మోగిన బడి గంట | Schools opened across Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మోగిన బడి గంట

Published Tue, Jun 13 2023 5:18 AM | Last Updated on Tue, Jun 13 2023 5:18 AM

Schools opened across Andhra Pradesh - Sakshi

విశాఖలోని కేడీపీఎం స్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్లతో విద్యార్థులు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పాఠ­శాలలు తెరుచుకున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమో­దవుతున్న కారణంగా ఈనెల 17 వరకు ఉ.7.30 నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించా­లని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విష­యం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అన్ని పాఠశా­లల్లోను అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకు­న్నారు.

మరోవైపు.. ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదు­వుతున్న దాదాపు 43 లక్ష మంది విద్యా­ర్థుల కోసం ప్రభుత్వం సిద్ధంచేసిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని సోమవారం అన్ని పాఠశా­లల్లోను ప్రారంభించారు. అలాగే, గతంలో పాఠశా­లలు తెరిచిన తొలిరోజు 30 శాతం దాటని హాజరు, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం రోజే 57 శాతం హాజరు నమోదైనట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.

వీరిలో 61 శాతం మందికి విద్యా కానుక కిట్లను అందించారు. రెండోరోజు మంగళవారం నుం­చి కిట్ల పంపిణీని వేగవంతం చేసి వారం రోజు­ల్లో మొత్తం పంపిణీని పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక అన్ని పాఠశాలల్లోను ఉ.8.30–­9.00గంటల మధ్య విద్యార్థులకు రాగిజావ.. 11.30 గంటల తర్వాత మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement