అందుకే వారికి కడుపు మంట: సీఎం జగన్‌ | CM YS Jagan Speech In Jagananna Vidya Deevena At Bapatla | Sakshi
Sakshi News home page

అందుకే వారికి కడుపు మంట:సీఎం జగన్‌

Published Thu, Aug 11 2022 12:48 PM | Last Updated on Thu, Aug 11 2022 7:44 PM

CM YS Jagan Speech In Jagananna Vidya Deevena At Bapatla - Sakshi

సాక్షి, బాపట్ల: ఏ బిడ్డకైనా అతి గొప్ప దీవెన చదువు మాత్రమేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏ బిడ్డకైనా తప్పనిసరిగా అందాల్సింది చదువు మాత్రమే. చదువు అన్నది ఏ ఒక్కరూ కొల్లగొట్టలేనిదన్నారు. బాపట్లలో గురువారం జరిగిన ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. పేదరికం నుంచి చదువుల ద్వారానే బయటపడేయగలమన్నారు. రాబోయే కాలంలో పోటీని ఎదుర్కొంటూ సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో పిల్లలంతా జీవించాలని దీనికోసం ప్రభుత్వం చేయాల్సింది చేస్తున్నామని సీఎం అన్నారు.
చదవండి: సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు

‘‘ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యాదీవెన చెల్లిస్తున్నాం. తల్లుల ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.694 కోట్ల రూపాయాలు చెల్లిస్తున్నాం. విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రక్షణ పరంగా అన్నిరకాలుగా అక్క చెల్లెమ్మలకు మంచిచేస్తున్నాం. ఏప్రిల్, మే, జూన్‌ ఈమూడునెలలకు సంబంధించిన వందశాతం ఫీజురియింబర్స్‌ మెంట్‌ చెల్లిస్తున్నామని’’ సీఎం అన్నారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
పదేళ్ల కిందట ఎలాంటి ప్రపంచం ఉండేది
20 ఏళ్ల తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి.. అంటే.. ఊహకందని విషయం
అంత వేగంగా మార్పులు వస్తున్నాయి
ఆ మార్పులతో మనం ప్రయాణం చేయాలి
లేకపోతే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడలేరు
అందుకనే ప్రతి అడుగులోనూ మార్పు కనిపించాలి
అప్పుడే గొప్ప మార్పులు సాధ్యమవుతాయి
అలాంటి చదువులు రాష్ట్రంలో ప్రతి బిడ్డకూ అందాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర కులాల్లోని పేద కుటుంబాలకు చెందిన బిడ్డలు, నా బిడ్డలు పెద్ద చదువులు చదువుకోవాలి

మీ అందరి అన్నగా దీన్ని కోరుకుంటూ 3 ఏళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం
అందులో భాగంగానే ప్రాథమిక విద్యలోనే కాకుండాపెద్ద చదువులను కూడా పేదలకు అందుబాటులోకి తీసుకువస్తూ 100 శాతం ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం
ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తోంది
మీరు వెళ్లండి.. చదవండి.. ఎంతమంది బిడ్డలు ఉంటే.. అంతమందిని చదివిస్తాను అని సగర్వంగా తెలియజేస్తున్నాను

రేషన్‌లా ఆలోచించి ఒక్కరికే కాదు.. అందరికీ అందిస్తాం
చదివినప్పుడే మన బతుకులు, తలరాతలు మారుతాయి
ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా ఈ పథకం మన రాష్ట్రంలో అమలవుతుంది
తల రాతలు మార్చాలన్న ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది
ప్రతి తల్లి, తండ్రి కూడా ఖర్చుకు వెనకాడకుండా.. మీ బిడ్డలను బాగా చదివించండి
ఎంత మంది బిడ్డలు ఉన్నా.. చదివించండి.. తోడుగా మీ అన్న, తమ్ముడైన నేను ఉంటాను
ఆ బాధ్యత నేను తీసుకున్నాను
ప్రతి ఇంట్లోని నుంచి ప్రతి డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుకునే నా బిడ్డలు బయటకు రావాలి

2017-18, 2018-19 సంవత్సరాలకు ఫీజు రియింబర్స్‌మెంట్‌బకాయిలను రూ.1778 కోట్లను నేను కట్టాను
మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కట్టాను
జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన పథకాలకే ఈరెండు సంవత్సరాల కాలంలో రూ.11,715 కోట్లు నా అక్క చెల్లెమ్మలకు మూడేళ్లకాలంలో ఇచ్చాం
పిల్లలను చదివించుకోవడంకోసం అప్పులు పాలు కాకూడదు, పొలాలు అమ్ముకునే పరిస్థితి రాకూడదని గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం
పిల్లల చదువులకు ఏదీ అడ్డంకాకూడదని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం

ఒక్క విద్యారంగంలోని అమ్మ ఒడి, సంపూర్ణపోషణ, గోరుముద్ద, విద్యాకానుక, మన బడి నాడు-నేడు, ఇంగ్లిషు మీడియం, బైజూస్‌తో ఒప్పందం ఇవి మాత్రమే కాకుండా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం
పాఠ్యప్రణాళికలో 30 నుంచి 40 శాతం నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం ఉద్దేశించాం
10 నెలల ఇంటర్నెషిప్‌ ఏర్పాటు చేశాం
మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాం
విద్యారంగంమీద రూ. 53,338కోట్లు మూడేళ్లకాలంలో పెట్టాం
కాలేజీల్లో చేరుతున్నవారి సంఖ్యను పెంచాలన్నది ఉద్దేశం

2035 నాటికి 70శాతానికి జీఆర్‌ రేష్యోను పెంచాలన్నది ధ్యేయం
2018– 19 తో పోలిస్తే 2019–20లో 8.64శాతం పెరిగింది
జాతీయ స్థాయిలో 3.04 శాతం మాత్రమే
ఆడపిల్లలకు సంబంధించి రాష్ట్రంలో జీఈఆర్‌ రేష్యో 11.04శాతం వృద్ధి అయితే దేశవ్యాప్తంగా 2.28 శాతం వృద్ధి మాత్రమే
2018లో ప్రాథమిక విద్యలో కేంద్ర ప్రభుత్వాల గణాంకాల ప్రకారం... జీఈఆర్‌ రేష్యో 84.48శాతం అయితే, దేశవ్యాప్త సగటు 99శాతం
ఈ లెక్కల ప్రకారం అట్టడుగున ఉన్న రాష్ట్రాలతో పోటీపడింది
ఈ పరిస్థితుల్లో మన పిల్లలు బాగా చదవాలనే ఉద్దేశంతో తల్లులకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వచ్చాం
రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు

గతానికి, ఇప్పటికి పాలనలో తేడాను గమనించండి
అప్పుల్లో గ్రోత్‌ రేట్‌ గత పాలనలో 19శాతం సీఏజీఆర్‌ ఉంటే, ఇప్పుడు 15శాతం మాత్రమే ఉంది
అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా గతంతో పోలిస్తే తక్కువ

తేడా ఏంటి.. కేవలం ముఖ్యమంత్రిలో మార్పు
గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారు?
మీ అన్న, మీ తమ్ముడు నేరుగా బటన్‌ నొక్కుతున్నాడు, నేరుగా  అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తోంది
ఎక్కడా లంచాలు లేవు, వివక్షలేదు, డీబీటీ ద్వారా పోతుంది
గతంలో జరిగే స్కీం ఏంటి?
కేవలం నలుగురు మాత్రమే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, ఒక చంద్రబాబు, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు
వీరు మాత్రమే దోచుకో.. పంచుకో.. తినుకో...
డీపీటీ పథకం అప్పుడు అమలు చేశారు
ఈనాడు పేపర్‌ చదివినా, ఆంధ్రజ్యోతి చూసి, టీవీ–5 చూసినా.. వారి కడుపు మంట కనిపిస్తూ ఉంటుంది
గతంలో బాగా దోచుకుని పంచుకునే వాళ్లు..
మనం వచ్చాక దోచుకోవడం లేదు, పంచుకోవడం లేదు కాబట్టి.. జీర్ణించుకోలేకపోతున్నారు
అందుకనే వీరి కడుపు మంట కనిపిస్తోంది
వారికి లేనివి, నాకు ఉన్నవి.. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement