
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రటిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా కానుక’ పథకం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు అవసరమైన వాటిని ప్రభుత్వం ఉచితంగా అందించడంపై సర్వత్రా స్వాగతిస్తున్నారు. తాము చదువుకునే ఇలాంటి పథకం లేనందుకు బాధగా ఉందని కొంతమంది తల్లిదండ్రులు తమ మనసులోని మాటను బయటపెట్టారు. తమ పిల్లల కోసం జననేత జగన్ ఇటువంటి పథకం ప్రవేశపెట్టినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందని హర్షామోదం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న సర్కారు తమ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటోందని విద్యార్థులు మురిసిపోతున్నారు. తమకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, బ్యాగ్‌లు, బూట్లు, సాక్సులు, బెల్ట్ అందించడంతో.. తమ తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గిందని చెబుతున్నారు. తమ కోసం మంచి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మనసారా ధన్యవాదాలు చెబుతున్నారు.
‘గతంలో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండేది. ప్రభుత్వం ఎప్పుడు స్కూళ్లు తెరుస్తుందా అని ఇప్పుడు విద్యార్థులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. జగనన్న విద్యాకానుక ఇవ్వడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. మా కాలంలో ఇలాంటి పథకం లేనందుకు బాధగా ఉంద’ని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సీఎం వైఎస్ జగన్ తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. (చదవండి: ఏపీలో రికార్డు స్థాయిలో పాఠ్యపుస్తకాల పంపిణీ)
బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు
స్కూళ్లలో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడం, ప్రాథమిక స్థాయి నుంచే అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి టెన్త్ వరకు కిట్ల పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కిట్‌కు సంబంధించిన వస్తువుల్లో ఎక్కడా రాజీ పడలేదని, అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని భరోసాయిచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదవాలనే ఉద్దేశంతో మూడు దశల్లో రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలు మారుస్తామని వెల్లడించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment