
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భీమవరంలో పర్యటిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment