Indrani Mukherjea
-
‘చనిపోయేలోపు నా పిల్లలతో మాట్లాడనివ్వండి’
ముంబై: చనిపోయే లోపు తన పిల్లలతో మాట్లాడే అవకాశం కల్పించండి అంటూ ముంబై సీబీఐ కోర్టును వేడుకున్నారు మాజీ మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా ప్రధాన నిందితుడనే సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం సీబీఐ కోర్టుకు హాజరైన పీటర్ ముఖర్జియా ‘నేను ఎంతకాలం జీవిస్తానో నాకు తెలియదు. నేను చనిపోయేలోపు విదేశాల్లో ఉన్న నా పిల్లలతో మాట్లాడాలనుకుంటున్నాను. అందుకు నాకు అనుమతివ్వండి’ అంటూ ముఖర్జియా న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఇందుకు జడ్జి సానుకులంగా స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని తెలిపారు. షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జియా పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నందుకే షీనాను హత్య చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. (చదవండి: వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..) -
‘చిదంబరం ఆధారాలు మాయం చేశారు’
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆధారాలన్నింటినీ మాయం చేశారని కోర్టుకు విన్నవించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా చిదంబరం తరఫున కపిల్ సిబల్, సీబీఐ తరఫున తుషార్ మెహర్ ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా.... ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియాను చిదంబరం కలిశారు అనడానికి సాక్ష్యాలు లేవని కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది ఆయనను కలిసేవారని.. అయితే వారిలో ఇంద్రాణీ ఉన్నారో లేరోనన్న విషయం ఆయనకు గుర్తులేదని కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఇందుకు ప్రతిగా... ‘సీబీఐ విచారణలో భాగంగా చిదంబరం ఇంద్రాణి కలిసినట్లు తేలింది. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారు. రిజిస్టర్‌ను చిదంబరం మాయం చేయించారు’ అని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. తాను చిదంబరాన్ని కలిశానని, ఈ మేరకు ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నానని ఆమె మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ ఇదివరకే కోర్టుకు వెల్లడించింది. -
ఇదీ.. చిదంబరం చిట్టా
యూపీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం తన కొడుకు కార్తీ కంపెనీలకు భారీగా లబ్ధి చేకూర్చారని ఆరోపణలున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియాతోపాటు మరి కొన్ని కేసుల్లో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనపై ఉన్న కేసుల వివరాలివీ... ఐఎన్ఎక్స్: విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా! స్టార్ టీవీ ఇండియాకు సీఈఓగా దాదాపు పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత బయటకు వచ్చేసిన పీటర్ ముఖర్జియా సంస్థ పేరే ఐఎన్ఎక్స్ మీడియా. ఈయన తన భార్య ఇంద్రాణి ముఖర్జీతో కలిసి 2007లో ఐఎన్ఎక్స్ మీడియాను ఆరంభించారు. దాన్లో ఇంద్రాణి సీఈఓగా ఉండగా... పీటర్ ముఖర్జియా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా చేరారు. ఈ సంస్థలోకి విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిన రూ.305 కోట్లకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) పచ్చజెండా ఊపింది. ఈ ఎఫ్ఐపీబీ అనుమతుల విషయంలో అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న పి.చిదంబరం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన అభియోగం. అంతేకాక విదేశీ పెట్టుబడుల రూపంలో ఐఎన్‌ఎక్స్‌లోకి వచ్చిన డబ్బులు వేరెవరివో కావని, చిదంబరం తనయుడు కార్తీకి చెందిన వివిధ కంపెనీలు ఈ పెట్టుబడుల్ని ఇండియాకు తరలించడానికి ఐఎన్ఎక్స్ మార్గాన్ని ఎంచుకున్నాయని, ఇది స్పష్టమైన మనీ లాండరింగ్ వ్యవహారమని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలు ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా మారిపోయారు. ఈ కేసులో తమను ఇరికించకుండా చూడడానికి వారు కార్తీకి 10 లక్షలు లంచం కూడా ఇచ్చారని సీబీఐ చెబుతోంది. ఎయిర్‌సెల్– మాక్సిస్: అక్రమ అనుమతులు! ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసు 2011వ సంవత్సరం మేలో వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌సెల్ సంస్థ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ తన సంస్థలోని 74 శాతం వాటాలను 2006లో మలేసియా కంపెనీ మాక్సిస్‌కు విక్రయించారు. అప్పటి కేంద్ర టెలికం మంత్రి దయానిధి మారన్ బలవంతంగా తనతో ఈ పని చేయించారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ఆరంభించగా... ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. రూ.3,500 కోట్ల విలువ చేసే పెట్టుబడులను మాక్సిస్ సంస్థ ఎయిర్‌సెల్‌లో పెట్టిన సమయంలో ఆర్థిక మంత్రిగా చిదంబరమే ఉన్నారు. వాస్తవానికి ఈ స్థాయి విదేశీ పెట్టుబడులకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం నిబంధనల్ని తోసిరాజని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ద్వారా అనుమతులు మంజూరు చేశారని అభియోగాలున్నాయి. నిజానికి ఎఫ్ఐపీబీకి రూ.600 కోట్ల వరకు విలువున్న పెట్టుబడులకు మాత్రమే అనుమతినిచ్చే అధికారం ఉంది. ఈ ఒప్పందం కుదరడానికి చిదంబరం కుమారుడు కార్తీకి భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. 20 సార్లు చిదంబరానికి ఊరట ఐఎన్ఎక్స్, ఎయిర్‌సెల్, మాక్సిస్ కేసుల్లో ఇప్పటికే పలు దఫాలు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ చిదంబరాన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాయి. చిదంబరం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేసుకొని అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఈ ముందస్తు బెయిల్‌కు సంబంధించిన గడువుల్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. అలా మొత్తంగా 20 సార్లు చిదంబరానికి ఊరట లభించింది. ఇప్పటికే ఈడీ చిదంబరాన్ని గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో రెండు సార్లు ప్రశ్నించింది కూడా. బెయిల్‌పై ఉన్న కార్తీ ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం కుమారుడు కార్తీని గత ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేసింది. 23 రోజుల పాటు జైల్లో ఉన్న కార్తీ మార్చిలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి భారత్, యూకే, స్పెయిన్ దేశాల్లో కార్తీ చిదంబరానికి చెందిన రూ.54 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. పెండింగ్‌లో మరిన్ని కేసులు ► ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.1,272 కోట్ల విలువైన అవినీతి జరిగినట్టు కూడా చిదంబరంపై కేసు ఉంది. దీనిపై విచారణకు హాజరు కావాలని ఇటీవలే ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ► రూ.5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ ్చంజ్ వ్యవహారంలో చిదంబరం తీసుకున్న నిర్ణయాల వల్లే తమ సంస్థ భారీగా దెబ్బతిన్నదని ‘63 మూన్స్ టెక్నాలజీస్’సంస్థ (గతంలో దీనిపేరు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్) ఫిర్యాదు చేసింది. ► ఇక శారదా చిట్‌ఫండ్ కేసులో చిదంబరం భార్య నళిని ప్రమేయం ఉన్నట్టుగా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో 1.4 కోట్ల రూపాయల ముడుపులు నళినికి అందినట్టుగా ఆరోపణలున్నాయి. ► బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్, 2015 కింద చిదంబరం, ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ, కోడలు శ్రీనిధిని విచారించాలంటూ ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఆదేశాలను గత ఏడాది మద్రాస్ హైకోర్టు కొట్టివేసినప్పటికీ, సుప్రీం కోర్టులో ఇంకా ఇది పెండింగ్‌లో ఉంది. ► చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పడు ఇష్రాత్ జహాన్ కేసులో అఫిడవిట్‌ను తారుమారు చేసినట్టుగా ఆరోపణలున్న కేసు ఢిల్లీ పోలీసుల వద్ద పెండింగ్‌లో ఉంది. దాక్కోలేదు.. నిందితుడిని కాను న్యూఢిల్లీ: బుధవారం రాత్రి అరెస్టవ్వడానికి కొద్దిసేపటి ముందు చిదంబరం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. అక్కడ చిదంబరం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. ‘ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేను కనీసం నిందితుడిని కూడా కాను. చట్టం నుంచి దాక్కోలేదు. చట్టపరంగా రక్షణ కోరుతున్నాను. నేను చట్టం నుంచి దాక్కుంటున్నానని అంటుండటం చూసి విస్మయం చెందాను. న్యాయం కోసం పోరాడుతున్నాను. ఐఎన్ఎక్స్ కేసులో నేను కానీ, నా కుటుంబీకులు కానీ, లేదా మరెవ్వరూ నిందితులు కాదు. ఈ కేసులో సీబీఐ, ఈడీలు అభియోగపత్రం కూడా దాఖలు చేయలేదు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలాల్లోనూ నేను తప్పు చేసినట్లు ఎక్కడా లేదు. అయినా నేను, నా కొడుకు ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు చెప్పడమనే రోగం ఉన్నవారు వ్యాప్తి చేస్తున్న అసత్యాలే ఇవన్నీ. నిజాన్ని దాటి ఏదీ ముందుకు వెళ్లలేదు. సీబీఐ, ఈడీలు నన్ను విచారించడం కోసం నోటీసులు ఇచ్చాయి. ముందుజాగ్రత్తగా అరెస్టు నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లి తాత్కాలిక రక్షణ కోరాను. నాకు దాదాపుగా గత 15 నెలలపాటు ఆ రక్షణ లభించింది. నేను ఎక్కడా దాక్కోలేదు. నిన్న రాత్రంతా నేను నా లాయర్లతో కలిసి కూర్చొని కోర్టులో సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నా. ఈ రోజు ఉదయానికే పని ముగిసింది. నా కేసును సుప్రీంకోర్టు శుక్రవారమే విచారిస్తుందని తెలిసింది. నేను న్యాయస్థానం ఆదేశాలకు తలవంచుతున్నాను. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేయకపోయినా సరే, నేను చట్టాన్ని గౌరవిస్తాను’అని మీడియాతో అన్నారు. కక్షగట్టారు: కాంగ్రెస్ చిదంబరానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే ఆయనపై కక్షగట్టి కేంద్రం వేధిస్తోందని వారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థ లను, ఓ వర్గం మీడియాను ఉపయోగించి చిదంబరం వ్యక్తిత్వాన్ని హతమార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహు ల్ గాంధీ ఆరోపించారు. చిదంబరాన్ని కేంద్రం వేటాడుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఓ ట్వీట్ చేస్తూ ఏది ఏమైనా తాము చిదంబరానికి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపింది. ‘అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా నిజం మాట్లాడే పౌరులను పీడించడం ద్వారా ప్రభుత్వం తన పిరికితనాన్ని మళ్లీ మళ్లీ బయటపెట్టుకుంటోంది. చిదంబరం ఎన్నో అర్హతలున్న, గౌరవనీయ నాయకుడు. అంకితభావం, వినయంతో ఆయన ఈ దేశానికి సేవ చేశారు. సత్యాన్వేషణలో మేం ఆయనకు మద్దతుగా ఉంటాం. ఏది ఏమైనా సరే’అని కాంగ్రెస్ ట్విట్టర్లో పేర్కొంది. పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, ఇతర సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ, శశి థరూర్ తదితరులు చిదంబరానికి మద్దతుగా మాట్లాడా రు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులపై ఎన్ని ఆరోపణలున్నా వారంతా పదవులు అనుభవిస్తున్నారని వారు ఆరోపించారు. తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు: బీజేపీ చిదంబరంపై కేసు విషయంలో కాంగ్రెస్ చేసిన కక్షసాధింపు వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. విచారణలో తాము జోక్యం చేసుకోవడంలేదనీ, చిదంబరం తాను చేసిన పనుల వల్లే ఈ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది. ‘ఆయన (చిదంబరం) ఏదైనా తప్పు చేసి ఉంటే, తప్పకుండా ఆయన ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాదేశాలతో పనిచేయవు. స్వతంత్రంగా పనిచేసే అధికారాలు వాటికి ఉన్నాయి’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. అరెస్ట్‌కు ముందు ఏఐసీసీ కార్యాలయంలో చిదంబరం చిదంబరం ఇంట్లోకి వస్తున్న సీబీఐ అధికారుల కారును అడ్డుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు -
‘అతడు ఓ సైలెంట్ కిల్లర్; అప్పుడు తనేం చేశాడు మరి?’
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మాజీ మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియా సైలెంట్ కిల్లర్‌లా వ్యవహరించారని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. సవతి కూతురును దారుణంగా హత్య చేయించారనే ఆరోపణలతో 2015లో పీటర్ అరెస్టైన సంగతి తెలిసిందే. షీనా తల్లి, పీటర్ రెండో భార్య ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన నిందితురాలిగా ఉన్న ఈ కేసులో తనకు బెయిలు కావాలంటూ పీటర్ మరోసారి అప్పీలు చేశారు. ఈ క్రమంలో షీనా బోరా హత్యకేసు శుక్రవారం మరోసారి సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది.(వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..) ఈ నేపథ్యంలో పీటర్‌కు బెయిలు నిరాకరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ భరత్ బదామీ కోర్టుకు విఙ్ఞప్తి చేశారు. ఈ కేసులో పీటర్ ముద్దాయి అని నిరూపించడానికి సీబీఐ వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నాయని విన్నవించారు. షీనా హత్య జరిగినపుడు తన క్లైంట్ లండన్‌లో ఉన్నారని పీటర్ న్యాయవాది పేర్కొనగా.. ఇందుకు ప్రతిగా భరత్ వాదిస్తూ 26/11 ముంబై పేలుళ్ల కేసును ప్రస్తావించారు. ‘లష్కర్ ఏ తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ అతడికి ఈ పేలుళ్ల కేసుతో సంబంధం లేదని చెప్పలేం. అలాగే పీటర్ లండన్‌లో ఉన్నప్పటికీ అతడు షీనా కేసులో నిందితుడు కాకుండా పోడు’ అని వాదించారు. ‘ పీటర్‌కు అన్నీ తెలుసు. తన కొడుకు రాహుల్ షీనా గురించి ఆరా తీసినపుడే మందలించి ఉండాల్సింది. పీటర్ ఓ సైలెంట్ కిల్లర్. కొడుకును మార్చకుండా అతడు ఏం చేశాడు మరి’ అని భరత్ తన వాదనలు వినిపించారు. దీంతో ఆయన బెయిలు అప్పీలు మరోసారి తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది.(‘ఆ రెండు రోజులు ఎవరినీ ఫ్లాట్‌లోకి రానివ్వలేదు’) షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నందుకే షీనాను హత్య చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. -
‘ఆ రెండు రోజులు ఎవరినీ ఫ్లాట్‌లోకి రానివ్వలేదు’
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు విచారణలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. షీనా తల్లి, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ కలిసి ఉద్దేశపూర్వకంగానే షీనా బోరాను హత్యచేసినట్లు ఇటీవలే కీలక సాక్షి సీబీఐ కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్.. వర్లీ ఏరియాలోని మార్లో బిల్డింగ్(ఇంద్రాణీ- పీటర్ల నివాసం) మేనేజర్ మధుకర్ ఖిల్జీని విచారించారు. ఈ క్రమంలో... షీనా బోరా హత్య జరిగిన నాటి నుంచి(ఏప్రిల్ 24, 2012) రెండు రోజుల పాటు (ఏప్రిల్ 24-26) రెండు రోజుల పాటు ఇంద్రాణీ తన ఫ్లాట్‌లోకి ఎవరినీ రానివ్వలేదని మధుకర్ పేర్కొన్నాడు. షీనాతో పాటుగా ఆమె సోదరుడు మైఖేల్ బోరాను కూడా హత్య చేసేందుకు ఇంద్రాణీ ప్రణాళిక రచించారని తెలిపాడు. ’ షీనా తన చెల్లెలని ఇంద్రాణీ చెప్పారు. ఏప్రిల్ 23 న నన్ను పిలిచి తన అనుమతి లేకుండా ఎవరినీ ఫ్లాట్ దగ్గరికి కూడా రానివ్వొద్దని చెప్పారు. ముఖ్యంగా పీటర్ కొడుకు రాహుల్ ముఖర్జీ(ఇంద్రాణీ సవతి కొడుకు)ని అస్సలు అనుమతించొద్దన్నారు. అందుకే రాహుల్ మార్లోకు వచ్చినప్పుడు మేము అడ్డుకున్నాం’ అని మధుకర్ కోర్టుకు తెలిపాడు. కాగా ఇప్పటికే ఈ కేసులో మధుకర్‌తో కలిసి 28 సాక్షులను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలు, షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న ఇంద్రాణీ ప్రస్తుతం బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు సీబీఐ కోర్టులో బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా 27వ సాక్షిని ప్రాసిక్యూషన్ లాయర్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా... షీనా తల్లి, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ కలిసి ఉద్దేశపూర్వకంగానే షీనా బోరాను హత్యచేసినట్లు సదరు సాక్షి పేర్కొన్నారు. ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న ఇంద్రాణి స్నేహితుడు, ఆమె వద్ద పనిచేసే ఉద్యోగి అయిన ప్రితుల్ సంఘ్వీ విచారణలో భాగంగా పలు విషయాలు కోర్టుకు వెల్లడించారు.‘ 2002 నుంచి నాకు ఇంద్రాణి పరిచయం. నా ఇంట్లో తను అద్దెకు ఉండేది. ఆ తర్వాత ఆమె కంపెనీలో మేనేజర్‌గా జాయిన్ అయ్యాను. ఇంద్రాణి, ఆమె భర్త పీటర్ ముఖర్జీ ఇచ్చే పార్టీలకు తరచుగా హాజరయ్యేవాడిని. ఆ సమయంలో షీనా కూడా ఒకటి రెండుసార్లు అక్కడికి వచ్చింది. ఇంద్రాణి.. షీనాను తన చెల్లిగా మా అందరికీ పరిచయం చేసింది. అయితే పీటర్ కొడుకు రాహుల్‌తో షీనా రిలేషన్షిప్లో ఉండటం ఆ దంపతులిద్దరికీ నచ్చలేదు. 2008 నుంచి వాళ్లను విడదీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ కుదరకపోవడంతో ఓరోజు.. వాళ్లిద్దరు ఉండే ఏరియాకు నన్ను కూడా రమ్మన్నారు. అయితే నాకు ఆరోజు వేరే పని ఉండటంతో రాలేనని చెప్పాను. ఆ తర్వాత ఇంద్రాణి.. షీనాను తనతో పాటు తీసుకువెళ్లగా, రాహుల్‌ని.. పీటర్ తీసుకువెళ్లాడు. ఇంతలోనే షీనా కనిపించడం లేదనే వార్త బయటికి వచ్చింది’ అని ప్రితుల్ సింగ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షీనాను హత్య చేయడం వెనుక ఇంద్రాణికి ఉన్న ఉద్దేశమేమిటో నిరూపించేందుకు సీబీఐకి బలమైన సాక్ష్యం లభించినట్లైంది. (విడిపోనున్న ఇంద్రాణి దంపతులు) ఇంద్రాణి- పీటర్ ముఖర్జీ షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
విడిపోనున్న ఇంద్రాణి దంపతులు
సాక్షి, ముంబై : షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం ముంబైలోని ఫ్యామిలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్న ముఖర్జియా దంపతులు.. ఆస్తుల పంపకానికి సంబంధించిన విషయాలను కూడా పిటిషన్లో పొందుపరిచారు. బ్యాంకు అకౌంట్లతో సహా.. ఇప్పటివరకు సంయుక్తంగా లావాదేవీలు జరిపిన బ్యాంకు అకౌంట్లను ఇకపై వ్యక్తిగత అకౌంట్లుగా మార్పు చేసుకునేందుకు ఇరువురు అంగీకరించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఇద్దరి పేరిట సిండికేట్ బ్యాంకులో ఉన్న 53 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు, అంతర్జాతీయ బ్యాంకుల్లో కలిగి ఉన్న అకౌంట్లు, విదేశాల్లో ఉన్న బంగ్లాలు, విలువైన నగలు, ఖరీదైన వాచ్‌లు, బ్యాంకు లాకర్లను సమంగా పంచుకునేందుకు తామిద్దరికీ సమ్మతమేనని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా 16 ఏళ్ల క్రితం ఇంద్రాణి, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. వైవాహిక జీవితంలో ఆటుపోట్ల వల్లనే.. దక్షిణ ముంబైలో ఓ ఫైవ్ స్టార్ హోటర్‌లో ఇంద్రాణి, పీటర్ల ప్రేమ చిగురించింది. 2002లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లైన కొన్ని ఏళ్లలోనే వీరి వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. పీటర్ కొడుకు రాహుల్‌తో.. ఇంద్రాణి కూతురు(మొదటి భర్త ద్వారా జన్మించింది) షీనా బోరా సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత ఆమెను 2012లో చంపేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 2015 ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
విడాకులు కోరుతున్న ఇంద్రాణి
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు అయిన ఇంద్రాణి ముఖర్జియా తన పెళ్లి జీవితానికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నారు. విడాకులు కోరుతూ తన భర్త పీటర్ ముఖర్జియాకు నోటీసులు పంపించారు. ఈ కేసులో సహ నిందితుడు పీటర్ నుంచి పరస్పర అంగీకారం ద్వారా విడాకులు కోరుతున్నట్టు లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు చేసుకోలేదు. ఏప్రిల్ 25న ఈ నోటీసులు పంపినట్టు తెలిసింది. తమిద్దరి వివాహ బంధం సయోధ్యగా ఉండేందుకు ఎలాంటి అవకాశం లేదని, విడాకుల అనంతరం ఒకరి జీవితంలోకి మరొకరం ఎలాంటి జోక్యం చేసుకోమని ఇంద్రాణి చెప్పారు. కాగా, పీటర్ ముఖర్జియా ఇంద్రాణికి రెండో భర్త. ఇంద్రాణికి అంతకముందు సంబంధం ద్వారా జన్మించిన కూతురు షీనా బోరా. ఇంద్రాణి, తన ప్రస్తుత భర్త పీటర్‌తో కలిసి అత్యంత పాశవికంగా తన చేతులతోనే గొంతుపిసికి చంపేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. పీటర్ కొడుకు రాహుల్‌తో షీనా బోరా సంబంధం పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోవడంతో ఆ ఘాతుకానికి పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి. దక్షిణ ముంబైలో ఓ ఫైవ్ స్టార్ హోటర్‌లో ఇంద్రాణి, పీటర్ల ప్రేమ చిగురించింది. 2002లో వీరిద్దరికి పెళ్లి జరిగింది. పెళ్లైన కొన్ని ఏళ్లలోనే వీరి వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. పీటర్ కొడుకు రాహుల్‌తో షీనా బోరా సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత ఆమెను 2012లో చంపేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 2015 ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంద్రాణి అరెస్ట్ తర్వాత పీటర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే షీనాను చెల్లిగా తనకు ఇంద్రాణి పరిచయం చేసిటనట్టు పీటర్ చెప్పారు. అసలు విషయం తాను గుర్తించలేకపోయినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంద్రాణి, పీటర్ అసలు మాట్లాడుకోవడం లేదని తెలిసింది. పీటర్ మొదటి భార్యకు ఇద్దరు కొడుకులున్నారు. ఇంద్రాణి, పీటర్ ప్రస్తుతం బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ముంబై, గోవా, ఇంగ్లాండ్‌లో వీరు ఆస్తులు కొన్నట్టు తెలుస్తోంది. -
జైలు నుంచి ఇంద్రాణి విడుదల
-
జైలు నుంచి ఇంద్రాణి విడుదల
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతితో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమెకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఒకరోజు పాటు పోలీసుల పర్యవేక్షణలో ఆమె జైలు బయట గడపనున్నారు. తన కుమార్తె షీనా బోరా హత్యకేసులో గత ఏడాది ఆగస్టులో ఇంద్రాణి అరెస్టయ్యారు. మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి షీనాను ఇంద్రాణి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంద్రాణి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త పీటర్ ముఖర్జియా కూడా ఇదే కేసులో జైలుపాలయ్యారు. తన మేనకోడలి పెళ్లి చూసేందుకు బెయిల్ ఇవ్వాలని ఆయన ఇటీవల పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. -
త్వరలో షీనా బోరాపై సినిమా విడుదల!
ముంబై: షీనాబోరా హత్య ఆధారంగా నిర్మిస్తున్న బెంగాలీ చిత్రం 'డార్క్ చాక్లెట్' విడుదలపై బొంబాయి హైకోర్టు స్టేను తిరస్కరించింది. ఈ చిత్రానికి సంబంధించి కోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్లపై కోర్టుకు నమ్మకం ఉందని.. ఈ చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలలించిన మీదటే విడుదలకు సర్టిఫిట్ ను ఇస్తారని అంది. త్వరలో రానున్న చిత్ర విడుదలను సవాలు చేస్తూ షీనా పిన తండ్రి పీటర్ ముఖర్జీయా వేసిన పిటీషన్‌ను డివిజన్ బెంచ్ సిట్టింగ్ జడ్జీ ఎస్సీ ధర్మధికారీ గురువారం విచారించారు. ఈ సినిమా విడుదలయితే తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని పీటర్ కోర్టుకు తెలిపారు. సినిమాను విడుదల చేయడానికంటే ముందే తనను వీక్షించేందుకు అనుమతించాలని, ఆమేరకు వారికి ఆదేశించాలని కోర్టును కోరారు. సినిమా ఇంకా పూర్తి కాలేదని నిర్మాణానంతరం సీబీఎఫ్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఏవైనా అనుమానాలు ఉంటే మరలా కోర్టుకు రావొచ్చని ధర్మాసనం తెలిపింది. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ప్రజావాణీలో ఈ కేసు గురించి వినిపించిన కథనే తాము తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. చిత్ర దర్శకుడు అగ్నిదేవ్ ఛటర్జీ, నిర్మాతలు మాట్లాడుతూ న్యాయస్థానాలపై వారికి పూర్తి నమ్మకం ఉందని అన్నారు. త్వరలో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసి సెన్సార్ బోర్డుకు పంపుతామని చెప్పారు. ఈ చిత్రంలో మహిమా చౌదరి, రియా సేన్లు ఇంద్రాణీ ముఖర్జీయా, షీనాబోరా పాత్రల్లో కనిపించనున్నారు. -
'వాళ్లను ఉరి తీయండి'
గువాహటి: తన తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు మరణశిక్ష విధించాలని షీనా బోరా సోదరుడు మైఖేల్ కోరుకుంటున్నాడు. తన సోదరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితులకు ఉరి శిక్ష పడాలిని కోరుకుంటున్నట్టు చెప్పాడు. షీనా బోరా హత్య గురించి ఇంద్రాణి రెండో పీటర్ ముఖర్జియాకు అంతా తెలుసునని తాను ముందు నుంచి చెబుతున్నానని గుర్తు చేశాడు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరగదని అన్నాడు. భార్య(ఇంద్రాణి)తో కలిసి జీవిస్తున్న పీటర్ కు ఇందతా తెలియకుండా ఎలా వుంటుందని మైఖేల్ ప్రశ్నించాడు. పీటర్ పై సీబీఐ మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో అతడు స్పందించాడు. 'నా సోదరి షీనా బోరా హత్యకు సుదీర్ఘమైన కుట్ర జరిగింది. నన్ను చంపేందుకు కూడా ప్రణాళిక వేశారు. నలుగురు నిందితులు ఇంద్రాణి, పీటర్, సంజీవ్ ఖన్నా, శ్యామవర్ రాయ్ లను ఉరి తీయాలి. వీరికి జీవించే హక్కు లేద'ని మైఖేల్ పేర్కొన్నాడు. -
'ఇంద్రాణి నా తల్లి కాదు.. సోదరి కాదు'
ముంబై: 'ఇంద్రాణి నా తల్లి కాదు.. సోదరి కూడా కాదు. కొన్ని సంవత్సరాల కిందట మన జీవితాల్లోకి వచ్చిన ఓ మంచి వ్యక్తి ఆమె'- షీనాబోరా ఈమెయిలో ఐడీ నుంచి 2013 మార్చ్ నెలలో వచ్చిన ఒక ఈమెయిల్ సారాంశమిది. షీనాబోరా ఐడీ నుంచి ఇంద్రాణి ముఖర్జీ భర్త, మీడియా అధిపతి పీటర్ ముఖర్జీయాకు ఈ మెయిల్ అందింది. అంటే షీనాబోరా హత్యకు గురైన ఏడాది తర్వాత కూడా ఆమె పేరిట ఉన్న ఈమెయిల్ ఐడీని ఉపయోగించినట్టు దీనిని బట్టి తెలుస్తున్నది. షీనా బోరా హత్యకేసు దర్యాప్తులో ఇది కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని సీబీఐ భావిస్తున్నది. సీబీఐ దర్యాప్తు జరుపుతున్న ఈ కేసులో షీనాబోరాను తల్లి ఇంద్రాణియే హత్యచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. షీనా బోరా తన కూతురు అయినప్పటికీ ఆ విషయాన్ని దాచి సోదరిగా ఇంద్రాణి ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షీరా బోరా హత్యకు గురయిన ఏడాది తర్వాత ఆమె ఈమెయిల్ ఐడీ నుంచి ఇంద్రాణి భర్తకు వచ్చిన మెసెజ్ లో చిత్రమైన విషయాలు పేర్కొని ఉన్నాయి. 1991లో షీనా బోరా తాత, నాయనమ్మల సహకారంతో ఒక నిగూఢ మహిళ ఇంద్రాణి అవతారంలోకి మారిందని, అసలు ఇంద్రాణి షీనా రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే షీనాను, మైఖేల్ ను వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఈ మెయిల్ పేర్కొంది. అయితే.. షీనా, ఇంద్రాణి మధ్య బంధం ఏమిటన్నది షీనా హత్యకు ముందు పీటర్ కు తెలియదని ఈ మెయిల్ ద్వారా తెలుస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మెయిల్ లోని విషయాలను ఓ జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. గొంతు నులుమడం వల్ల ఊపిరి ఆడకపోవడంతో షీనాబోరా చనిపోయిందని ఎయిమ్స్ పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. షీనాబోరా వజ్రాల వ్యాపారిని పెళ్లాడింది! 2012 ఏప్రిల్ నుంచి కనిపించకుండా పోయిన షీనాబోరా గురించి అడిగితే తన తల్లి ఇంద్రాణి కోప్పడేదని, అయితే ఓసారి మాత్రం షీనాబోరా అమెరికాలోని వజ్రాల వ్యాపారిని పెళ్లాడిందని చెప్పిందని విధి సీబీఐకి తెలిపింది. షీనాబోరా హత్యకేసులో భాగంగా ఇంద్రాణి, పీటర్ ముఖర్జీయా కూతురు అయిన విధి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చింది. -
ఆ హత్య పీటర్‌కు ముందే తెలుసా?
ముంబయి: షీనా బోరా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. తన తండ్రికి షీనా బోరా హత్యకు ఏ సంబంధం లేదని, ఆయన అమాయకుడని పీటర్ ముఖర్జియా తనయుడు రాహుల్ ముఖర్జియా చెప్పిన మరుసటి రోజే సీబీఐ వెల్లడించిన కొన్ని విషయాలు పీటర్‌కు షీనా హత్యకు ఏవో సబంధాలున్నాయని పరోక్షంగా చెబుతున్నాయి. షీనా చనిపోయిందన్న విషయం పీటర్ ముఖర్జియాకు ముందే తెలుసని సీబీఐ వర్గాలు పరోక్షంగా చెబుతున్నాయి. అందుకే కావాలని పోలీసు అధికారి దేవెన్ భారతీని కలిశారని, కనిపించకుండా పోయినా షీనా ఫోన్ కాల్ డేటా తమకు ఇవ్వాలని, ఆమె ఎక్కడ ఉందో గుర్తించాలని ఆయనను కోరినట్లు సీబీఐ అధికారులు దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ హత్యను ఒక మిస్సింగ్ కేసుగా మార్చే ప్రయత్నం ఇంద్రాణి, పీటర్ చేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో గత ఆగస్టులోనే షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు అరెస్టు చేయగా పీటర్ ను గత వారం అరెస్టు చేశారు. సీబీఐ వర్గాలు విశ్వసిస్తున్న ప్రకారం షీనా చనిపోయిన విషయం ముందే తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదుచేసేందుకు ప్రయత్నించిన రాహుల్ ముఖర్జియాను కూడా తప్పుదోవపట్టించాడని తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఇంద్రాణి, పీటర్ సంప్రదించిన పోలీసులు అధికారి భారతీని ఈ కేసులో ఆధారంగా చేర్చారు. -
ఆ హత్య పీటర్‌కు ముందే తెలుసా?
