
సాక్షి, తాడేపలి: అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధులకు జగనన్న విద్యా దీవెన కింద రూ.709 కోట్ల బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన కింద ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేస్తుంది.
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం రూ. 9,274 కోట్లను అందజేసింది. గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 1,778 కోట్లను కూడా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వమే చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment