implement
-
ఆ రాష్ట్రాలకు పౌరసత్వ సవరణ చట్టం నుంచి మినహాయింపు?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులతో సహా ముస్లిమేతర వలసదారులకు ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని ఇవ్వనుంది. అయితే కొన్ని రాష్ట్రాలను ఈ చట్టం పరిధి నుంచి తప్పించారు. ఆ రాష్ట్రాలు ఏవి? ఎందుకు మినహాయింపునిచ్చారు? మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లోని పలు గిరిజన ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయరు. వీటిలో రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక హోదా మంజూరైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయాణానికి ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ (ఐఎల్పీ) అవసరమయ్యే అన్ని ఈశాన్య రాష్ట్రాలలో సీఏఏ చట్టం అమలు చేయరు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్లకు ఐఎల్పీ వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో స్వయంప్రతిపత్తి గల కౌన్సిళ్లుగా ఏర్పడిన గిరిజన ప్రాంతాలను కూడా సీఏఏ పరిధి నుంచి తప్పించారు. అసోం, మేఘాలయ, త్రిపురలలో ఇటువంటి స్వయం ప్రతిపత్తి కౌన్సిళ్లు ఉన్నాయి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందూయేతరులు తొలుత తాము ఈ మూడు దేశాలలో ఎక్కడైనా నివాసితులుగా నిరూపించుకోవాలి. అప్పుడే వారికి భారత పౌరసత్వం వర్తిస్తుంది. ఇందుకోసం వారు వారి పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, అక్కడ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా సర్టిఫికేట్ లేదా లైసెన్స్, భూమి పత్రాలను సంబంధిత అధికారులకు చూపించవలసి ఉంటుంది. -
ఇకపై ఈ ప్రాంతాలకు 'ఆర్ ఆర్ ఆర్' (RRR)
గజ్వేల్: ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు)కు సంబంధించి ఉత్తర భాగంలో చేపట్టాల్సిన భూసేకరణ, సామగ్రి తరలింపు అంశాలపై సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో సహజంగానే ట్రిపుల్ ఆర్ వ్యవహారంలోనూ కొంత స్తబ్దత ఏర్పడింది. ప్రస్తుతం అధికారిక కార్యక్రమాలన్నీ వేగవంతమవుతున్న నేపథ్యంలో ట్రిపుల్ఆర్ విషయంలో ముందడుగుపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అంశం కీలక దశకు చేరుకుంది. భూసేకరణ, రోడ్డు నిర్మాణం కోసం గుర్తించిన స్థలంలో అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, టవర్లు, ఇతర సామగ్రి పక్కకు తరలించే పనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ఉత్తర భాగంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని (సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి) పనులు జరగనున్నాయి. భూసేకరణను చేపట్టడానికి రెవెన్యూడివిజన్ల వారీగా కాలా (కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వజైషన్)లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే చౌటుప్పల్, యాదాద్రి, అందోల్–జోగిపేటతోపాటు గజ్వేల్, తూప్రాన్, భువనగిరి కాలాల పరిధిలోనూ త్రీడీ నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఎనిమిది కాలాల పరిధిలోని 84 గ్రామాల్లో 4700 ఎకరాల వరకు భూసేకరణ జరగనుండగా.. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలను సేకరించనున్నారు. ఉత్తర భాగం రీజినల్ రింగు రోడ్డు నిడివి 158 కిలోమీటర్లు కాగా ఇందులో 100 కిలోమీటర్ల వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తరించనున్నది. సామగ్రి తరలింపునకు చర్యలు ఉత్తర భాగంలో నిర్మించనున్న ట్రిపుల్ఆర్ రోడ్డు గుర్తించిన భూముల్లో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, టవర్లు, ఇతర సామగ్రి తరలింపునకు చర్యలు తీసుకోనున్నాం. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. పూర్తికాగానే పనులు ప్రారంభమవుతాయి. భూసేకరణ అంశంలోనూ ముందడుగు పడనుంది. – రాహుల్, ఎన్హెచ్ఏఐ డిప్యూటీ మేనేజర్ ఇవి చదవండి: కోడళ్లకు అక్కడ 'నో రేషన్‌కార్డు'.. -
‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది?
దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా గ్రాప్- 3ని కూడా అమలులోకి తీసుకువచ్చారు. దేశ రాజధానిలో కాలుష్య స్థాయి ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకోవడంతో ఢిల్లీ-ఎన్సీఆర్లో పలు నిర్మాణ పనులను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు నిలిపివేశారు. డీజిల్‌తో నడిచే ట్రక్కులను దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణలో గ్రాప్-3 అనేది మూడవ దశలో భాగం. ఇది చలికాలంలో ఢిల్లీ అంతటా అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించిన వాయు కాలుష్య నిర్వహణ వ్యూహం. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 402గా ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత పరిస్థితిని పరిశీలించడానికి జరిగిన సమావేశంలో ఈ ప్రాంతంలోని కాలుష్యాన్ని పరిష్కరించడానికి చర్యలను రూపొందించే బాధ్యత చేపట్టిన సీఏక్యూఎం ఏజెన్సీ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. గ్రాప్ అనేది నాలుగు దశలుగా విభజించిన విధానం. వీటిని ‘పూర్’ (ఏక్యూఐ 201-300), ‘వెరీ పూర్’ (ఏక్యూఐ 301-400), ‘తీవ్రమైన’ (ఏక్యూఐ 401-450), ‘మరింత తీవ్రమైన’ (ఏక్యూఐ >450)వర్గాలుగా పేర్కొన్నారు. గ్రాప్ స్టేజ్-3లో కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టులు, ముఖ్యమైన మైనింగ్, స్టోన్ బ్రేకింగ్ కార్యకలాపాలు మినహా అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తారు. ఢిల్లీకి బయట రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాలతో పాటు డీజిల్‌తో నడిచే ట్రక్కులు, మధ్యస్థ, భారీ కంటెయినర్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధించారు. ఇది కూడా చదవండి: కాలుష్య భూతం: టెక్ కంపెనీల కీలక చర్యలు -
మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్ణం: రాహుల్ గాంధీ
ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఓబీసీలను బీజేపీ గాలికొదిలేస్తోందని ఆరోపించారు. ఇప్పుడున్న వ్యవస్థలో ఓబీసీలకు ప్రభుత్వం ఏం ప్రాధాన్యత ఇస్తుందో చెప్పాలని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. మహిళా బిల్లులో ఓబీసీ ప్రస్తావనే లేదని అన్నారు. మద్దతు ఇస్తున్నాం.. కానీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాను మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్న రాహుల్ గాంధీ.. కుల గణన చేపట్టి అత్యధిక జనాభా ఉన్న వర్గాలవారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి మారేప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించకపోవడంపై రాహుల్ ప్రశ్నించారు. 90లో ముగ్గురు మాత్రమే.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 90 సెక్రటరీల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ జాబితాలో ఉన్నారని రాహుల్ చెప్పారు. బడ్జెట్లో కేవలం 5 శాతం మాత్రమే వారి ఆధీనంలో ఉందని అన్నారు. కుల గణన చేయడంతోపాటు మహిళా బిల్లులో ఓబీసీలకు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే అమలు చేయండి.. పంచాయతీ రాజ్ వ్యవస్థే మహిళలకు అధికారం ఇచ్చిందని, అన్నాళ్ల తర్వాత ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు మరో కీలక పరిణామం అని ఆయన అన్నారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి తీసుకురావడంపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేటి నుంచి ఈ బిల్లు అమలులోకి రావాలని డిమాండ్ చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని అన్నారు. ఇదీ చదవండి: కొత్త పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ స్థానంలో కూర్చున్న తొలి తెలుగు ఎంపీగా మిథున్ రెడ్డి రికార్డు. -
విజయవంతంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
-
పంచాయతీల్లో..ఆన్ లైన్ పేమెంట్
-
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట లభించింది. బ్యాటరీలకు సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాల అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం.. నూతన బ్యాటరీ భద్రతా ప్రమాణాలను రెండంచెల్లో అమలు చేయనున్నారు. మొదటి దశ నిబంధనలు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. రెండో దశ నిబంధనలు 2023 మార్చి 31 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రమాదాలకు కారణం బ్యాటరీలేనని తేలింది. దీంతో నిపుణుల సూచనల మేరకు కేంద్ర రవాణా శాఖ అదనపు భద్రతా ప్రమాణాలను రూపొందించి, ఆ మేరకు నిబంధనల్లో సవరణలు చేసింది. బ్యాటరీ సెల్స్, ఆన్ బోర్డ్ చార్జర్, బ్యాటరీ ప్యాక్ డిజైన్, వేడిని తట్టుకోగలగడం తదితర అంశాల విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. -
29న జగనన్న విద్యా దీవెన
సాక్షి, అమరావతి: ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా.. ► ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు 432 కొత్త 104 వాహనాలు కొనడానికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌కు పాలనాపరమైన అనుమతులు మంజూరు. ఇందుకోసం రూ. 107.16 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. ► ఆంధ్రప్రదేశ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ బోర్డ్‌లో 8 పోస్టుల మంజూరు. డిప్యుటేషన్ విధానంలో 4, ఔట్సోర్సింగ్ విధానంలో 4 పోస్టుల భర్తీ. ► ఈ నెల 16వ తేదీన ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ► వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో డిక్సన్ టెక్నాలజీస్‌కు నాలుగు షెడ్ల కేటాయింపు, ఇన్సెంటివ్‌లకు ఆమోదం. ► డిక్సన్ ఏర్పాటు చేయనున్న మరో యూనిట్‌కు 10 ఎకరాలు కేటాయింపు. ► రాజమహేంద్రవరం నగరం నామవరం గ్రామంలో 5 ఎకరాల భూమి ముంబైకి చెందిన మహీంద్రా వేస్ట్ టు ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్‌కు 20 సంవత్సరాలపాటు లీజుకు కేటాయింపు. ► తాడేపల్లి మండలంలో హేకృష్ణ ధార్మిక సంస్థకు 6.5 ఎకరాల భూమి లీజు పద్ధతిలో కేటాయింపు ► శ్రీకాకుళం జిల్లా పొందూరు డిగ్రీ కాలేజీలో 27 టీచింగ్ పోస్టులు, 15 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు. 15 నాన్ టీచింగ్ పోస్టులు ఒక పోస్టు పదోన్నతి మీద, మిగిలినవి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకం. ► విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో 21.67 ఎకరాల పోరంబోకు భూమి గిరిజన మ్యూజియం, బొటానికల్ గార్డెన్, టూరిజం డెవలప్మెంట్కు కేటాయింపు. ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో 16 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం. ► ఏపీ హైకోర్టులో మీడియేషన్ సెంటర్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ (డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ► ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టంలో సవరణలకు ఆమోదం. కేటాయించిన ఇంటి çస్థలం 20 ఏళ్లకు కాకుండా 10 ఏళ్లకే విక్రయించుకునేందుకు అనుమతి. ► శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజీని మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టేముసాయిదా బిల్లుకు ఆమోదం ► ఆంధ్రప్రదేశ్ పశు పునరుత్పత్తి (పశు వీర్య ఉత్పత్తి, విక్రయం, కృత్రిమ గర్భోత్పత్తి సేవల క్రమబద్ధీకరణ) బిల్లుకు ఆమోదం. ► మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955కు సవరణల బిల్లుకు ఆమోదం. ► రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, అర్చక సంక్షేమం కోసం కామన్ గుడ్ ఫండ్ ఏర్పాటుకు, ఈఏఎఫ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించి చట్టంలో సవరణల బిల్లుకు ఆమోదం. అసెంబ్లీ ముందుకు బిల్లు. ► ధార్మిక పరిషత్తు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు దేవాదాయ శాఖ చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం ► ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్శిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టంలో సవరణలకు ఆమోదం. ► ఉన్నత విద్యా శాఖలో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్‌లో సవరణ బిల్లుకు ఆమోదం. ► జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ యాక్ట్‌కు సంబంధించిన సవరణ బిల్లుకు ఆమోదం. విజయనగరం జేఎన్టీయూ కాలేజీ పేరు విజయనగరం జేఎన్టీయూ జీవీ (గురజాడ విజయనగరం)గా మార్పు. ► ఉన్నత విద్యా శాఖలో ఏపీ యూనివర్శిటీ చట్టం 1991లో సవరణలకు ఆమోదం. ఆచార్య నాగార్జున ఒంగోలు పీజీ క్యాంపస్‌ను పేర్నిమిట్టకు మారుస్తూ నిర్ణయం. ► కొత్తగా ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఏర్పాటు ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్)–2021 బిల్లుకు ఆమోదం. ► వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ యాక్ట్ 1971లో సవరణల బిల్లుకు ఆమోదం ► ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు విమెన్ కో కంట్రిబ్యూటరీ పెన్షన్ యాక్ట్ 2009కు సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదం. ► ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్–1994లో సవరణలకు ఆమోదం. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో 2వ వైస్ చైర్మన్ పదవుల కోసం ఉద్దేశించిన సవరణలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు, ఇతర కులాల కార్పొరేషన్ల చైర్పర్సన్లకు జిల్లా పరిషత్ సమావేశాల్లో శాశ్వత ఆహ్వానితులుగా అవకాశమిస్తూ చట్ట సవరణకు ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 చట్టంలో సవరణలకు ఆమోదం. -
ఏపీ విద్యాశాఖ మరో సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన..
-
ప్రజల ముంగిట ఫిర్యాదు బాక్సులు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో భారీ ప్రక్షాళన మొదలైంది. క్షేత్రస్థాయి నుంచి అవినీతి నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. వివిధ సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు విద్యుత్తు శాఖ కార్యాలయాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి గురువారం తెలిపారు. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా వినియోగదారులు కమిషన్ దృష్టికి పలు అంశాలను తెచ్చారు. కొత్త కనెక్షన్లు, తప్పుగా ముద్రించిన విద్యుత్తు బిల్లులు, ట్రాన్స్ఫార్మర్లు మార్చుకునేందుకు వినియోగదారులు రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. లో వోల్టేజీ, వేలాడే విద్యుత్ తీగలతో సమస్యలు ఎదురవుతున్నట్లు ఏపీఈఆర్సీ దృష్టికి తెచ్చారు. దీనిపై కిందిస్థాయి సిబ్బంది వెంటనే స్పందించడం లేదనే ఫిర్యాదులందాయి. సిబ్బంది అవినీతి వ్యవహారాలపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తూ కమిషన్ చర్యలు చేపట్టింది. ఫిర్యాదు బాక్సులు ఇలా... ►ప్రతి అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అడిషనల్ డివిజినల్ ఇంజనీర్ (ఏడీఈ), జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) కార్యాలయాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తారు. ►ఫిర్యాదు బాక్సుల తాళాలు పై అధికారుల వద్ద మాత్రమే ఉండాలని నిబంధన విధించారు. ►ప్రతి నెల మొదటి తారీఖున ఫిర్యాదు బాక్సులను తెరిచి వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలి. ►ఫిర్యాదు వివరాలు ఉన్నతాధికారులకూ వెళ్తాయి. ►ఫిర్యాదును గుర్తించిన 48 గంటల్లోగా పరిష్కారం చూపించాలి. అది కూడా సంస్థ వెబ్సైట్లో పేర్కొనాలి. ►ఫిర్యాదు చేసే వ్యక్తులు కరెంట్ బిల్లు, పూర్తి వివరాలను అందులో పొందుపర్చాలి. ►అవసరమైతే జిల్లా, రాష్ట్ర కార్యాలయాలకూ ఫిర్యాదులు పంపవచ్చు. ►ఫిర్యాదు బాక్సులపై అన్ని విద్యుత్ సంస్థల వెబ్పోర్టర్లలో ప్రజలకు అర్థమయ్యేలా వివరాలు వెల్లడించాలి. ►అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించకపోయినా, లంచాల కోసం వేధించినా ఫిర్యాదు చేయవచ్చు. కఠిన చర్యలుంటాయి ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై ప్రతి మూడు నెలలకోసారి ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతుంది. ఫిర్యాదుల వివరాలు, అపరిష్కృతంగా ఉంటే కారణాలను వెల్లడించాలి. ఏపీఈఆర్సీ ఈ వ్యవస్థను స్వయంగా పర్యవేక్షిస్తుంది. మా ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినా, విద్యుత్ వినియోగదారులను లంచాల కోసం వేధించినా కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యుత్ వ్యవస్థ తమదనే భావన ప్రజలకు కల్పించడం కోసమే సరికొత్త చర్యలు చేపట్టాం. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ -
‘ఆయుష్మాన్ భారత్’ను వద్దంటున్న రాష్ట్రాలు
న్యూఢిల్లీ : దేశంలోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అమలవుతోన్న ఈ పథకం 5 బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో అమలుకావడం లేదు. తెలంగాణ, ఢిల్లీ, ఒడిషా, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని తెలిసింది. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు తమ సొంత హెల్త్ స్కీమ్‌ను అనుసరిస్తున్నట్లు తెలిసింది. ఆయుష్మాన్ భారతం కంటే కూడా తమ అమలుచేస్తోన్న హెల్త్ స్కీం ఎంతో బాగున్నట్లు ఆయా రాష్ట్రాలు భావిస్తున్నట్లు సమాచారం. దీని గురించి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పథకం కన్నా తాము రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ మెరుగ్గా ఉందని, ఆయుష్మాన్ భారత్ నిబంధనలు కఠినంగా ఉన్నందున రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గే ప్రమాదముందని వివరించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎంతో పటిష్టంగా అమలవుతోందని, కాబట్టి కేంద్ర పథకంలో చేరబోమని, ఒకవేళ రాష్ట్రానికి అనుగుణంగా మార్పులు చేస్తే పరిశీలిస్తామని తెలిపింది. మిగతా రాష్ట్రాలు కూడా తమ తమ అభ్యంతరాలను తెలిపినట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని మోదీ పేదల పాలిట సంజీవనిగా వర్ణిస్తుండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీన్ని ఓ పీఆర్ ఎక్సర్సైజ్ కార్యక్రమం అంటూ విమర్శించారు. -
అమలు చేసేదెట్లా?
జీఎస్టీపై వాణిజ్య పన్నుల శాఖలో ఆందోళన.. రేపు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తు సేవల పన్ను ♦ ఇప్పటికే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో 22% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జీఎస్టీ అమలు చేయాలంటే మరో 22% పోస్టులు కావాలి. ఉద్యోగులకు జాబ్‌చార్ట్ ఏమిటో తేలకపోవడం సమస్యగా మారింది. సర్కిళ్లు, డివిజన్లను పెంచక పోవడంతో పనిఒత్తిడి తీవ్రం కానుంది. ♦ రూ.1.5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న డీలర్లలో 90% వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించాలని.. 10% సెంట్రల్ ఎక్సైజ్‌కు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో సమస్య తలెత్తింది. దీంతో 1.70 లక్షల మంది డీలర్లను వాణిజ్య శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ♦ జీఎస్టీ అమలులో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కొరత మరో సమస్యగా పరిణమించింది. పోర్టల్ బిజీగా ఉండి స్తంభిస్తుండటంతో.. డీలర్లు రిజిస్ట్రేషన్లకు ధ్రువపత్రాలను సమర్పించడంలో జాప్యమవు తోంది. ఇక డీలర్లు ప్రతినెలా సమర్పించాల్సిన వివరాల పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేయలేదు. ప్రతిష్టాత్మకంగా అమల్లోకి వస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు చుక్కలు చూపుతోంది. అసలే సిబ్బంది కొరత.. ఇప్పటికే 22 శాతం పోస్టులు ఖాళీగా ఉండడం.. ఆపై జీఎస్టీ కోసం అదనంగా మరో 22 శాతం సిబ్బంది అవసరం కావడం ఇబ్బందికరంగా మారింది. డీలర్ల సంఖ్యకు అనుగుణంగా సర్కిళ్లు, డివిజన్లను ఏర్పాటు చేయకపోవడం.. ఉద్యోగులకు ఇంకా జాబ్‌చార్ట్ ఏమిటో తేలకపోవడం.. తగిన సంఖ్యలో కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం.. వెబ్ పోర్టల్ సమస్యలు వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి పరిష్కారంపై వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతా ధికారులు దృష్టి సారించినా... జీఎస్టీ అమల్లోకి వచ్చాక రెండు, మూడు నెలల వరకు సమస్యలు కొనసాగే అవకా శాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శాఖ పునర్వ్యవస్థీకరణ కోసం ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. – సాక్షి, హైదరాబాద్ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు? వాస్తవానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ అమలు బాధ్యత రెండు శాఖలపై పెట్టారు. ఒకటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ ఎక్సైజ్ శాఖ కాగా, మరొకటి ఆయా రాష్ట్రాల పరిధిలో ఉండే వాణిజ్య పన్నుల శాఖ. అయితే కేంద్ర పరిధిలోని సెంట్రల్ ఎక్సైజ్ శాఖ జీఎస్టీ చట్టం అమలుకు అనుగుణంగా రాష్ట్రంలో తన శాఖను పునర్వ్యవస్థీకరించుకుంది. తమ అధీనంలోకి వచ్చే డీలర్ల సంఖ్యకు అనుగుణంగా 8 కమిషనరేట్లు, 30 డివిజన్లు, 150 సర్కిళ్లను ఏర్పాటు చేసుకుని సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మాత్రం ఇంకా ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ చేయలేదు. పదేళ్ల క్రితం నుంచి ఉన్న ఒక కమిషనరేట్, 12 డివిజన్లు, 91 సర్కిల్ కార్యాలయా లతోనే జీఎస్టీ అమలుకు సిద్ధమయింది. డీలర్ల లెక్క తేలకనే.. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పూర్తిగా సిద్ధం కాకపోవడానికి ఇతర కారణాలూ ఉన్నాయని చెబుతున్నారు. జీఎస్టీ కౌన్సిల్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయడంతో కొన్ని రాష్ట్రాల్లో మినహా దేశవ్యాప్తంగా ఈ సమస్య నెలకొందని అంటున్నారు. ముఖ్యంగా రూ.1.5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న డీలర్లలో 90 శాతం వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించాలని.. కేవలం 10 శాతమే సెంట్రల్ ఎక్సైజ్‌కు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో సమస్య తలెత్తిందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని దాదాపు 3 లక్షల మంది డీలర్లలో 60 శాతం మంది రూ.1.5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న వారే. అందులో 90 శాతం అంటే దాదాపు 1.70 లక్షల మంది డీలర్లను వాణిజ్య పన్నుల శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేగాకుండా రూ.1.5 కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న డీలర్ల పన్ను చెల్లింపులతో పోలిస్తే తక్కువ టర్నోవర్ ఉన్న వారి పన్ను చెల్లింపులు అంత పారదర్శకంగా ఉండవనే అభిప్రాయముంది. డీఫాల్టర్లు, రిటర్నులు ఇవ్వని డీలర్లు ఈ జాబితాలోనే ఎక్కువగా ఉంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖపై అదనపు భారం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక జీఎస్టీ అమలుకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఉన్నతాధికారులు కార్యాచరణ వేగవంతం చేశారు. ఉద్యోగ సంఘాలు కోరినన్ని కాకపోయినా సర్కిళ్లు, డివిజన్లు పెంచే ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగుల్లో ఆందోళన కనీసం 2 వేల మంది డీలర్లకు ఒక సర్కిల్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 153 సర్కిళ్లు, 20 డివిజన్లు, తొమ్మిది కమిషనరేట్లు, ఒక చీఫ్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా పదోన్నతులిచ్చి దాదాపు 1,600 ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతున్నాయి. ఇక జీఎస్టీ అమలుపై ఏర్పాటు చేసిన శాఖాపరమైన కమిటీ కూడా కొత్తగా 5 కమిషనరేట్లు, 8 డివిజన్లు, 49 సర్కిళ్లు ఏర్పాటు చేసి 864 పోస్టులను భర్తీ చేయాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో శాఖ పునర్వ్యవస్థీకరణపై తర్జనభర్జన జరుగుతోంది. ఇక రెండు, మూడు రోజుల్లోనే (జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశం ముగిసిన తర్వాత) ఉద్యోగుల జాబ్‌చార్ట్ కూడా వెలువడనుంది. తప్పని ఆన్లైన్ తంటాలు జీఎస్టీ అమలు విషయంలో రాష్ట్రంలో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కొరత మరో సమస్యగా పరిణమించింది. పోర్టల్ బిజీగా ఉండి స్తంభించిపోతుండడంతో.. డీల ర్లు రిజిస్ట్రేషన్ల కోసం సమర్పించాల్సిన ధ్రువపత్రా లను తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. దీనికి తోడు డీలర్లు సమర్పించాల్సిన వివరాలకు సంబం« దించి చాంతాడంత జాబితా ఉండడంతోనూ రిజిస్ట్రేష న్కు చాలా సమయం తీసుకుంటోంది. ఇక డీలర్లు ప్రతినెలా సమర్పించాల్సిన, అప్లోడ్ చేయాల్సిన వివరాలకు సంబంధించి ఇంతవరకు పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేయలేదు. మరోవైపు జీఎస్టీ అమలు కోసం ప్రతి అధికారికి డిజిటల్ సిగ్నేచర్ ఉండడం, దాని ద్వారానే లాగిన్ అవ్వాల్సి ఉండడంతో సర్కిల్ కార్యాలయాల్లో కంప్యూటర్ల కొరత ఏర్పడనుంది. సర్కిళ్ల పెంపుపై ప్రతిపాదనలు జీఎస్టీ అమలు నేపథ్యంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల ఉద్యోగుల జేఏసీ నేతృత్వంలో ఆ శాఖ ఉద్యోగులు బుధ వారం కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమ య్యారు. వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ ఆఫీసర్ల అసోసియే షన్ (టీసీటీజీవోఏ), వాణిజ్య పన్నుల శాఖ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీసీటీఎన్జీఓసీఏ), వాణి జ్య పన్నుల శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం (టీసీ టీసీ– ఐVఏ) ప్రతినిధులు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికీ జీఎస్టీ వల్ల ఇబ్బంది ఉండదని, పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని సర్కిళ్ల పెంపు ప్రతిపాదనలను కూడా ప్రభుత్వానికి పంపించామని ఈ సందర్భంగా కమిషనర్ చెప్పినట్టు సమాచారం. త్వరగా పునర్వ్యవస్థీకరించాలి ‘‘జీఎస్టీ అమలు కోసం వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్య వస్థీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా విజ్ఞప్తి మేరకు ప్రతిపా దనలు సిద్ధం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, అధికారులకు కృతజ్ఞ తలు తెలియజేస్తున్నాం. కానీ ఇది ఇప్పటికే ఆలస్యమైంది. వీలైనంత త్వరగా పున ర్వ్యవస్థీకరణపై కసరత్తు పూర్తి చేయాలి. అవసరమైన మేరకు ఉద్యోగులను పెంచుకుని సర్కిళ్లు, డివిజన్లు, కమిషనరేట్లు పెంచాలి..’’ – తూంకుంట వెంకటేశ్వర్లు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ -
జూలై 1 నుంచి జీఎస్టీ అమలు
న్యూఢిల్లీ: దేశంలో ఒక జాతి..ఒక పన్ను విధానానికి మార్గం సుగమం అయింది. గూడ్స్ అండ్ సర్వీసు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు సర్వం సిద్ధమైనట్టు ఆర్థిక వ్యవహారాలశాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ మంగళవారం విలేకరులు తెలిపారు. జులై 1, 2017 నుంచి జీఎస్టీ అమలు చేయనున్నట్టు ఈ మేరకు అన్ని రాష్ట్రాలు అమోదం తెలిపినట్టు ఆయన ప్రకటించారు. దీని అమలుకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కారమైనట్టు తెలిపారు. బడ్జెట్లో ప్రతిపాదించిన సంస్కరణలను అమలు చేయనున్నట్టు తెలిపారు. దీనిపై ఎనలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు జిఎస్టీ అమలుకు లైన్ క్లియర్ కావడంతో మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా లాజిస్టిక్ షేర్లు ర్యాలీ అవుతున్నాయి. కాగా దేశమంతటా ఏకరీతి పన్ను విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించినదే వస్తు, సేవా పన్ను(జీఎస్టీ) బిల్లు. దీన్ని అనుకున్న సమయానికి అమల్లోకి తేనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ జైట్లీ పదేపదే ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. -
నిర్భయ చట్టం పక్కా అమలుకు చర్యలు
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గుంటూరు వెస్ట్: నిర్భయ చట్టం అమలులో ఉన్నా మహిళలపై దాడులు ఎక్కువగానే జరుగుతున్నాయని, చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. కమిషన్ ప్రథమ సమావేశం రాజకుమారి అధ్యక్షతన గుంటూరులోని ఒక ప్రైవేట్ హాస్పటల్లో సోమవారం జరిగింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి షీ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మహిళా కమిషన్‌కు వెబ్సైట్ రూపొందిస్తామన్నారు. బాల్య వివాహాలతో సమాజం అనారోగ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నచిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. మహిళా కమిషన్‌కు ప్రభుత్వ కార్యాలయం, సిబ్బంది కొరత ఉందని, ఇంకా బడ్జెట్ కేటాయింపు జరగలేదని చెప్పారు. ప్రస్తుతం వికాస్‌నగర్ రెండో లైన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయాన్ని గుంటూరులోనే పెద్ద భవనంలోకి మార్చే ప్రయత్నంలో ఉన్నామని ఆమె వెల్లడించారు. సమావేశంలో మహిళా కమిషన్ సభ్యులు పర్వీన్‌భాను, ఎం మణికుమారి, శ్రీవాణి, డాక్టర్ ఎస్ రాజ్యలక్ష్మి, టీ రమాదేవి, కమిషన్ డైరెక్టర్ సూయెజ్, సెక్రటరీ భాను తదితరులు పాల్గొన్నారు. -
‘పాలేరుకు’కు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూసుమంచి: పాలేరు ఉప ఎన్నిక ప్రచారంలో ప్రజలకు తాను ఇచ్చిన హామీలన్నిటినీ ఈ ఏడాదిలోనే నెరవేరుస్తానని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని సాగర్ ఎడమ కాలువ నుంచి పెరికసింగారం, గోరాలపాడు పంచాయతీల్లోని హీరామాన్తండా, భగవాన్ తండాకు బీటీ రోడ్ల నిర్మాణాన్ని మంగళవారం ప్రారంభించారు. పలుచోట్ల జరిగిన సభల్లో మంత్రి మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గంలో తారు రోడ్లు లేని గ్రామాలు ఉండకూడదన్నది ప్రభుత్వ సంకల్పమని అన్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ నియోజకవర్గానికి కేవలం మూడు నెలల కాలంలో 100 కోట్ల రూపాయల పనులను కేటాయించినట్టు చెప్పారు. ఇందులో, కేవలం తండాలకే రూ.60 కోట్ల విలువైన పనులు మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రతి ఊరికి రోడ్లు, తారునీరు, సాగు నీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చి కొత్త సంవత్సరం ప్రారంభం నాటికి కానుకగా ఇస్తానని అన్నారు. మండలంలోని గణేష్ కుంట వద్ద హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అక్కడ ఈత మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విద్యాచందన, సర్పంచులు నాగమణి, సుజాత, నాగమణి, విజయ, ఎంపీటీసీ సభ్యులు జూకూరి విజయలక్ష్మి, పద్మారాంకుమార్, సీడీపీఓ ఉషారాణి, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ పుష్పలత, ఏడీ వాణి, ఏఓ అరుణజ్యోతి, ఏఈలు రామకృష్ణ, శ్రీనివాస్, జగదీష్, అరుంధతి తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి విద్యావిధానాన్ని అమలు చేయాలి
– టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి మహబూబ్‌నగర్ విద్యావిభాగం: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి విద్యావిధానాన్ని అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర మహాసభలలో సామాజిక, విద్యారంగ అంశాలపై చర్చిస్తామని, జిల్లాలో అక్షరాస్యతలో వెనుకబాటుపై డాక్యుమెంటరీ రూపొందిస్తామని అన్నారు. మహాసభలు మహబూబ్‌నగర్‌లో డిసెంబర్ నెలలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసుకున్నారు. గౌరవ చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, చైర్మన్‌గా టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్.కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా జంగయ్య, కోశాధికారిగా ఎన్.వెంకటేష్, టీఎస్‌యూటీఎఫ్ పూర్వనాయకులు, విద్యావేత్తలు, విద్యాభిమానులు, ప్రజాసంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వెంకటేష్, జంగయ్యలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యుటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పునరావాస చట్టం అమలు చేయాలి
ఆలూరు (గట్టు ) : పునరావాస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ డిమాండ్ చేశారు. ఆదివారం గట్టు మండలంలోని ఆలూరు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో ఈ గ్రామం ర్యాలంపాడుపాడు రిజర్వాయర్‌లో ముంపునకు గురైందన్నారు. దీంతో మూడువేల ఎకరాలను రైతులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. పరిహారం చాలా తక్కువగా ఇచ్చినట్లు ఆరోపించారు. చెరువులో ముంపునకు గురైన 32 ఎకరాలకు పరిహారమే ఇవ్వలేదన్నారు. పునరావాస కేంద్రంలో పూర్తిస్థాయిలో ప్లాట్లు కేటాయించలేదని, కనీస సౌకర్యాలు కల్పించకుండా గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేయాలన్నారు. ఈనెల 26న పోరాట నిర్వాసిత కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఉప్పేరు నర్సింహ, రాజు, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. -
69 జీఓను అమలు చేయాలి
ఊట్కూర్ : కొందరు ఎమ్మెల్యేలు రైతు బిడ్డలమంటూ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ ఆరోపించారు. రైతు బిడ్డలైన నాయకులు తమ జన్మసార్థకం చేసుకోనేందుకుగాను 69 జీఓను అమలు చేయాలన్నారు. ఆదివారం బిజ్వార్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కొందరు నాయకులు మిడిమిడి జ్ఞానంతో తనను రైతుబిడ్డను కానని చెప్పడం తగదన్నారు. ఎన్నో ఏళ్లుగా జిల్లావ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులు సాధించేందుకుగాను రైతు సమస్యలపై ఎవరూ చేయనన్ని పాదయాత్రలు, ఉద్యమాలు చేశానన్నారు. ఈ సమావేశంలో మజ్దూర్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు విజయన్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, బీజేపీ నాయకులు కష్ణయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
పాత పింఛన్ విధానం వర్తింపజేయాలి
డీఎస్సీ 2003 పాత పింఛన్ పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు పోల శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు గణపురం సురధీర్ వికారాబాద్ రూరల్ : డీఎస్సీ 2003 నోటిఫికేషన్లో సీపీఎస్ నూతన పింఛన్ విధానం లేదని డీఎస్సీ 2003 పాత పింఛన్ పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు పోల శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు గణపురం సురధీర్ తెలిపారు. వికారాబాద్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ఆదివారం డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛ¯ŒS విధానం, జీపీఎఫ్ అవకాశం కల్పించాలని కోరారు. జిల్లా కమిటీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కాంట్రిబ్యూటరీ పింఛ¯ŒS విధానంతో ఉపాధ్యాయులకు చాలా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు బుచ్చరషు, ప్రధాన కార్యదర్శి బిచ్చన్న, జిల్లా ఉపాధ్యక్షుడులు సురేందర్, నక్క రవీందర్, శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జి.కె నర్సిములు, లక్ష్మికాంత్, సంగమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏది బెస్ట్ స్కూల్!
♦ జిల్లాలో ప్రారంభమైన ఎంపిక ప్రక్రియ ♦ మొత్తం 2,400 పాఠశాలలు పరిశీలన ♦ తుదిజాబితాలో 142 స్కూళ్లకు చోటు ♦ వడపోతలో ఎంఈఓలు, ఎంపీడీఓలు ♦ తుది నిర్ణయం తీసుకోనున్న కలెక్టర్ ♦ ఎంపికలో ‘త్రీ ఆర్స్’ అమలుకు ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టింది. స్కూళ్ల మధ్య ఆరోగ్యవంతమైన పోటీని నెలకొల్పి ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ ఏడాది ‘బెస్ట్ స్కూల్స్’ ఎంపికను ప్రారంభించింది. అయితే ఇందులో ఎన్ని స్కూళ్లకు చోటు కల్పించాలన్న అంశంపై పరిమితి విధించకుండా.. పాఠశాలల్లో ప్రమాణాల అమలును పరిగణలోకి తీసుకుని ఎన్ని పాఠశాలలనైనా ‘బెస్ట్’లో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. - పరిగి అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి ‘బెస్ట్ స్కూల్స్’ అవార్డులు అందజేసే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది విద్యాశాఖ. దీనిలో భాగంగా పలు పాఠశాలలను ఎంపిక చేసి.. తుది జాబితాను ప్రకటించే పనిలో నిమగ్నమైంది. జిల్లాలో 2,400 స్కూళ్లు ఉండగా.. వీటిలో 142 పాఠశాలలను ‘బెస్ట్’కు ఎంపిక చేసింది. పరిగి మండల పరిధిలోని సుల్తాన్పూర్ ప్రాథమిక, ఖుదావంద్‌పూర్ ప్రాథమికోన్నత, చిట్యాల్ ఉన్నత పాఠశాలు ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. - పరిగి బెస్ట్ స్కూళ్ల ఎంపికలో భాగంగా ఆయా మండలాల ఎంఈఓలు తమ పరిశీలన మేరకు.. ఉత్తమ ప్రమాణాలు కలిగిన పాఠశాలల జాబితా తయారు చేసి డీఈఓకు పంపించారు. అనంతరం పక్క మండలాల విద్యాధికారులను పంపించి ఎంపికైన జాబితాలోని పాఠశాలలను తనిఖీ చేయించి జాబితాను సిద్ధం చేశారు. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 142 పాఠశాలలు ఎంపికయ్యాయి. అయితే ఫైనల్ జాబితా తయారు చేసే విచక్షణాధికారాన్ని ఆయా మండలాల ఎంపీడీఓలకు కట్టబెట్టారు. వీరు ఆయా స్కూళ్లను సందర్శించి తుది జాబితాను సీల్డ్ కవర్లో కలెక్టర్‌కు అందజేయనున్నారు. ఇందులో ఎంపీడీఓలు సంతృప్తి చెందకపోతే పాఠశాలల పేర్లను లిస్ట్ నుంచి తొలగించే అధికారం వీరికి ఉంది. ఈ అంశాల ప్రాతిపదికగా ఎంపిక .... వార్షిక, పదో తరగతి ఫలితాలతో సంబంధం లేకుండా.. ఆయా పాఠశాలల్లోని మెజార్టీ విద్యార్థులకు త్రీ ఆర్స్ (చదవటం, రాయటం, ఆర్థమెటిక్స్)లో మంచి ప్రతిభ, సీసీఈ (నిరంతర మూల్యాంకణ ప్రక్రియ) అమలులో మెరుగ్గా ఉండటం, డ్రాపౌట్స్ లేకుండటం, మూత్రశాలలు మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలు, విద్యార్థుల ప్రగతికి సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించడం ఆధారంగా బెస్ట్ స్కూళ్లను ఎంపిక చేశారు. పనికి గుర్తింపు దక్కాలనే.. మెరుగ్గా ఉన్న పాఠశాలలను గుర్తించటమనేది ఎన్నో సానుకూలాంశాలతో ముడిపడి ఉంది. బాగా పనిచేసే ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనేది డీఈఓ, కలెక్టర్లతో పాటు విద్యాశాఖ ఆలోచన. ఇదే సమయంలో పనితీరును తెలుసుకునేందుకు కూడా ఇది ఎంతో అవసరం. మున్ముందు మిగతా పాఠశాలలు కూడా బెస్ట్ స్కూళ్లుగా మారడానికి ఉపాధ్యాయులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తాం. - హరిశ్చందర్, డిప్యూటీ ఈఓ -
కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి నరసరావుపేట రూరల్/నరసరావుపేట వెస్ట్: బీసీలకు ఒక్క శాతం కూడా అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో శ్రీకృష్ణదేవరాయ అన్నదాన సత్రంలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాపులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఏర్పాటు చేసిన మంజునాథ కమిటీ తొమ్మిది నెలల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కాపు కార్పోరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయిస్తామన్నారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి ఎంతో చరిత్ర ఉందని, దీనిని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. కోటప్పకొండను పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ‘సాక్షి’పై ముఖ్యమంత్రి అక్కసు : రాజధానిలో భూకుంభకోణంపై సాక్షి పత్రికలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు యథావిధిగా తమ అక్కసు వెళ్లగక్కారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో శుక్రవారం వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ పలు విమర్శలు చేశారు. ముద్రగడ రమ్మంటేనే చర్చలకు వెళ్లాం: సీఎం బాబు సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో ముద్రగడ పద్మనాభం ఆహ్వానిస్తేనే ప్రభుత్వం తరపున ప్రతినిధులు వెళ్లి దీక్షను విరమింప చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ఆయన పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ముద్రగడ తాజా ప్రకటనలపై చర్చించారు. ఈసారి ఉద్యమం చేస్తే పార్టీ నేతలు, కాపులు ఎవ్వరూ వెళ్లాల్సిన అవసరం లేదని, ఆయనతో పాటు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని కాపు ద్రోహులుగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించాలని చంద్రబాబు సూచించారు. -
ప్రభుత్వ విధానాల్లోకి శ్రీమంతుడు కాన్సెప్ట్
-
జీవో 98/68 అమలు చేయాలి
మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ కొల్లాపూర్, వనపర్తి నియోజక వర్గాలలోని 65 గ్రామాలు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీట మునిగిపోయి 34 సంవత్సరాలు గడచిపోయాయి. 1986లో అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒక్కొక్క నిర్వాసిత కుటుంబానికి ఒక్కొక్క ప్రభుత్వోద్యోగం ఇచ్చేట్టుగా జీవో 98/68ని విడుదల చేశారు. ప్రాజెక్టు నీటి ముంపునకు ఆనాడు మొత్తం 11,200 ఇళ్లకు చెందిన 36,000 కుటుంబాలవారు నిర్వాసితులయ్యారు. గత మూడున్నర దశాబ్దాల్లో కుటుంబ పెద్దలు చాలా మంది మరణించారు. ఇల్లూ, వాకిళ్లు, ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాల సభ్యులు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడితేగా 153 మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి. ఇంకా 2,000 మంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమ పేర్లను ఉద్యోగం కొరకు నమోదు చేసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు నిర్వాసిత కుటుంబాల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం వ్లలనే నేటికీ ఆ జీవో అమలు కావడం లేదు. మరోవంక కర్నూలు జిల్లాలోని ముంపు గ్రామాల నిర్వాసితులు స్థానిక ప్రజా ప్రతినిధుల చొరవతో కుటుంబానికి ఒకటి చొప్పున ప్రభుత్వోద్యోగాలను సంపాదించుకోగలిగారు. ఇకనైనా జిల్లాలోని ప్రజాప్రతినిధులు నిర్వాసితుల గోడును పట్టించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోనైనా నిర్వాసితులకు న్యాయం జరుగుతుందనుకుంటే అదీ నిరాశే అయింది. అందుకే గత 35 రోజులుగా శ్రీశైలంముంపు బాధితులు జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా నిర్వాసితుల గోడును పట్టించుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చొరవచేసి మూడున్నర దశాబ్దాల బాధితుల వ్యధను చల్లార్చాలని విజ్ఞప్తి. తక్షణమే జీవో 98/36 అమలుకు ఆదేశించి నేటికైనా బాధితులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ( డాక్టర్ ఏ సిద్ధన్న, కొల్లాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా) -
మూడు నెలల్లోగా ముస్లిం రిజర్వేషన్లు
ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ముస్లింల స్థితిగతులపై మూడు నెలల కాలపరిమితితో రిటైర్డు జడ్జి నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని, దాని నివేదిక అందిన వెంటనే రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం ఆయన హైటెక్స్‌లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు మహేందర్‌రెడ్డి, పద్మారావుతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు ముంతాజ్ ఖాన్, కౌసర్ మొహియుద్దీన్, అహమ్మద్ బలాల, ఎమ్మెల్సీలు అల్తాఫ్ రిజ్వీ, సలీం, జాఫ్రీ, ప్రముఖ విద్యావేత్త మహబూబ్ ఆలం ఖాన్‌తో పాటు ఇరాన్, టర్కీ దేశాల రాయబారులు, వివిధ రంగాలకు చెందిన ముస్లిం ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యమని కొందరు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో 70 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఓ రాష్ట్రంలో ఒక విధానం, మరో రాష్ట్రంలో ఇంకో విధానం ఉండదు. తమిళనాడు తరహాలోనే రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపెడతాం’ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వచ్చిన తొలి రంజాన్ పండుగను ఘనంగా జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని మసీదులు, దర్గాల మరమ్మతుల కోసం రూ. 7 కోట్లు విడుదల చేశామని చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. పండుగ కానుకగా ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జూలై నెల జీతాలు చెల్లిస్తామన్నారు. ముస్లింల సంక్షేమం కోసం రానున్న బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలను కేటాయిస్తామన్నారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో ముస్లిం మేధావుల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఇందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. మార్కెట్‌యార్డు కమిటీలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, వర్సిటీల వైఎస్ చాన్స్‌లర్ పోస్టుల భర్తీలోనూ ముస్లింలకు చోటు కల్పిస్తామన్నారు. రాష్ట్ర హజ్ కమిటీని ఏర్పాటు చేసి త్వరలో ప్రారంభంకానున్న హజ్ యాత్రలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.