగుపర్చడంతో పాటు బోర్డ్ ఆఫ్ స్టడీస్‌నుంచి అనుమతులు పొందాలి.
డిగ్రీ కాలేజీల్లో సెమిస్టర్ విధానం
Published Sat, Jul 4 2015 3:42 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM
Advertisement