-
ఇంద్రాణి కస్టడీ పొడిగింపు
-
ఇంద్రాణి కస్టడీ పొడిగింపు
ముంబై: షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా జ్యుడిషియల్ కస్టడీని పొడగించారు. ఇంద్రాణితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌కు ఈ నెల 19వరకు కస్టడీ పొడగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంద్రాణి ప్రస్తుతం ముంబై జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బైకలా జైల్లో రిమాండ్‌లో ఉన్న ఇంద్రాణి గత శుక్రవారం అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. కాగా ప్రస్తుతం ఇంద్రాణి ఆరోగ్యం మెరుగవుతోంది. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశముంది. ఆమెను ఆస్పత్రి నుంచి జైలుకు తరలిస్తారు. -
ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్న ఇంద్రాణి
ముంబై: తన కుమార్తె షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ట్రీట్ మెంట్ కు ఆమె స్పందిస్తున్నారని జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే వెల్లడించారు. ఇప్పటికీ ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని, ఆమెను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇంద్రాణి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెట్టి చూస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై లేదని, తనంతట తాను ఊపిరి తీసుకోలేకపోవడం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు జైల్లో ఇంద్రాణి వద్దకు మోతాదుకు మించి మాత్రలు ఎలా చేరాయనే దానిపై జైళ్ల శాఖ ఐజీ దర్యాప్తు ప్రారంభించింది. ఆస్పత్రిలో ఉన్న ఇంద్రాణిని కలిసేందుకు అనుమతించాలంటూ ఆమె తరఫు న్యాయవాది స్థానిక కోర్టును ఆశ్రయించారు. -
'48 గంటలు గడిస్తే కానీ చెప్పలేం..'
ముంబై: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీయా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ముంబై జేజే ఆస్పత్రి వైద్యులు చెప్పారు. 48 గంటలు గడిస్తే కానీ ఆమె పరిస్థితిని చెప్పలేమని వైద్యులు తెలిపారు. షీనాబోరా హత్య కేసులో బైకలా జైల్లో రిమాండ్‌లో ఉన్న ఇంద్రాణి అపస్మారక స్థితికి చేరుకోవడంతో శుక్రవారం జేజే ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఆమె మోతాదుకు మించి నిద్రమాత్రలు వాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జేజే ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
మరో 3 రోజులు ఆస్పత్రిలోనే ఇంద్రాణి
ఆత్మహత్యా యత్నం! ఆస్పత్రిలో అపస్మారకంలో.. ముంబై: జైల్లో ఉండి ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఇంద్రాణి ముఖర్జీ మరో మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె సగం స్పృహలో ఉందని.. ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తూ, మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉంచుతామని ముంబై జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే శనివారం ఉదయం తెలిపారు. ఆమెకు అవసరమైన రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలను చేయించామని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో సీబీఐ బృందానికి కూడా చెప్పామని ఆయన అన్నారు. తన కూతురు షీనాబోరాను హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పరిస్థితి శనివారం అకస్మాత్తుగా విషమంగా మారింది. బైకలా జైల్లో ఉన్న ఆమె కొన్ని మాత్రలు వేసుకున్న వెంటనే ఊపిరి తీసుకోవటం కష్టంగా మారటంతో హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే ఆమె అపస్మారకంలో ఉన్నారని, పరిస్థితి విషమంగా ఉందని జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే ప్రకటించారు. ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నట్లు తేలిందని, వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నట్లు వివరించారు. తనకు ఒంట్లో బాగాలేదని ఇంద్రాణి చెప్పటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు డీసీపీ మోహన్ దహికర్ చెప్పారు. ఆమె కడుపులోని ద్రవపదార్థాలను సేకరించి ఫోరెన్సిక్ దర్యాప్తునకు పంపించినట్లు ఆయన తెలిపారు. ఇంద్రాణి ఆరోగ్యం ఉన్నట్టుండి దెబ్బతినటంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక మరేదైనా తెలియని కారణం ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమె ఫిట్స్ నిరోధానికి వైద్యం చేయించుకుంటున్నారని జేజే ఆసుపత్రి డీన్ లహానే చెప్పారు. ఆ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి మాత్రమే, అది కూడా జైలు అధికారుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి. అయితే ఆ మాత్రలను అధిక మోతాదులో ఇంద్రాణి వాడారని.. దాని వల్లే అపస్మారక స్థితిలోనికి వెళ్లారని వైద్యులు అంటున్నారు. సెప్టెంబర్ 11 నుంచి ఆమె ఈ మాత్రలు వేసుకుంటున్నారు. అధిక మోతాదులో మాత్రలు ఆమె దగ్గరకు ఎలా చేరాయో తెలియటం లేదని సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు. ఇప్పటికే ఆమె కేసును విచారించిన ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాను ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ విచారణకు ఆదేశించారు. -
'ఇంద్రాణి పరిస్థితి విషమం'
-
ఇంద్రాణి కస్టడీ పొడిగింపు
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాని నిందితురాలు షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా కస్టడీ మరింత పొడిగించారు. ఆమెతోపాటు ఆమె భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాం రాయ్‌కు అక్టోబర్ 5 వరకు స్థానిక కోర్టు కస్టడీ విధించింది. 2012 ఏప్రిల్ నెలలో తన కన్న కూతురుని ఇంద్రాణి ముఖర్జీ దారుణంగా చంపేసి అనంతరం రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో ఈ నెల ఓ రెండు రోజులపాటు సుధీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు అనంతరం ఆమెను సెప్టెంబర్ 7న స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దాంతో కోర్టు ఈ నెల 21 వరకు కస్టడీ విధించగా అది నేటితో పూర్తయింది. దీంతో మరోసారి కోర్టుకు హాజరుపరిచి అక్టోబర్ 5 వరకు కస్టడీకి తీసుకున్నారు. -
షీనాబోరా హత్యకేసులో మరో మలుపు!
-
షీనాబోరా హత్యకేసులో మరో మలుపు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత కమిషనర్ జావేద్ అహ్మద్ ఈ కేసు విచారణ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడం, పాత కమిషనర్ రాకేష్ మారియాను దీన్నుంచి తప్పించాలని ప్రయత్నాలు జరగడం లాంటి పరిణామాల నేపథ్యంలో.. ఈ తలనొప్పి తమకెందుకని సర్కారు భావించినట్లు తెలుస్తోంది. షీనా బోరా హత్యకేసు గురించిన పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా తాను డీజీపీని కోరారని, ఆయన నుంచి నివేదిక రాగానే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి దీనిపై సమగ్రంగా చర్చించామని మహారాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కేపీ బక్షీ తెలిపారు. ఈ హత్యకేసు దర్యాప్తు పూర్తి నిష్పక్షపాతంగా జరగాలని, స్థానిక పోలీసులు లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల జోక్యం ఏమాత్రం లేకుండా ఉండాలనే మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ చేతుల్లోనే షీనా బోరా హత్యకు గురైనట్లు కథనాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చూస్తున్న ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు మధ్యలో పదోన్నతి కల్పించి ఆయనను వేరే పదవిలోకి బదిలీ చేయడం, ఆ తర్వాత ఏ పదవిలో ఉన్నా.. మారియానే కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని చెప్పడం లాంటి అనేక మలుపులు తిరిగాయి. చివరకు ఈ కేసు ఇప్పుడు సీబీఐ చేతికి వెళ్లింది. -
షీనా కేసు: సంజీవ్‌కు జ్యుడీషియల్ రిమాండ్
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమె సవతి తండ్రి సంజీవ్ ఖన్నాకు ఈ నెల 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మంగళవారం ముంబై పోలీసులు ఖన్నాను బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. షీనా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి, కారు డ్రైవర్ రాయ్‌లకు నిన్న జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఇంద్రాణి తన మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి కారు డ్రైవర్ సాయంతో షీనాను హత్య చేసినట్టు విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే. -
'విచారణకు ఇంద్రాణి సహకరించడం లేదు'
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితులకు ఈ నెల 7 వరకు పోలీస్ కస్టడీ పొడగించారు. ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ నిందితులుగా ఉన్నారు. శనివారం వీరిని కోర్టులో ప్రవేశపెట్టారు. షీనా హత్య కేసులో ఇంద్రాణి సహకరించడంలేదని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసు విచారణ కోసం నిందితులకు రిమాండ్ పొడగించాలని పోలీసులు కోర్టును కోరారు. కోర్టు నిందితులకు కస్టడీ పొడగించడంతో పోలీసులు వారిని ఖర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఇంద్రాణి తన మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో కన్న కూతురు షీనాను హత్య చేసిన సంగతి తెలిసిందే. -
ఐ హేట్ మై మదర్.. విరక్తి పుడుతోంది!
