డీఎస్సీ 2003 పాత పింఛన్ పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు పోల శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు గణపురం సురధీర్
వికారాబాద్ రూరల్ : డీఎస్సీ 2003 నోటిఫికేషన్‌లో సీపీఎస్ నూతన పింఛన్ విధానం లేదని డీఎస్సీ 2003 పాత పింఛన్ పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు పోల శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు గణపురం సురధీర్ తెలిపారు. వికారాబాద్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ఆదివారం డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛ¯ŒS విధానం, జీపీఎఫ్ అవకాశం కల్పించాలని కోరారు. జిల్లా కమిటీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కాంట్రిబ్యూటరీ పింఛ¯ŒS విధానంతో ఉపాధ్యాయులకు చాలా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు బుచ్చరషు, ప్రధాన కార్యదర్శి బిచ్చన్న, జిల్లా ఉపాధ్యక్షుడులు సురేందర్, నక్క రవీందర్, శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జి.కె నర్సిములు, లక్ష్మికాంత్, సంగమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పాత పింఛన్ విధానం వర్తింపజేయాలి
Published Mon, Jul 18 2016 4:32 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement