సాక్షి, విశాఖపట్నం: విద్యాకానుకపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంపై రామోజీరావు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీ ముందు తన మైండ్‌సెట్ మార్చుకోవాలని హితవు పలికారు. ఏపీలో ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యా శాఖకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా కానుక ఇచ్చారు. విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్స్ ఇంటర్నెట్ లేకున్నా పనిచేస్తాయి. ప్రతీ స్కూల్‌లో ఇంటర్నెట్ కోసం టెంబర్లు పిలిచాం. ప్రజా ధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు. ఆడిట్ పూర్తి కాకుండా అక్రమాలు జరిగినట్టు రాయడం నిజమైన జర్నలిజం కాదు అని విమర్శించారు.
ఇదే సమయంలో అమిత్ షా కామెంట్స్‌పై మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఏపీకి ఏమైనా ఎక్కువ నిధులు ఇచ్చిందా?. బీజేపీకి నిజంగా ఏపీపై ప్రేమ ఉంటే విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు అంటూ ప్రశ్నించారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. డ్యాన్స్‌లు వేసుకునే పవన్ వంటి వ్యక్తి ఏపీకి అవసరమా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్
Comments
Please login to add a commentAdd a comment