
తాళ్లపూడి: ఇటీవల కొవ్వూరులో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తనకు విద్యా దీవెన పథకం ఎలా మేలు చేసిందో చెబుతూ అందరినీ ఆకట్టుకున్న పెద్దేవం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తిరిగిపల్లి దివ్యకు అభినందనలు వెల్లువెత్తాయి.
దివ్య కుటుంబం కష్టాలు విని సీఎం వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.మాధవీలత నుంచి విద్యార్థిని దివ్యకు శుక్రవారం పిలుపు వచ్చింది. ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ, గ్రామ సర్పంచ్ తిరిగిపల్లి వెంకటరావు విద్యార్థిని దివ్యను వెంట పెట్టుకుని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు.
విద్యార్థి దివ్య కుటుంబానికి ఇంటి స్థలం తక్షణమే కేటాయించినట్టు కలెక్టర్ తెలిపారు. అతి త్వరలో మంత్రి చేతుల మీదుగా అందజేస్తామన్నారు. అలాగే ఉన్నత చదువుకు, ఆ తర్వాత మంచి ఉద్యోగ అవకాశం కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దివ్య హోంమంత్రి తానేటి వనితను కూడా కలిసింది.
Comments
Please login to add a commentAdd a comment