
సంజీవ్ ఖన్నాకు పోలీసు కస్టడీ
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇంద్రాణి ముఖర్జియా మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు శుక్రవారం బాంద్రా కోర్టులో హజరుపరిచారు. ఆయనకు కోర్టు ఈనెల 31 వరకు పోలీసు కస్టడీ విధించింది. కోల్ కతాలో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఇంద్రాణిని పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. కాగా, షీనా బోరా మృతదేహాన్ని తగులబెట్టిన అటవీ ప్రదేశంలో పుర్రె, ఎముకలను పోలీసులు సేకరించారు. షీనా మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను భద్రపరిచారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని షీనా సోదరుడు మిఖైల్ తెలిపాడు.