హార్దిక్ అరెస్ట్, విడుదల | Hardik Patel released on bail | Sakshi
Sakshi News home page

హార్దిక్ అరెస్ట్, విడుదల

Published Sun, Sep 20 2015 3:26 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

హార్దిక్ అరెస్ట్, విడుదల - Sakshi

హార్దిక్ అరెస్ట్, విడుదల

సూరత్: గుజరాత్‌లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. సూరత్‌లో హార్దిక్, ఆయన మద్దతుదారులు శనివారం ‘ఏక్తా ర్యాలీ’ నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకుని తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని వారిపై ఎఫ్‌ఐ ఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. హార్దిక్‌తోపాటు మరో 35 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ర్యాలీకి నిర్వాహకులు ముందస్తు  అనుమతి తీసుకోలేదని తెలిపారు.  తర్వాత హార్దిక్‌ను, అయన అనుచరులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా రూ. వెయ్యి పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. హార్దిక్‌ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పటేళ్లు నిరసన తెలిపారు. వారికి, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. వదంతులను నిలువరించడానికి రాష్ర్టంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించారు.  రాష్ట్ర ప్రభుత్వం పటేళ్ల వర్గాన్ని అణచివేస్తోందని  హార్దిక్  ఆరోపించారు.  దండినుంచి అహ్మదాబాద్‌కు ర్యాలీ నిర్వహించేం దుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హార్దిక్ సూరత్‌లో ర్యాలీ తలపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement