
Updates
►మోసాల చక్రమే చంద్రబాబు సైకిల్ చక్రం
►బాబు పెత్తందారీ భావజాలానికి.. పేదలకు మధ్య యుద్ధం.
►సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం.
►ఎల్లో మీడియా విష ప్రచారానికి, మనం చేస్తున్న మంచికి యుద్ధం.
►టీడీపీ హయాంలో దోచుకో, పంచుకో, తినుకో విధానం.
►డీపీటీ కావాలా? నేరుగా బటన్ నొక్కే డీబీటీ కావాలా?
►ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 అండగా ఉండకపోవచ్చు..
►జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు.
►మీ జగనన్న ప్రజలనే నమ్ముకున్నారు.
►ఇది కురుక్షేత్ర యుద్దం
►ఈ యుద్ధంలో నా ధైర్యం, బలం మీరే.
►మీకు మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా నిలవండి.
►దుకాణం మూసేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది.
►చంద్రబాబు పులిహోర మ్యానిఫెస్టో తెచ్చారు.
►మరోసారి మోసానికి తెరతీశారు.
►బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అంటూ డ్రామాలు మొదలు పెట్టారు.
►14 ఏళ్లు సీఎంగా బాబు ఏం చేశారు? గాడిదలు కాశారా?
►బాబు బతుకంతా వాగ్ధానాలు.. తరువాత వెన్నుపోట్లు
► విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు చేశాం: సీఎం జగన్
► ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన విద్యార్థులు ఉండాలి.
► టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం చేపట్టాం.
► అమెరికాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నాం.
► ఇంగ్లీష్ మాట్లాడటంలో మన విద్యార్థులకు ప్రతిభ పెరుగుతుంది.
► రాష్ట్రంలోని 52 మంది ఇంగ్లీష్ టీచర్లకు అమెరికాలో శిక్షణ.
► విద్యాకానుక కిట్లలో మెరుగైన మార్పులు చేశాం.
► యూనిఫామ్ డిజైన్‌లో మార్పులు చేశాం.
► గతేడాది కంటే ఈ ఏడాది యూనిఫామ్ క్లాత్ శాతం పెరిగింది.
► రూ.1,042.53 కోట్ల వ్యయంతో విద్యాకానుక కిట్ల పంపిణీ.
► 43 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు విద్యాకానుక
► ప్రతి విద్యార్థి రూ. 2,400 విలువైన కిట్ పంపిణీ.
► ఇప్పటి వరకు విద్యాకానుక పథకానికి రూ. 3,366 కోట్లు ఖర్చుచేశాం.
►ఏపీలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి బొత్స సత్యనారాయణ
►విద్యారంగంలో కీలక సంస్కరణలు చేశాం.
►ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో నిలబడాలనేదే లక్ష్యం.
►ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్‌లో విద్యా బోధన.
►సీఎం జగన్ అంటే ప్రభంజనం: ఎమ్మెల్యే నంబూరి శంకరరావు
►పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి.
►నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను సీఎం జగన్ అందించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక అందజేశారు. క్రోసూరులో ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించిన సీఎం జగన్ డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులతో కూర్చొని ముచ్చటించారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్‌పై ఆల్ ది బెస్ట్ అని రాశారు. జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించారు.
► పల్పాడు జిల్లా క్రోసూరుకు సీఎం వైఎస్‌జగన్ చేరుకున్నారు. కాసేపట్లో నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక అందించనున్నారు.
► పల్పాడు జిల్లా క్రోసూరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయల్దేరారు. ఏపీలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండగా.. తొలిరోజే విద్యాకానుక అందిస్తోంది ప్రభుత్వం. వరుసగా నాలుగో ఏడాది సీఎం జగన్ ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌ను అందజేయనున్నారు.
►ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు.
►జగనన్న విద్యాకానుక కిట్‌కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా నాలుగు దశల్లో నాణ్యతా పరీక్షలు చేపట్టారు.
►43.10 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు సీఎం జగన్ విద్యా కానుక అందించనున్నారు.
►రూ. 1,042.53 కోట్ల వ్యయంతో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు.
►నాలుగేళ్లలో విద్య కోసం రూ.60 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది.
► తొలి దశలో నాడునేడు పూర్తయిన 15,715 స్కూళ్లలో డిజిటల్ విద్య, హైస్కూళ్లలో 30 వేల తరగతి గదులకు బైజూస్ కంటెంట్‌తో డిజిటల్ విద్య అందిస్తున్నారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ చదువుల భారమంతా తన భుజాలకెత్తుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాదీ జగనన్న విద్యాకానుకను అందిస్తోంది. పాఠ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్ల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు.
చదవండి: పకడ్బందీగా 50వేల మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు!
Comments
Please login to add a commentAdd a comment