విద్యాదీవెన.. సీఎం జగన్ నగరి పర్యటన అప్‌డేట్స్
► నగరి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. జగనన్న విద్యాదీవెన నిధుల్ని బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు.
నగరిలో సీఎం జగన్ కామెంట్లు
అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారు. 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా కనిపిస్తుందా?. సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు. అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు, మోసాలు. కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి గొడవలు పెట్టి.. శవరాజకీయాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశం. కావాలనే పోలీసులపై రాళ్లు రువ్వించారు. పోలీసులపై కర్ర, బీరు సీసాలతో దాడి చేయించాడు. ఓ పోలీస్‌కన్ను కూడా పోగొట్టారు.
చంద్రబాబు ఢిల్లీలో సీఈసీని కలుస్తాడట. దొంగ ఓట్లు ఆయనే సృష్టించి.. మన మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకడాడని వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి.. ఆయన ఫొటోనే దండం పెడతాడు. ఎన్టీఆర్ నాణేం విడుదల కోసం ఢిల్లీ కూడా వెళ్లాడు.
సీఎం జగన్ ప్రసంగం
ప్రతి పేద కుటుంబానికి నేటి కంటే రేపు మరింత బాగుండాలి. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్తుకు అడ్డురాకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యాదీవెన తీసుకొచ్చాం. ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే పథకం. నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11 వేల మూడు వందల కోట్లు జమ చేశాం. 8 లక్షల 44 వేల 336 మంది మంది తల్లుల ఖాతాలో రూ.680 కోట్లు జమ చేస్తున్నాం. జగనన్న వసతి దీవెన కూడా పేద విద్యార్థలు కోసం అమలు చేస్తున్నాం.
మంత్రిరోజా కామెంట్లు
► పేద విద్యార్థులకు సీఎం జగన్ ఉన్నత విద్య అందిస్తున్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు దేశంలో ఎక్కడా లేవు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తూ ప్రధానే ప్రశంసించారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్. కాంపౌండర్ కూతురు వైద్య విద్య అభ్యసిస్తుందంటే.. ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గతంలో చంద్రబాబు పేదింటి పిల్లలను విద్యకు దూరం చేశారు.
► చిత్తూరు కలెక్టర్ సగిలి షన్మోహన్ ప్రారంభోపన్యాసంతో విద్యాదీవెన నిధుల జమ కార్యక్రమం ప్రారంభం
► ప్రారంభమైన విద్యాదీవెన కార్యక్రమం
► నగరిలో విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడి నేతలతో, లబ్ధిదారులతో ముచ్చటించారు. అక్కచెల్లెళ్లమ్మలతో ఫొటో దిగారు. ఆపై వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్‌కు పుష్ఫనివాళి అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు.
► నగరి లో కీలపట్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద కు చేరుకున్న సీఎం జగన్. స్వాగతం పలికిన మంత్రులు ఆర్.కే రోజా, ఉషశ్రీ చరణ్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు ఆదిములం, ఏమ్.ఏస్.బాబు, వెంకట్ గౌడ, ఎమ్మెల్సీ భరత్ తదితరులు.
► తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో నగరి బయలుదేరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
► కాసేపట్లో సీఎం జగన్ నగరి చేరుకోనున్నారు.
► రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్. మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి ఎమ్మేల్యే బియ్యపు మధు సూధన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు.
► విద్యాదీవెన కార్యక్రమం కోసం చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయల్దేరారు.
📖 ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది(ఇవాళ్టి రూ.680 కోట్లతో కలిపి). మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.69,289 కోట్లు ఖర్చుపెట్టింది.
📖 జగనన్న విద్యాదీవెన కింద.. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం.
📖 జగనన్న విద్యాదీవెన పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల నిమిత్తం ఆయా కళాశాలలకు చెల్లించే ఫీజుల మొత్తాన్ని జగన్ సర్కారే భరిస్తోంది.
📖 ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సోమవారం సీఎం జగన్ నగరి వేదికగా విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తారు.
జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాలో నిధుల జమ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ చిత్తూరు నగరి వెళ్లనున్నారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. ఆయన నిధుల్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. ఈ పర్యటనలోనే నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment