AP: CM YS Jagan Speech In Jagananna Vidya Deevena Programme, Details Inside - Sakshi
Sakshi News home page

Jagananna Vidya Deevena Programme: నా తమ్ముళ్లు, చెల్లెళ్లు గొప్పగా చదవాలి: సీఎం జగన్‌

Published Wed, Mar 16 2022 11:38 AM | Last Updated on Wed, Mar 16 2022 6:21 PM

CM YS Jagan Speech In Jagananna Vidya Deevena Programme - Sakshi

సాక్షి, అమరావతి: ఎవరూ దొంగిలించలేని ఆస్తి.. చదువు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని.. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నారు. సచివాలయంలో విద్యాదీవెన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. అనంతరం విద్యాదీవెన  కింద విద్యార్థుల తల్లుల అక్కౌంట్లకు నగదు బదిలీ చేశారు.

చదవండి: విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు జమ చేసిన సీఎం జగన్‌

కార్యక్రమంలో సీఎం జగన్‌ ఏమన్నారంటే..
ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం
10.82లక్షల మంది విద్యార్ధులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికి సంబంధించి రూ.709 కోట్ల రూపాయలు పిల్లల తల్లుల ఖాతాలలోకి జమ చేస్తున్నాం
ఇంతమంది కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు
చదువులన్నది ఒక ఆస్తి
పిల్లలకు ఏదైనా చేయగలిగితే.. ఎవ్వరూ కూడా దొంగిలించలేని ఆస్తి చదువు మాత్రమే
చదువు జీవన ప్రమాణాలను మార్చేస్తుంది
కుటుంబాలకు కుటుంబాలే పేదరికం నుంచి బయటపడతాయి
నాకు సంతోషాన్ని కలిగించే కార్యక్రమాల్లో విద్యాదీవెన, వసతి దీవెన ఒకటి
100శాతం లిటరసీ ఉన్న సమాజాలు ఎలా ఉంటాయో గమనించాలి
100 శాతం లిటరసీ ఉన్న సమాజాల్లో శిశుమరణాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి

విద్య ఉన్న కుటుంబాలకు, విద్య లేని కుటుంబాలకు చాలా తేడా ఉంటుంది
ఒక గ్రామం నుంచి ఒకరు డాక్టరు అయితే కుటుంబం మాత్రమే కాదు, ఊరు కూడా బాగుపడుతుంది
వారు పైస్థాయికి వెళ్లిన తర్వాత..ఆ గ్రామాలకు మంచి చేయడానికి చాలా తపన పడతారు
కేవలం చదువులు వల్లనే వాళ్లు ఆ స్థాయికి వెళ్లారు
చదువులకోసం పేదరికం అడ్డు రాకూడదు
చదువులు ఆపే పరిస్థితి రానే రాకూడదని నేను గట్టిగా నమ్మాను
ఫీజు రియింబర్స్‌ మెంట్‌మీద ఎప్పుడు మాట్లాడినా నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన నా కళ్లముందు కనిపిస్తూ ఉంటుంది
నా తమ్ముళ్లు, చెల్లెళ్లు గొప్పగా చదవాలి

చదువులు కారణంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు
ఈ విషయాలను గట్టిగా నమ్మిన వ్యక్తి నాన్నగారు
విప్లవాత్మకంగా పేదవాళ్లకు తోడుగా నిలిచిన వ్యక్తి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,అగ్రవర్ణాల్లోని పేదలకోసం గతంలో నాయకులు కేవలం మాటలు మాత్రమే చెప్పేవారు
కాని నాన్నగారు పూర్తి రీయింబర్స్‌మెంట్‌తీసుకు వచ్చారు
తర్వాత పాలకులు, మొన్నవరకూ చూస్తే.. మొక్కుబడి ఇచ్చారు
అదికూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి
మొత్తం స్కీంను నాశనం చేశారు
ఇప్పుడు స్కీంను మనం వచ్చాక బాగా మార్పు చేశాం
దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన వారందరికీ కూడా పూర్తి ఫీజురియింబర్స్‌ మెంట్‌ అమలు చేస్తున్నాం
ఎలాంటి అరియర్స్‌ లేకుండా.. ప్రతి త్రైమాసికానికీ చెల్లిస్తున్నాం
బోర్డింగ్‌ ఖర్చులు కూడా వసతి దీవెన కింద ఇస్తున్నాం
విప్లవాత్మక మార్పులతో అమలు చేస్తున్నాం

గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్‌ మెంట్‌ ఎలా ఉందని ఆలోచన చేయండి
ఏ స్థాయిలో ఫీజులున్నా.. ఇచ్చేది కేవలం రూ.35వేలు
2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి రూ.1770 కోట్ల రూపాయలను బకాయిలు పెట్టి వెళ్లింది
అయినా పిల్లలకోసం వాటిని కూడా చెల్లించాం
విద్యాదీవెన, వసతి దీవెనల కోసం మన ప్రభుత్వం అక్షరాల రూ.9,274 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం
ఈ డబ్బులు ఇవ్వడమే కాకుండా మొదటసారిగా తల్లులఖాతాల్లోకి వేస్తున్నాం
తల్లులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశాం
మరో త్రైమాసికం రాకముందే.. చెల్లిస్తున్నాం
ఎక్కడా ఇబ్బంది పడకుండా.. డబ్బులు చెల్లిస్తున్నాం
తల్లులు వెళ్లి ఫీజులు కట్టడం మొదలుపెడితే... కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుంది
అందుకే తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నాం

వసతి దీవెన డబ్బులు కూడా తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నాం
రెండో విడత వసతి దీవెన ఏప్రిల్‌ 5న విడుదల చేస్తాం
ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమంది పిల్లలను చదివించండి
పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇస్తాం
పూర్తిగా వసతి దీవెన ఇస్తాం
పిల్లలు బాగా చదివితేనే వారు పోటీప్రపంచంలో నిలబడగలరు
పిల్లలకు మంచి మేనమామగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

ప్రభుత్వ స్కూళ్లకు ఆరున్నర లక్షలమంది ప్రైవేటునుంచి వచ్చారు
ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి
సబ్జెక్టు టీచర్లను పెడుతున్నాం
ఇంతకుముందు క్లాసులకు టీచర్‌ లేని పరిస్థితి
ఇంగ్లిషు మీడియం తీసుకు వచ్చాం, సీబీఎస్‌ఈ సిలబస్‌ను తీసుకు వస్తున్నాం
నాడు – నేడు మాత్రమే కాకుండా విద్యాదీవెన తీసుకు వస్తున్నాం
జగనన్న విద్యాకానుక పేరుతో యూనిఫారమ్స్, పుస్తకాలు, నోట్‌పుస్తకాలు, వర్క్‌బుక్స్, షూస్‌ ఇస్తున్నాం
పిల్లల మెనూ గురించి కూడా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి బహుశా ఎవ్వరూ ఉండరేమో

జగనన్న గోరు ముద్ద ద్వారా మంచి ఆహారం ఇస్తున్నాం
గతంలో ఆయాలకు, సరుకులకు డబ్బులు ఇచ్చేవారు కాదు
ఇవాళ ఏడాదికి రూ.1800 కోట్లు చెల్లిస్తున్నాం
గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారు
అమ్మ ఒడి ద్వారా స్కూళ్లలో ప్రవేశాలను గణనీయంగా పెంచాం
ఉన్నత విద్య సిలబస్‌లో కూడా గణనీయమైన మార్పులు తీసుకువస్తున్నాం
ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం
అప్రెంటిస్‌షిఫ్‌ విధానంకూడా కచ్చితంగా తీసుకువస్తున్నాం
ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి మార్పులకు దారితీస్తాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement