- పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి
పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి
Published Thu, Sep 29 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
నెల్లికుదురు : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత పింఛన్ విధానంపై అసెంబ్లీ తీర్మానం చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయుల సంక్షేమానికి సర్వీస్‌రూల్స్ వర్తింప చేసేలా కృషి చేస్తామని, సీఆర్‌పీల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు స్వీకరించిన గుగులోతు రాము, పి.కల్పన, కర్ణాకర్, లింగమూర్తిని సన్మానించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల నుంచి పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డితో పాటు సొంటిరెడ్డి యుగేందర్, పెరుమాండ్ల యుగేందర్, బీరవెల్లి నర్సింహరెడ్డి, కూరపాటి వెంకటేశ్వర్లు, సూరిబాబు, మాసిరెడ్డి రమేష్‌రెడ్డి, డాక్టర్ టి.శ్రీనివాస్, ఖలీద్ మహమూద్, ఎండి.యాసీన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement