mumbai jail
-
వరవరరావుకు బెయిల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ కేసులో అరెస్టయి, ముంబై జైల్లో ఉన్న ప్రముఖ విప్లవ కవి, 81 ఏళ్ళ వరవరరావుకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన భార్య పెండ్యాల హేమలత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయనను నిరవధికంగా కస్టడీలో ఉంచటం అమాన వీయం, క్రూరత్వమని, రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను అతిక్రమించడమేనని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. 2018 నవంబర్‌లో జ్యుడీషియల్ కస్టడీకి వెళ్ళేనాటికి 68 కేజీల బరువున్న వరవరరావు ఇప్పుడు 50 కేజీల బరువున్నారని, ఆయన 18 కేజీల బరువు తగ్గారని, వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమౌతూ, మంచంలో నుంచి కదల్లేని స్థితిలో ఉన్నారని వెల్లడించారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో పాటు, కోవిడ్ ప్రబలిన తరువాత తలెత్తిన ఇబ్బందుల కారణంగా వరవరరావుకి నిరంతర పర్యవేక్షణ అవసరమౌతోందని హేమలత తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ తెలిపారు. -
పీటర్ ముఖర్జియా విడుదల
ముంబై: 2012నాటి సంచలన షీనా బోరా హత్య కేసులో గత నాలుగేళ్లుగా జైళ్లో ఉంటున్న పీటర్ ముఖర్జియాకు శుక్రవారం విడుదల అయ్యారు. బాంబే హైకోర్టు ఆయనకు ఫిబ్రవరిలోనే బెయిల్ ఇచ్చినప్పటికీ.. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఆరువారాల పాటు ఆ బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఆ స్టే గడువు గురువారంతో ముగిసింది. సీబీఐ అప్పీల్ చేసుకోకపోవడంతో ఆయన శుక్రవారం విడుదల అయ్యారు. సొంత కూతురు హత్యకు సంబంధించిన ఈ కేసులో ముఖర్జియా మాజీ భార్య ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన ముద్దాయి. పీటర్ ముఖర్జియా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లుగా ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని బెయిల్ ఉత్తర్వుల్లో బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. -
ఆ జైలుగది వీడియో పంపండి
లండన్: లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను ఉంచాలనుకుంటున్న ముంబైలోని జైలు గదిని పూర్తిగా వీడియో తీసి తమకు సమర్పించాలని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించిన తర్వాత ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సెప్టెంబర్ 12న వాదనలు ముగియనున్నాయి. మంగళవారం వెస్ట్‌మినిస్టర్ కోర్టులో మాల్యా కేసు విచారణకు వచ్చింది. భారత్‌లోని జైళ్ల్లలో మౌలిక సదుపాయాలు సరిగా ఉండవని, సహజసిద్ధమైన వెలుతురు, పరిశుభ్రమైన గాలి ఉండదని మాల్యా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ముంబై సెంట్రల్ జైలులోని 12వ గదికి సంబంధించిన ఫొటోలను భారత్ అధికారులు కోర్టుకు సమర్పించారు. కాగా, ఈ ఫొటోలను ఆధారంగా చేసుకుని విచారణ జరపలేనని వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జి ఎమ్మా ఆర్బర్నాట్ పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఆ 12వ గదిలోని అణువణువునూ వీడియో తీసి సమర్పించాల్సిందిగా ఆమె భారత అధికారులను ఆదేశించారు. ఎవరైనా వ్యక్తి ఫొటోలో ఉన్న తలుపు ద్వారా జైలులోకి వెళుతుండగా వీడియో తీయాలని జడ్జి చెప్పారు. అది కూడా మధ్యాహ్నం సమయంలో తీయాలని, దీంతో సూర్యకిరణాలు ఆ గదిలో పడుతున్నాయా లేదా అనేది తెలుస్తుందని పేర్కొన్నారు. జైలు పరిస్థితులు మానవ హక్కుల కమిషన్ నిబంధనల మేరకే ఉన్నాయని భారత్ వాదించింది. అలాగే మాల్యాబెయిల్ను సెప్టెంబర్ 12 వరకు కోర్టు పొడిగించింది. మాల్యా బ్యాంకులకు 9వేల కోట్లు ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే. -
మాల్యాకు ఊరట, జైలు వీడియో కోరిన కోర్టు
లండన్: వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఊరట లభించింది. భారత్‌కు మాల్యా అప్పగింత కేసును మంగళవారం విచారించిన వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు మాల్యా బెయిల్‌ను మరికొంత కాలం పొడిగించింది. మాల్యాకు బెయిల్ ఇవ్వొద్దన్న భారత ప్రభుత్వం అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చింది. అంతేకాదు మాల్యాను అప్పగిస్తే ఆయనను ఉంచబోయే ముంబై ఆర్దర్ రోడ్డులోని జైలు వీడియోను కోర్టుకు సమర్పించాల్సిందిగా కోరింది. ఇందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. 13 భారతీయ బ్యాంకులకు 9వేల కోట్ల మేర ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుడు మాల్యాను భారత్‌కు అప్పగింత విషయమై దాఖలైన పిటిషన్‌పై వాదనలు ఈ రోజు జరిగాయి. ఈ విచారణ నిమిత్తం కోర్టుకు మాల్యా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్యా మీడియాతో మాట్లాడారు. అక్రమంగా డబ్బులను విదేశాలకు తరలించారన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. అలాగే భారతీయ బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తే చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనకున్న రూ.14వేల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టి రుణాలు చెల్లిస్తానన్నారు. అలాగే 2015నుంచి ఈ కేసును పరిష్కరించుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు ఆస్తులను ఎటాచ్ చేసిన తరువాత తాను చేయగలిగింది ఏముందన్న మాల్యా, తుది నిర్ణయాన్ని కోర్టు నిర్ణయిస్తుందన్నారు. -
మాల్యా కోసం ముంబయి జైలు ముస్తాబు
సాక్షి,ముంబయి: భారతీయ జైళ్లు తనను నిర్భందించేందుకు అనువైనవిగా ఉండవన్న లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా అభ్యంతరాలను మహారాష్ర్ట సర్కార్ తోసిపుచ్చింది. యూరప్‌లోని ఏసీ జైళ్లకు దీటుగా ముంబయి అర్దర్ రోడ్ జైల్ యూనిట్ నెంబర్ 12లో సకల సౌకర్యాలున్నాయని రాష్ర్ట ప్రభుత్వం జైలు ఫోటోలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపింది. కోట్లాది రూపాయల రుణ ఎగవేత కేసులో నిందితుడు మాల్యా బ్రిటన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. 2008 ముంబయి ఉగ్ర దాడిలో పట్టుబడ్డ అజ్మల్ కసబ్‌ను ఉంచేందుకు ప్రత్యేకంగా అర్ధర్ రోడ్ జైలులో యూనిట్ 12ను నిర్మించారు. ఇదే బ్యారక్‌లో భారత్‌కు తరలించే విజయ్ మాల్యాను ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాము జైలు వసతులతో కూడిన పూర్తి సమాచారంతో అవసరమైన పత్రాలను జతచేసి కేంద్రానికి నివేదిక పంపామని మహారాష్ర్ట అడిషనల్ డీజీపీ (జైళ్లు) బీకే ఉపాథ్యాయ్ చెప్పారు. బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో మాల్యాను తమకు అప్పగించాలని ఈడీ దాఖలు చేసిన కేసులో మాల్యా తరపు న్యాయవాది భారత జైళ్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మాల్యా డయాబెటిక్ పేషెంట్ కావడంతో ఆయన పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ఇంట్లో వండిన ఆహారాన్నే అందించాల్సి ఉంటుందని బ్రిటన్ కోర్టుకు నివేదించారు. జైళ్లలో మరుగుదొడ్ల సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలు కొరవడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాల్యా దోషిగా తేలేంత వరకూ కోర్టు ఉత్తర్వులతో ఆయనకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు జైలులో ఏర్పాట్లు చేస్తామని మాల్యా న్యాయవాది వాదనలను తోసిపుచ్చుతూ మహారాష్ర్ట హోంశాఖ కేంద్రానికి నివేదించింది. కేసులో దోషిగా తేలిన తర్వాతే మాల్యాకు జైలు మ్యాన్యువల్ వర్తిస్తుందని ఈ నివేదికలో అధికారులు పేర్కొన్నారు. అవసరమైతే మాల్యా కోసం యూరోపియన్ శైలిలో టాయిలెట్‌ను నిర్మిచేందుకు జైలు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు, అర్ధర్ రోడ్డు జైలులో తామిప్పటికే సీనియర్ సిటిజన్ నిందితుల కోసం యూరప్ తరహా టాయిలెట్లను నిర్మించామని అధికారులు తెలిపారు. యూనిట్ నెంబర్ 12లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కోసం కొన్ని గదులున్నాయని, మాల్యా వీటిని ఉపయోగించుకోవచ్చని లేకుంటే ఆయనకు ప్రత్యేకంగా నిర్మిస్తామని హోంశాఖ సీనియర్ అధికారి తెలిపారు. -
బిగుస్తున్న ఉచ్చు..
