Jagananna Vidya Deevena 2021 Date: Starts On 29 November 2021, Deets Inside - Sakshi
Sakshi News home page

Jagananna Vidya Deevena 2021: 29న జగనన్న విద్యా దీవెన

Published Sat, Nov 20 2021 7:31 AM | Last Updated on Sat, Nov 20 2021 9:04 AM

Ys Jagananna Vidya Deevena Programme In Andhra Pradesh - Sakshi

మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.

ఇటీవల జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పరిశ్రమలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా..

► ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలుకు 432 కొత్త 104 వాహనాలు కొనడానికి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌కు పాలనాపరమైన అనుమతులు మంజూరు. ఇందుకోసం రూ. 107.16 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.

 ఆంధ్రప్రదేశ్‌ మెడిసినల్‌ అండ్‌ ఆరోమేటిక్‌ ప్లాంట్స్‌ బోర్డ్‌లో 8 పోస్టుల మంజూరు. డిప్యుటేషన్‌ విధానంలో 4,  ఔట్‌సోర్సింగ్‌ విధానంలో 4 పోస్టుల భర్తీ.

  ఈ నెల 16వ తేదీన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు గ్రీన్‌ సిగ్నల్‌

 వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో డిక్సన్‌ టెక్నాలజీస్‌కు నాలుగు షెడ్ల కేటాయింపు, ఇన్సెంటివ్‌లకు ఆమోదం.

 డిక్సన్‌ ఏర్పాటు చేయనున్న మరో యూనిట్‌కు 10 ఎకరాలు కేటాయింపు.

 రాజమహేంద్రవరం నగరం నామవరం గ్రామంలో 5 ఎకరాల భూమి ముంబైకి చెందిన మహీంద్రా వేస్ట్‌ టు ఎనర్జీ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌కు 20 సంవత్సరాలపాటు లీజుకు కేటాయింపు.

 తాడేపల్లి మండలంలో హేకృష్ణ ధార్మిక సంస్థకు 6.5 ఎకరాల భూమి లీజు పద్ధతిలో కేటాయింపు

 శ్రీకాకుళం జిల్లా పొందూరు డిగ్రీ కాలేజీలో 27 టీచింగ్‌ పోస్టులు, 15 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు. 15 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఒక పోస్టు పదోన్నతి మీద, మిగిలినవి అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియామకం.

 విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో 21.67 ఎకరాల పోరంబోకు భూమి గిరిజన మ్యూజియం, బొటానికల్‌ గార్డెన్, టూరిజం డెవలప్‌మెంట్‌కు కేటాయింపు.

 ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌లో 16 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం.

 ఏపీ హైకోర్టులో మీడియేషన్‌ సెంటర్‌ అండ్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (డొమెస్టిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

  ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌ చట్టంలో సవరణలకు ఆమోదం. కేటాయించిన ఇంటి çస్థలం 20 ఏళ్లకు కాకుండా 10 ఏళ్లకే విక్రయించుకునేందుకు అనుమతి.

  శ్రీ వేంకటేశ్వర మెడికల్‌ కాలేజీని మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టేముసాయిదా బిల్లుకు ఆమోదం

 ఆంధ్రప్రదేశ్‌ పశు పునరుత్పత్తి (పశు వీర్య ఉత్పత్తి, విక్రయం, కృత్రిమ గర్భోత్పత్తి సేవల క్రమబద్ధీకరణ) బిల్లుకు ఆమోదం.

 మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ 1955కు సవరణల బిల్లుకు ఆమోదం.

 రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, అర్చక సంక్షేమం కోసం కామన్‌ గుడ్‌ ఫండ్‌ ఏర్పాటుకు, ఈఏఎఫ్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌. దీనికి సంబంధించి చట్టంలో సవరణల బిల్లుకు ఆమోదం. అసెంబ్లీ ముందుకు బిల్లు.

 ధార్మిక పరిషత్తు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటుకు దేవాదాయ శాఖ చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం

 ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం.

 ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ యూనివర్శిటీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ చట్టంలో సవరణలకు ఆమోదం.

 ఉన్నత విద్యా శాఖలో ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌లో సవరణ బిల్లుకు ఆమోదం.

 జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్శిటీ యాక్ట్‌కు సంబంధించిన సవరణ బిల్లుకు ఆమోదం. విజయనగరం జేఎన్టీయూ కాలేజీ పేరు విజయనగరం జేఎన్టీయూ జీవీ (గురజాడ విజయనగరం)గా మార్పు.

 ఉన్నత విద్యా శాఖలో ఏపీ యూనివర్శిటీ చట్టం 1991లో సవరణలకు ఆమోదం. ఆచార్య నాగార్జున ఒంగోలు పీజీ క్యాంపస్‌ను పేర్నిమిట్టకు మారుస్తూ నిర్ణయం.

 కొత్తగా ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఏర్పాటు

  ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (రిజర్వేషన్‌ ఇన్‌ టీచర్స్‌ క్యాడర్‌)–2021 బిల్లుకు ఆమోదం.

 వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌ యాక్ట్‌ 1971లో సవరణల బిల్లుకు ఆమోదం

 ఆంధ్రప్రదేశ్‌ సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపు విమెన్‌ కో కంట్రిబ్యూటరీ పెన్షన్‌ యాక్ట్‌ 2009కు సవరణలు చేస్తూ కేబినెట్‌ ఆమోదం.

 ఏపీ పంచాయతీరాజ్‌ యాక్ట్‌–1994లో సవరణలకు ఆమోదం. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో 2వ వైస్‌ చైర్మన్‌ పదవుల కోసం ఉద్దేశించిన సవరణలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు, ఇతర కులాల కార్పొరేషన్ల చైర్‌పర్సన్లకు జిల్లా పరిషత్‌ సమావేశాల్లో శాశ్వత ఆహ్వానితులుగా అవకాశమిస్తూ చట్ట సవరణకు ఆమోదం.

 ఆంధ్రప్రదేశ్‌ సినిమా రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1955 చట్టంలో సవరణలకు ఆమోదం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement