సీపీఎస్ రద్దయ్యేంత వరకు ఉద్యమం
Published Tue, Oct 4 2016 11:28 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
– ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దయ్యేంత వరకు ఉద్యమిస్తామని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పేర్కొన్నారు. సలాంఖాన్ ఎస్టీయూ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తలసమావేశంలో వారు మాట్లాడారు. సెప్టెంబర్‌లో సీపీఎస్‌రద్దు కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర భారీ ధర్నా నిర్వహించినట్లు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి పది లక్షల మంది ఉపాధ్యాయుల వినతిపత్రాలు సమర్పించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు గ్రాట్యూటీ చెల్లించుటకు ఒప్పుకుందని, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గ్రాట్యూటీ చెల్లింపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరెడ్డి, నాయకులు ఎంఎండీ షఫీ, సుబ్బారాయుడు, ప్రసాదరావు, టీకీ జనార్దన్ పాల్గొన్నారు.
Advertisement