old pension system
-
Gujarat assembly elections 2022: గుజరాత్ ఎన్నికల్లో గెలుపు మాదే: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపు ఖాయమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని, తమకు ఓటేసి గెలిపించాలని ప్రభుత్వ ఉద్యోగులను ఆయన కోరారు. సూరత్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాదిరిగానే గుజరాత్ విషయంలోనూ అంచనాలు నిజమవుతాయని, ఆప్ అధికారంలోకి వస్తుందంటూ ఆయన కాగితంపై రాసి చూపారు. 27 ఏళ్ల తర్వాత గుజరాత్ ప్రజలు బీజేపీ దుష్టపాలన నుంచి విముక్తి కాబోతున్నారని అన్నారు. పాత పింఛను విధానం సహా ఇతర డిమాండ్లను తీరుస్తామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. -
సీపీఎస్ వద్దు..పెన్షన్ కావాలి
చిలకలపూడి(మచిలీపట్నం): సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు గళమెత్తారు. మచిలీపట్నంలో పెన్షన్ సాధన సమితి తూర్పుకృష్ణాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, పెన్షనర్ల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్జీవో హోమ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, పలు దఫాలుగా పోరాటాలు చేసినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వెట్టిచాకిరీ చేస్తున్న ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళన ధర్మమైనది : పేర్ని ఏపీ ఏన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా శాఖ సారధ్యంలో పెన్షన్ సాధన సమితి నేతృత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాల ఆందోళనకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన ధర్మమైనదని ఇందుకు ఉద్యోగుల సమస్యకు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. డీఏ పెంపుదల విషయంలో కేసీఆర్‌ను చూసి ఉద్యోగులకు ప్రకటించిన విధంగానే తెలంగాణా రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటిస్తే తప్ప ఆంధ్రరాష్ట్రంలో సీఎం చంద్రబాబు స్పందించే పరిస్థితి లేదని అర్ధమవుతోందన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా అధ్యక్ష,కార్యదర్శులు ఉల్లి కృష్ణ, దారపు శ్రీనివాస్, పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు మత్తి కమలాకరరావు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పి సత్యనారాయణ, శోభన్‌బాబు, యూటీఎఫ్ నాయకులు కెఏ ఉమామహేశ్వరరావు, ఏపీటీఎఫ్ నాయకులు తమ్ము నాగరాజు, ఎస్టీయు నాయకులు కొమ్ము ప్రసాద్, డి చంద్రశేఖర్, బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు చేబ్రోలు శరత్చంద్ర, కైతేపల్లి దాస్, ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు జి కిషోర్‌కుమార్, పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు జీటీవీ రమణ, పెన్షనర్స్ అసోసియేషన్ జీవీ రామారావు, రామస్వామి, ఎన్జీవో సంఘ నాయకులు గౌరి, రమాదేవి, బి సీతారామయ్య, ఎల్వీ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయటవర్స్ వద్ద ధర్నా ఇబ్రహీంపట్నం: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుచేయాలని రాష్ట్ర పెన్షన్ సాధన సమితి పిలుపుమేరకు క్యాపిటల్ సిటీ బ్రాంచి అమరావతి ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగసంఘాలు ఆంజనేయటర్స్ వద్ద శనివారం ధర్నా నిర్వహించాయి. క్యాపిటల్ సిటీ బ్రాంచి అమరావతి సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు సీవీ.రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.మణికుమార్ మాట్లాడుతూ పెన్షన్ రద్దు కోసం దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. రాష్ట్రకోశాధికారి వీరేంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాల వల్ల ఉద్యోగులు నష్టపోతున్న ట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి సీహెచ్ అజయ్‌కుమార్, మహిళా అ«ధ్యక్షురాలు పీవీఎల్ఎస్.రత్న, ఏపీఎన్టీవో సంఘం కార్యదర్శులు నరసింహం, జగదీశ్వరరావు, తులసీరత్నం, కృపావ రం, క్యాపిటల్సీటీ బ్రాంచి కార్యదర్శి నాగభూష ణం, రాష్ట్ర ఉద్యోగుల సమైక్య సభ్యులు రాజ్యలక్ష్మీ, రాష్ట్ర అడిట్సంఘం ప్రధానకార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర ఎకనామిక్, స్టాటిక్స్ సంఘం, పీఏవో, అగ్నిమాపక శాఖల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
– ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఉపాధ్యాయ భవనంలో బుధవారం ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పీవీ మాధవ అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రఘురామిరెడ్డి మాట్లాడారు. టీచర్ల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ వి«ధానం రద్దు చేయాలన్నారు. బదిలీల్లో ప్రతిభ ఆధారిత పాయింట్లను తొలగించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగవరప్రసాద్ మాట్లాడుతూ క్రమబద్ధీకరణ పేరుతో పెద్ద ఎత్తున పాఠశాలలు మూసివేతకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఉప విద్యాశాఖ అధికారులుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పూర్వ ప్రధానకార్యదర్శి పరమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన 10 నెలల పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నరసింహుడు మాట్లాడుతూ నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని సమీక్షించాలన్నారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు పీవీ మాధవ, ప్రధానకార్యదర్శి డి.ప్రభాకర్, గౌరవాధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు, అరియర్స్ చెల్లించాలన్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సబ్‌కమిటీ సభ్యులు అశోక్‌కుమార్, ముత్యాలప్ప, డేనియల్, సిరాజుద్దీన్, శ్రీనివాసులు, గాయిత్రి, నరసింహారెడ్డి, ప్రేమావతమ్మ, చంద్రకళ,హనుమప్ప, గోపాల్‌నాయుడు పాల్గొన్నారు. --- -
పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి నెల్లికుదురు : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత పింఛన్ విధానంపై అసెంబ్లీ తీర్మానం చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి సర్వీస్‌రూల్స్ వర్తింప చేసేలా కృషి చేస్తామని, సీఆర్పీల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు స్వీకరించిన గుగులోతు రాము, పి.కల్పన, కర్ణాకర్, లింగమూర్తిని సన్మానించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల నుంచి పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డితో పాటు సొంటిరెడ్డి యుగేందర్, పెరుమాండ్ల యుగేందర్, బీరవెల్లి నర్సింహరెడ్డి, కూరపాటి వెంకటేశ్వర్లు, సూరిబాబు, మాసిరెడ్డి రమేష్‌రెడ్డి, డాక్టర్ టి.శ్రీనివాస్, ఖలీద్ మహమూద్, ఎండి.యాసీన్ పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
డీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా విద్యారణ్యపురి: నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్)ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిల పార్కువద్ద ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. లింగారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించేందుకు ఉద్యోగులకు ఒక సామాజిక భద్రతగా పాతపెన్షన్ విధానం ఉండేదన్నారు.అయితే నూతన పెన్షన్ విధానం (సీపీఎస్)తో ఉద్యోగ విరమణ పొందిన కుటుంబానికి సామాజిక భద్రత లేకుండా చేసిందన్నారు. దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన ధనిక రాష్ట్రంగా చెపుతున్న తెలంగాణలో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు సంఘటితంగా పోరాడుతామన్నారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం గంగాధార్ మాట్లాడుతూ ఆర్థిక సరళీకరణ, ప్రయివేటీకరణతో ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వాలు ఉద్యోగులు ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి మాట్లాడుతూ సీపీఎస్ విధానంలో పెన్షన్ ,గ్రాట్యూటీ, జీపీఎఫ్ వంటివి నష్టపోవాల్సి వస్తుందన్నారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి వెంకటరెడ్డి , టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి రాంచందర్, జనరల్ సెక్రటరీ టి.సుధర్శనం నాయకులు జి ఉప్పలయ్య, పి.సుధర్శన్‌రెడ్డి, బి. జాన్‌నాయక్, డి. మహేందర్‌రెడ్డి, ఎ. గోవిందరావు, కె. కొమ్మాలు, డి.కుమారస్వామి, జి. శ్రీనివాస్‌రెడ్డి, బి. రాములు, జి. ఆదిరెడ్డి, జి.సురేందర్ పాల్గొన్నారు. -
పాత పింఛన్ విధానం కొనసాగించాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ ‘చలో హైదరాబాద్’ కరపత్రాల ఆవిష్కరణ మొయినాబాద్ రూరల్: ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి, సీపీఎస్‌ను రద్దు చేయాలని తెలంగాణ రాష్ర్ట ఉపాధ్యాయ సంఘం జిల్లా అధక్షుడు పి.ప్రవీణ్‌కుమార్ అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న ఇందిరాపార్క్‌లో నిర్వహించనున్న చలో హైదరాబాద్ ధర్నా కరపత్రాలను.. మండల పరిధిలోని అమ్డాపూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ- 2003 ఉపాధ్యాయులకు పాత పెన్సన్ పద్ధతిని కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని, అంతర్ జిల్లాల బదీలలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగదు రహిత హెల్త్ కార్డులను అమలు చేయాలన్నారు. విద్యాహక్కు చట్టం మేరకు అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పూర్తి స్థాయిలో ఎంఈఓలను నియమించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. జీఓ 302ను పునరుద్ధరించి ఉపాధాయులకు పదోన్నతులు కల్పించాలన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్, రాష్ర్ట ఉపాధ్యక్షుడు పరమేశ్, జిల్లా కోశాధికారి క్రిష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు విఠల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శివయ్య, మహిళా అధ్యక్షురాలు జ్యోతి, ఉపాధ్యాయులు అలివేలుమంగ, మల్లేశ్ తదితరలు ఉన్నారు. -
పాత పింఛన్ విధానం వర్తింపజేయాలి
డీఎస్సీ 2003 పాత పింఛన్ పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు పోల శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు గణపురం సురధీర్ వికారాబాద్ రూరల్ : డీఎస్సీ 2003 నోటిఫికేషన్లో సీపీఎస్ నూతన పింఛన్ విధానం లేదని డీఎస్సీ 2003 పాత పింఛన్ పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు పోల శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు గణపురం సురధీర్ తెలిపారు. వికారాబాద్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ఆదివారం డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛ¯ŒS విధానం, జీపీఎఫ్ అవకాశం కల్పించాలని కోరారు. జిల్లా కమిటీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కాంట్రిబ్యూటరీ పింఛ¯ŒS విధానంతో ఉపాధ్యాయులకు చాలా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు బుచ్చరషు, ప్రధాన కార్యదర్శి బిచ్చన్న, జిల్లా ఉపాధ్యక్షుడులు సురేందర్, నక్క రవీందర్, శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జి.కె నర్సిములు, లక్ష్మికాంత్, సంగమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సడిమెల యాదగిరి మెదక్: పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సడిమెల యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను రాష్ట్రపతి త్వరగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని ఎంఈఓ, డిప్యూటీఈఓ, జూనియర్ లెక్చరర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాతపెన్షన్ విధానం అమలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. భాషా పండితులను, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయాలని, 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, మíß ళా ఉపాధ్యాయులకు రెండేళ్ల చైల్డ్‌కేర్ లీవ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. అలాగే పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, కామన్‌స్కూల్ విధానం అమలు చేయాలని తీర్మానం చేశారు. సమస్యల పరిష్కారానికై ఈనెల 27న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి హరికిషన్, రాష్ట్ర, జిల్లా నేతలు ప్రభాకర్, సదన్‌కుమార్, మల్లారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఉపాధ్యాయులకు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై ఉద్యమించాలని అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీఆర్సీని తెచ్చుకున్న మనకు పాత పెన్షన్ విధానాన్ని తెచ్చుకోవటం అసాధ్యమేమీ కాదని అన్నారు. టీఎన్జీఓ గౌరవ అధ్యక్షులు దేవిప్రసాద్ మాట్లాడుతూ.. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తికి జీవితకాలం పెన్షన్ ఇస్తున్నప్పుడు 30 ఏళ్లుగా ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన వ్యక్తికి పెన్షన్ ఇవ్వకపోవటం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పి.సుధాకర్ రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి, టీఎన్జీఓ అధ్యక్షులు కారం రవీందర్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పాత పింఛన్ అమలుకు ఉద్యమాలు
► జాక్టో కన్వీనర్ కరుణానిధి మూర్తి ► ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పాత పింఛన్ విధానం అమలు కోసం పోరాటాలను ఉద్ధృతం చేస్తామని జాక్టో కన్వీనర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కరుణానిధిమూర్తి తెలిపారు. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం జాక్టో రెండో దశ ఆందోళనలో భాగంగా సోమవారం కర్నూలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయులు ముందుగా జెడ్పీ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సంద్భరంగా కరుణానిధిమూర్తి మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. సర్వీసు రూల్స్ ప్రక్రియను వేగవంతం చేసి ఎంఈఓ, డైట్, జేఎల్ పదోన్నతులను చేపట్టాలని, పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలన్నారు. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ రూపొందించాలన్నారు. అనంతరం జాక్టో డిమాండ్లను నివేదిక రూపంలో ఆర్డీఓకు అందజేశారు. ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమానికి డిగ్రీ కళాశాలల అధ్యాపకుల అసోసియేషన్ ప్రతినిధి దళవాయి శ్రీనివాసులు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జాక్టో నాయకులు జీవీ సత్యనారాయణ, చంద్రశేఖర్, చంద్రశేఖర శర్మ తదితరులు పాల్గొన్నారు.