పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
Published Thu, Apr 27 2017 12:26 AM | Last Updated on Sat, Sep 15 2018 2:27 PM
– ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి
అనంతపురం ఎడ్యుకేషన్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఉపాధ్యాయ భవనంలో బుధవారం ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పీవీ మాధవ అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రఘురామిరెడ్డి మాట్లాడారు. టీచర్ల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ వి«ధానం రద్దు చేయాలన్నారు. బదిలీల్లో ప్రతిభ ఆధారిత పాయింట్లను తొలగించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగవరప్రసాద్ మాట్లాడుతూ క్రమబద్ధీకరణ పేరుతో పెద్ద ఎత్తున పాఠశాలలు మూసివేతకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఉప విద్యాశాఖ అధికారులుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పూర్వ ప్రధానకార్యదర్శి పరమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన 10 నెలల పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నరసింహుడు మాట్లాడుతూ నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని సమీక్షించాలన్నారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు పీవీ మాధవ, ప్రధానకార్యదర్శి డి.ప్రభాకర్, గౌరవాధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు, అరియర్స్ చెల్లించాలన్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సబ్‌కమిటీ సభ్యులు అశోక్‌కుమార్, ముత్యాలప్ప, డేనియల్, సిరాజుద్దీన్, శ్రీనివాసులు, గాయిత్రి, నరసింహారెడ్డి, ప్రేమావతమ్మ, చంద్రకళ,హనుమప్ప, గోపాల్‌నాయుడు పాల్గొన్నారు.
---
Advertisement
Advertisement