Breadcrumb
Jagananna Vidya Deevena: 11.02 లక్షల మంది విద్యార్థుల చదువుకు భరోసా
Published Thu, Aug 11 2022 10:07 AM | Last Updated on Thu, Aug 11 2022 7:45 PM
Live Updates
Jagananna Vidya Deevena: సీఎం జగన్ బాపట్ల పర్యటన లైవ్ అప్డేట్స్
లబ్ధి దారుల ఖాతాల్లోకి రూ.694 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్
బాపట్ల సభలో సీఎం జగన్ ప్రసంగం అనంతరం 2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లో జమచేశారు.
తేడాను గమనించండి
పథకాలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు?. గత పాలనలో రాష్ట్రంలో నలుగురే బాగుపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వారికి కడుపుమంట. వారిలా నాకు ఏబీఎన్, ఈనాడు, టీవీ5 అండగా లేవు. మీ అందరి దీవెనలే నాకు అండగా ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చాక డీబీటీ ద్వారా పేదలకు నేరుగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం. గత పాలనకు ఈ పాలనలో తేడాను గమనించండి అని సీఎం జగన్ ప్రజల్ని కోరారు.
విద్యారంగంపై మూడేళ్లలో రూ.53వేల కోట్లు
జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇప్పటి వరకు రూ.11,715 కోట్లు నేరుగా అందించాం. చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాటు కాకూడదు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించాం. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నాం. అమ్మఒడి, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, బైజ్యూస్‌తో ఒప్పందం ఇలా విద్యారంగంపై మూడేళ్లలో రూ.53వేల కోట్లు ఖర్చుపెట్టాం. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.
బాపట్లలో సీఎం జగన్
పెద్ద చదువులు కూడా పేదలకు హక్కుగా మార్చాం. పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే. ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లలకు శిక్షణ అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే నా ఆకాంక్ష. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చాం. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరినీ చదివించండి. ప్రతి ఇంటి నుంచి ఇంజినీర్లు, డాక్టర్లు, ఐపీఎస్‌లు రావాలి. మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
ఫీజు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుంది: సీఎం జగన్
పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువు. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వాన్నే భరిస్తుంది. అందులో భాగంగానే ప్రతి విద్యార్థికి 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నాం. రూ.694 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఏప్రిల్-జూన్ 2022 కాలానికి గానూ, 11.02 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ అన్నారు.
అక్క, చెల్లెమ్మలకు సీఎం జగన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు
బాపట్ల: కార్యక్రమంలో సీఎం జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం జగన్ విద్యావ్యవస్థలో మార్పునకు శ్రీకారం చుట్టారు: మేరుగ
అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని సీఎం జగన్ అనుసరిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. సీఎం జగన్ చదువుకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోలేదు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అనేక అవస్థలు పడ్డారు. అయితే సీఎం జగన్ విద్యావ్యవస్థలో మార్పునకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
బాపట్ల జిల్లా అభివృద్ధి చెందుతోంది: కోన రఘుపతి
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బాపట్లను జిల్లాగా ప్రకటించినందుకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. నూతన జిల్లా బాపట్ల అభివృద్ధి చెందుతోందన్నారు. జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. బాపట్లలో మెడికల్ కాలేజీ, 500 పడకల ఆస్పత్రిని మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
జగనన్న విద్యదీవెన పథకం
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్
బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కోన రఘుపతి, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.
సభాప్రాంగణానికి సీఎం జగన్
బాపట్ల సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం అమలుపై సీఎం జగన్ సభా ప్రాంగణంలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు.
బాపట్ల చేరుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాపట్లలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు.
బాపట్ల బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపట్ల జిల్లా పర్యటనకు బయలుదేరారు. జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసికం నిధులను విడుదల చేయనున్నారు. సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ ఉన్నారు.
గత ప్రభుత్వంలో ఏళ్ల తరబడి పెండింగ్
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫీజులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండేవి. రెండేళ్ల తర్వాత కూడా బకాయిలు చెల్లించిన సందర్భాలు అనేకం. అప్పట్లో ఇచ్చేది రూ.35 వేలే అయినా ఆ మొత్తమూ సకాలంలో అందక కాలేజీల యాజమాన్యాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవి.
ప్రభుత్వమిచ్చే రూ.35 వేలు పోగా, మిగతా మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి చెల్లించాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమల్లోకి తెచ్చి విద్యార్థులపై భారం లేకుండా చేసింది. దీంతో ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. అటు కళాశాలల యాజమాన్యాల నుంచి సంతృప్తి వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ బకాయిలు రూ.1,778 కోట్లు కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది.
కాలేజీల్లో లోపాలుంటే ప్రశ్నించే హక్కును కల్పిస్తూ..
ఫీజు నిధులు ఆయా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ అయ్యాక.. వారే కళాశాలకు వెళ్లి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చింది. తద్వారా ప్రతి తల్లి తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే వీలు కల్పించింది. ఆయా కాలేజీల్లో లోపాలుంటే ప్రశ్నించే హక్కును కూడా వారికి కల్పించింది.
విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది. కాలేజీలకు వారు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.
విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
బాపట్లలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఉన్నత చదువులు చదివేలా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తూ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది.
Related News By Category
Related News By Tags
-
మార్పును పట్టుకుందాం
ఇవాళ 17–22 ఏళ్ల పిల్లలు రాబోయే సవాళ్లను ఎదుర్కొంటూ ఈ ప్రపంచంలో కనీసం మరో 80 సంవత్సరాలు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. పదేళ్ల క్రితం మన దేశం, మన కుటుంబం, మనం ఎలాంటి ప్రపంచాన్ని చూశామో చెప్పగలం. అయ...
-
అందుకే వారికి కడుపు మంట: సీఎం జగన్
సాక్షి, బాపట్ల: ఏ బిడ్డకైనా అతి గొప్ప దీవెన చదువు మాత్రమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏ బిడ్డకైనా తప్పనిసరిగా అందాల్సింది చదువు మాత్రమే. చదువు అన్నది ఏ ఒక్కరూ కొల్లగొట్టలేనిదన్నార...
-
YS Jagan: ఓ తరం.. అంతరం
‘మన పిల్లలు.. గ్లోబల్ స్టూడెంట్స్’ అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి ప్రభుత్వ విద్యను తీసుకెళ్లారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. నర్సరీ నుంచి డిగ్రీ, పీజీ వరకూ అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు ...
-
పలు జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, గుంటూరు: ప్రకాశం, బాపట్ల జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక తదితర అంశాలపై చర్చిస్...
-
అమెరికాలో కాల్పులు.. బాపట్ల యువకుడు మృతి
కర్లపాలెం/సాక్షి, అమరావతి: అమెరికాలో ఓ దుండగుడి తుపాకీ కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ (32) మృతి చెందాడు. రైతు కూలీ కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాసర...
Comments
Please login to add a commentAdd a comment