* ముంబై జైల్లో ఉన్న ఎన్సీఎస్ ఎం.డిని తీసుకురావడానికి ప్రత్యేక బృందం * అక్టోబర్ 13న భూముల వేలం * బినామీ రుణాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు బొబ్బిలి : చెరుకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిం చకపోవడంతో పాటు వివిధ రకాల మోసాలకు పాల్పడిన ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం యాజామన్యం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిల్లులు చెల్లించకపోవడంతో రైతు లు కొద్ది రోజుల కిందట ఆందోళనలు చేసిన నేపథ్యం లో కర్మాగారం ఎం.డి నాగేశ్వరరావుతో పాటు డెరైక్టర్లు శ్రీనివాస్, మురళిపై కేసులు నమోదయ్యాయి. ఈ నెల 6న డెరైక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏడో తేదీన అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు విశాఖలోని కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. వీరిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. డెరైక్టర్లు పోలీసులకు చిక్కడంతో తాజాగా బినామీ రుణాలపై బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు ఫిర్యాదులు చేయడానికి ముందు కు వస్తున్నారు. ఇప్పటికే పార్వతీపురం పోలీస్ స్టేషన్ లో ఒక రైతు తమ పేరుమీద బినామీ రుణాలు తీసుకు ని మోసం చేశారంటూ ఎన్సీఎస్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయగా, తాజాగా సీతానగరం మండలం బూర్జకు చెందిన ఎర్ర చిన్నంనాయుడు, పణుకుపేటకు చెందిన బంకురు తవిటినాయుడు, పూడి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న డెరైక్టర్లు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. బిల్లుల చెల్లింపులు, బినామీ రుణాలపై నమోదైన కేసుల నేపథ్యంలో దర్యాప్తు కోసం డెరైక్టర్లను తమకు అప్పగించాలని పోలీసులు చేసుకున్న వినతిని కోర్టు పరిశీలిస్తోంది. కాగా ఈ కేసుతో సంబంధముండి ఇప్పటికే ముంబైలో అరెస్టు అయి ఆర్ధర్ సబ్ జైల్లో ఉన్న ఎం.డి నాగేశ్వరరావును తీసుకురావడానికి పోలీసుల ప్రత్యేక బృందం ముంబై పయనమైంది. బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు ఒక వైపు యాజమాన్యంను అరెస్టు చేసినా రైతుల ఆందోళనలు చల్లారకపోవడంతో ఇటు రెవెన్యూ అధికారులు అటు పోలీస్ అధికారులు రైతులకు పేమెంట్లు చెల్లించడానికి చర్యలు తీసుకున్నారు. రైతులకు సుమారు 24 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, మొదటి విడతగా ఆరు కోట్ల రూపాయలను అధికారులు చెల్లిస్తున్నారు. పది వేల రూపాయల లోపున్న 15 వందల మంది రైతులకు ముందుగా బిల్లులు చెల్లిస్తున్నారు. మిగతా వారికి కూడా బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 13న భూముల వేలం ఫ్యాక్టరీకి సంబంధించి రెవె న్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న భూములను వచ్చే నెల 13న వేలం వేయనున్నారు. సీతానగరం మండల పరిధిలో ఉండే సుమారు 36 ఎకరాల భూమిని వేలం వేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఈ నెల 8న ప్రకటన కూడా జారీ చేశారు. పార్వతీపురంలోని ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో వేలం వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.