విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక ముందడుగు | CM Jagan Will Be Participating In Launching Of edX COURSES | Sakshi
Sakshi News home page

విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక ముందడుగు

Published Thu, Feb 15 2024 7:29 PM | Last Updated on Thu, Feb 15 2024 9:59 PM

CM Jagan Will Be Participating In Launching Of edX COURSES - Sakshi

సాక్షి, అమరావతి:  పేద, మధ్య తరగతి విద్యార్థులు సైతం అంతర్జాతీయ వర్సిటీలు అందించే కోర్సులను ఉచితంగా చదివేందుకు వీలు కల్పిస్తూ, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ 'ఎడెక్స్'తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం చేసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో.. రేపు(శుక్రవారం) సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ "ఎడెక్స్"ల మధ్య ఒప్పందం జరగనుంది. టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా రూపొందించిన ఎడెక్స్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ.

"ఎడెక్స్ ఒప్పందం" ముఖ్యాంశాలు
హార్వర్డ్, ఎంఐటీ, ఎల్ఎస్ఈ, కొలంబియా సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ.. తద్వారా మన విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన జాతీయ మరియు అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..

"ఎడెక్స్ ఒప్పందం"తో ప్రయోజనాలు
విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులు హార్వర్డ్, ఎంఐటీ, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులుబాటు.. ఆ యూనివర్సిటీ వారే ఆ సబ్జెక్టులకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ క్రెడిట్స్ మన కరిక్యులమ్లో భాగమవుతాయి. తద్వారా మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్ గా ఎదుగుతారు.

ఉన్నత విద్యలో జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు..
పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలు కల్పిస్తూ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.. జగనన్న వసతి దీవెన ద్వారా భోజన, వసతి సౌకర్యాలు, ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనే (జూన్ / జులై), చివరిలో ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ. జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా క్యూఎస్/టైమ్స్ ర్యాంకింగ్స్ 21 ఫ్యాకల్టీలలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 320 కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఆర్థిక సాయం. జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్‌తో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు. విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు. కరిక్యులమ్ లో భాగంగా సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్. తద్వారా విద్యార్థులు తాము చదువుతున్నకోర్సులతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఆన్‌లైన్‌లో నేర్చుకునే వెసులుబాటు.

కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్దిదిద్దడం. ఇప్పటికే 7 లక్షల మంది విద్యార్థులు 2 నెలల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్, 5.2 లక్షల మంది 2 నెలల షార్ట్ టర్మ్ ఇంటర్న్ షిప్ మరియు 2 లక్షల మంది 6 నెలల లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్స్ పూర్తి చేయగా మరో 3 లక్షల మంది విద్యార్థులు లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్స్ పూర్తి చేయనున్నారు. థియరీతో పాటు Industry oriented Courses చేయడం వల్ల 2018-19 విద్యా సంవత్సరంలో 37,000 ఉన్నప్లేస్ మెంట్స్ ఇప్పుడు (2022-23లో) 1 లక్షకు పెరిగింది.

నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, సెక్టార్ స్కిల్ కౌన్సిల్ లతో ఒప్పందం. 50 బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ప్రోగ్రామ్ లతోపాటు 159 సింగిల్ మేజర్ కోర్సులు. డిగ్రీ కోర్సులో 2వ సెమిస్టర్ నుంచి Al, IoT. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రియల్ ఎస్టేట్ మేనేజ్ మెంట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనాలసిస్ & ఇన్వెస్ట్ మెంట్స్, లాజిస్టిక్స్, రిస్క్ మేనేజ్ మెంట్, స్టాక్ ఎక్చేంజ్, సైబర్ ఫోరెన్సిక్స్ ఫైనాన్షియల్ మార్కెట్ అనాలసిస్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి మైనర్ కోర్సులు ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా అందుబాటులోకి. డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు.. 400కు పైగా ద్విభాషా పాడ్ క్యాస్టులు. రాష్ట్రంలోని 18 యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీకి మన జగనన్న ప్రభుత్వం సన్నాహాలు. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ ప్రారంభం.

మన విద్యార్థులను గ్లోబల్ విద్యార్థులుగా తయారు చేసే క్రమంలో ప్రపంచ ప్రముఖ యూనివర్సిటీలైన స్టెయిన్ బీస్- జర్మనీ, మెల్బోర్న్ ఆస్ట్రేలియా, కెంపెన్- జర్మనీ, బ్లెకింగ్-స్వీడన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బ్యాంకాక్ లతో అవగాహన ఒప్పందాలు. ఉన్నత విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయి వినియోగానికి చర్యలు. యూనివర్సిటీల్లో కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెటావర్స్ లెర్నింగ్ జోన్‌ల ఏర్పాటు. ఒక్కో జోన్ కు రూ.10 కోట్ల పెట్టుబడి.. ఇప్పటికే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభం. యువతలో సామాజిక సృహ, సమాజం పట్ల బాధ్యత పెంపొందించటానికి Board for Community Development through Education (BCDE)ఏర్పాటు  రాష్ట్ర వ్యాప్తంగా 553 ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు.. ఇప్పటి వరకు 10వేల మందికి పైగా నమోదు. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్థలు మాత్రమే NAAC గుర్తింపు పొందగా, ఈరోజు రాష్ట్రంలో NAAC గుర్తింపు పొందిన విద్యా సంస్థలు 437.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement