పాత పింఛన్ విధానం కొనసాగించాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్
‘చలో హైదరాబాద్’ కరపత్రాల ఆవిష్కరణ
మొయినాబాద్ రూరల్: ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి, సీపీఎస్‌ను రద్దు చేయాలని తెలంగాణ రాష్ర్ట ఉపాధ్యాయ సంఘం జిల్లా అధక్షుడు పి.ప్రవీణ్‌కుమార్ అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న ఇందిరాపార్క్‌లో నిర్వహించనున్న చలో హైదరాబాద్ ధర్నా కరపత్రాలను.. మండల పరిధిలోని అమ్డాపూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ- 2003 ఉపాధ్యాయులకు పాత పెన్సన్ పద్ధతిని కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని, అంతర్ జిల్లాల బదీలలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగదు రహిత హెల్త్ కార్డులను అమలు చేయాలన్నారు. విద్యాహక్కు చట్టం మేరకు అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పూర్తి స్థాయిలో ఎంఈఓలను నియమించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. జీఓ 302ను పునరుద్ధరించి ఉపాధాయులకు పదోన్నతులు కల్పించాలన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్, రాష్ర్ట ఉపాధ్యక్షుడు పరమేశ్, జిల్లా కోశాధికారి క్రిష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు విఠల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శివయ్య, మహిళా అధ్యక్షురాలు జ్యోతి, ఉపాధ్యాయులు అలివేలుమంగ, మల్లేశ్ తదితరలు ఉన్నారు.