''డిప్రెషన్ చుట్టేస్తోంది.. జీవితం చాలా అసహ్యంగా ఉంది.. నా తల్లంటేనే విరక్తి పుడుతోంది.. ఆమె ఓ బ్లడీ ....'' ఇవీ మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా మనసులోని విషయాలు. ఈ కేసులో సరికొత్త విషయాలు తాజాగా వెలుగుచూశాయి. పోలీసుల విచారణలో షీనా బోరా స్వయంగా రాసుకున్న డైరీ బయట పడింది. ముత్యాల్లాంటి అక్షరాలతో ఒకే విషయాన్ని డైరీలో షీనా మళ్లీ మళ్లీ రాసుకుంది. ''అన్ని వైపుల నుంచీ డిప్రెషన్ నన్ను చుట్టేస్తోంది. జీవితం ఎంత అసహ్యకరంగా ఉంది, నా తల్లంటే నాకు విరక్తి పుడుతోంది. ఐ హేట్ మై మదర్.. ఆమె.. ఓ '' బ్లడీ బి...'' . ఆమె తల్లి కాదు మాంత్రికురాలు అంటూ తన ఆవేదనంతా అక్షరాల్లో వెలిబుచ్చింది. షీనా తన తల్లిపట్ల ఉన్న ఏహ్యభావంతోనే ఆమెరికాలో ఉండేదని, ఇక్కడకు వచ్చేందుకు ఇష్టపడేది కాదని డైరీలో ఆమె రాసుకున్న విషయాలను బట్టి తెలుస్తోంది. ఆమె ఏప్రిల్ 24, 2012 న చనిపోయే సమయానికి షీనాకు 24 సంవత్సరాలు వయసు ఉందని, ఆ సాయంత్రమే షీనాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాతోపాటు, ఆమె డ్రైవర్ కారులో షీనాను గొంతు నులిమి చంపేశారని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దొరికిన పదేళ్ల కిందటి డైరీ ముఖ్యంగా షీనాకు, ఆమె తల్లి ముఖర్జియాకు మధ్య కుటుంబ సంబంధాలను తెలియజేస్తోందని, షీనాను ముఖర్జియా అందరికీ తన సోదరిగా పరిచయం చేసేదని పోలీసులు అంటున్నారు. 2003 ఫిబ్రవరి 11 తేదీన డైరీలో ''ఓహ్ నాకు హ్యాపీ బర్త్ డే నా! కానీ నేను హ్యాపీగా లేను'' అని షీనా రాయడం ఆమె ఎంత మాత్రం తన తల్లితో సంతోషంగా లేదన్న విషయాన్ని సూచిస్తోంది. షీనా బోరా... పీటర్ ముఖర్జియా కొడుకు రాహుల్ ముఖర్జియా దగ్గర ఉండేది. ఇంద్రాణి ముఖర్జియాను పీటర్ 2002 లో వివాహం చేసుకున్నాడు. పీటర్‌ను పోలీసులు బుధవారం నాడు 12 గంటల పాటు ప్రశ్నించారు. ఇందులో పోలీసులకు పీటర్ ముఖర్జియా తమ మధ్య ఉన్న ఆర్థిక పరమైన గొడవల గురించి వివరించారు. అంతేకాదు సంజయ్ ఖన్నా, ఇంద్రాణిల కుమార్తె 'విధి' విషయంలో తమ మధ్య గొడవలు మొదలయ్యాయని, షీనా బోరా, ఆమె సోదరుడు మిఖైల్ ఇద్దరూ కలిసి విధిని చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. కాగా తాను కూడా షీనా హత్యకు సహాయపడినట్లు ఆయన ఒప్పుకున్నారు. -
షీనా తండ్రిని నేనే.. కాని ఇంద్రాణిని పెళ్లాడలేదు
ముంబయి/కోల్‌కతా: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో బయటకు వస్తున్న ఒక్కో అంశం ఒక్కో సంచలనంగా మారుతోంది. తొలిసారి షీనా బోరా అసలు తండ్రి సిద్ధార్థ్ దాస్ బయటకు వచ్చి పలు వివరణలు కోల్ కతాలో మీడియాకు వివరణ ఇచ్చారు. షీనాకు తండ్రి తానేనని ఒప్పుకున్న ఆయన ఈ కేసులో అసలు ముద్దాయి ఇంద్రాణి ముఖర్జియాను వివాహం మాత్రం చేసుకోలేదని చెప్పారు. కన్నకూతురు హత్యకు పాల్పడిన ఆమెను నిలువునా ఉరి తీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రాణి పూర్తిగా డబ్బు మనిషి అని, ఆమెతో తాను సహజీవనం మాత్రమే చేశాను తప్ప వివాహం చేసుకోలేదని వివరణ ఇచ్చారు. 1989లోనే ఇంద్రాణి తనను వదిలేసి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి ఆమెతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. బహుశా నాకు అప్పుడు ఉద్యోగం కూడా లేనందున నా స్థితి ఆమెకు నచ్చక వెళ్లిపోయి ఉండొచ్చని అన్నారు. షీనా డీఎన్ఏ పరీక్ష కోసం తన డీఎన్ఏ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సిద్ధార్థ దాస్ తెలిపారు. -
సంజీవ్ ఖన్నాకు పోలీసు కస్టడీ
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇంద్రాణి ముఖర్జియా మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు శుక్రవారం బాంద్రా కోర్టులో హజరుపరిచారు. ఆయనకు కోర్టు ఈనెల 31 వరకు పోలీసు కస్టడీ విధించింది. కోల్ కతాలో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంద్రాణిని పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. కాగా, షీనా బోరా మృతదేహాన్ని తగులబెట్టిన అటవీ ప్రదేశంలో పుర్రె, ఎముకలను పోలీసులు సేకరించారు. షీనా మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను భద్రపరిచారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని షీనా సోదరుడు మిఖైల్ తెలిపాడు. -
అమ్మ నన్ను కూడా చంపేసేదేమో!?
-
అమ్మ నన్ను కూడా చంపేసేదేమో!?
షీనా హత్య కేసులో ఇంద్రాణి కొడుకు అనుమానం * గువాహటిలో మిఖైల్, కోల్‌కతాలో ఖన్నా... * ముంబైలో ఇంద్రాణి, రాహుల్‌ల ఇంటరాగేషన్ * హత్య చేయాల్సిన ప్రదేశంలో ముందే రెక్కీ నిర్వహించిన ఇంద్రాణి గువాహటి/ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు విచారణ ఊపందుకుంది. గువాహటిలో షీనా సోదరుడు మిఖైల్‌ను, కోల్‌కతాలో నిందితురాలు ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాను, ముంబైలో ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కొడుకు రాహుల్‌ను పోలీసులు గురువారం రోజంతా విచారించారు. విచారణలో రకరకాల కోణాల్లో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన సోదరిని హత్య చేసిన తల్లి.. తరువాత తనను కూడా చంపేసేదేమోనని ఆమె కుమారుడు మిఖైల్ బోరా గువాహటిలో అన్నాడు. పోలీసులు ముంబైకి పిలిస్తే ఈ కేసులో వారికి పూర్తిగా సహకరిస్తానని.. కేసుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలను సమర్పిస్తానన్నాడు. ‘అమ్మ చాలా శక్తిమంతురాలు.. తాను ఏమైనా చేయగలదు’ అని అన్నాడు. తన పాన్ కార్డ్‌ను, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వాలని తల్లి తనను అడిగిందని. అయితే తాను ఇవ్వకుండా నిరాకరించానన్నాడు. ఆ తరువాత ముంబై నుంచి వచ్చిన ఓ పోలీసు అధికారి మిఖైల్‌ను అతని ఇంట్లోనే గంటపాటు విచారించారు. హత్యకుకారణమేంటో తెలుసు: మారియా ఇటు ముంబైలో షీనా హత్య కేసు విచారణలో గురువారం ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా స్వయంగా రంగంలోకి దిగారు. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్‌ని రాకేశ్ స్వయంగా ఇంటరాగేట్ చేశారు. షీనా బోరాను స్వయంగా ఆమె తల్లే చంపడానికి కారణమేమిటనేది తమకు తెలుసని, అయితే కోల్‌కతాలో అరెస్టు చేసిన మూడో నిందితుడు సంజీవ్ ఖన్నా (ఇంద్రాణి రెండోభర్త) ఇంకా ముంబైకి చేరుకోలేదని, ఆయనను కూడా విచారించాకే జరిగిందేమిటో వెల్లడిస్తామని రాకేశ్ గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అటు కోల్‌కతాలో ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు గురువారం విచారించా రు. హత్య జరిగిన తీరు మాత్రం సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ ఎస్పీరాయ్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. దీని ప్రకారం ‘షీనా హత్య జరిగిన ఏప్రిల్ 24, 2012కు ముందు రోజే సంజీవ్‌ఖన్నా కోల్‌కతా నుంచి ముంబైకి వచ్చాడు. ఏప్రిల్ 23న ఇంద్రాణి రాయ్‌గఢ్ తాలూకాలోని అటవీప్రాంతానికి వెళ్లి అక్కడ రెక్కీ నిర్వహించింది. ఏప్రిల్ 24లో ముంబైలోని ఓ హోటల్ గదిలో షీనాకు మద్యం తాగించి, తరువాత కారులోకి బలవంతంగా ఎక్కించి.. హైవేపై తీసుకెళ్తూ మార్గమధ్యంలోనే గొంతు నులిమి చంపేశారు. ఆ తరువాత ముందురోజు తాము ఎంపిక చేసుకున్న అటవీ ప్రాంతంలో ఆమె శవాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఏప్రిల్ 25న విమానం ద్వారా సంజీవ్‌ఖన్నా తిరిగి కోల్‌కతా వెళ్లిపోయాడు.’ మరోవైపు పీటర్ కుమారుడు రాహుల్‌ను దాదాపు 12 గంటల పాటు పోలీసులు విచారించారు. షీనాది పరువు హత్యా? లేక ఆర్థిక వ్యవహారమా? అన్నది తేలాల్సి ఉంది. తండ్రి స్థానంలో తాతపేరు కూతురు షీనా బోరా బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరు స్థానంలో ఇంద్రాణి ముఖర్జీ ఎవరి పేరు రాయించారో తెలుసా? తన సొంత తండ్రి పేరును. ఉపేంద్ర కుమార్ బోరా...ఇంద్రాణికి తండ్రి. అయితే మనవరాలు షీనా బర్త్ సర్టిఫికెట్లో కూడా తండ్రిగా ఈయన పేరే ఉంది. 80 ఏళ్ల ఉపేంద్ర కుమా ర్ బోరా గురువారం స్పందిస్తూ... ‘షీనా నా కూతురు కాదు, మనవరాలు’ అని చెప్పారు. సిద్ధార్థ్ దాస్(ఇంద్రాణి మొదటిభర్త) షీనా తండ్రి అని తెలిపారు. అయితే సిద్ధార్థ్ కూడా షీనా తండ్రి కాకపోవచ్చని, షిల్లాంగ్ వాసి ద్వారా ఇంద్రాణి ఆమెను కన్నదనే వార్తలపై స్పందిస్తూ... వాస్తవమేంటో తేలాలన్నారు. -
షీనా బోరా సోదరుడు అరెస్టు
గువాహతి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో అరెస్టు జరిగింది. హత్యకు పాల్పడిన ఇంద్రాణి ముఖర్జియా కుమారుడు, షీనాబోరా సోదరుడు మిఖైల్ బోరాను పోలీసులు దిస్పూర్లో అదుపులోకి తీసుకున్నారు. తొలుత ప్రాథమిక విచారణ కోసం స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు కొద్ది సేపు ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేశారు. 2012లో షీనా బోరాను ఆమె కన్నతల్లి ఇంద్రాణి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సమగ్ర సమాచారం కోసం షీనా బంధువులను, కుటుంబీకులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు. -
తర్వాత అమ్మ నన్నే చంపేసేదేమో..
గువాహతి: 'నాసోదరి తర్వాత మా అమ్మ నన్నే టార్గెట్ చేసేదేమో. ఆ తర్వాత నన్నే చంపేసేదేమో' అని కూతురు హత్యకు పాల్పడి కటకటాలపాలైన మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జియా కుమారుడు మిఖైల్ బోరా అన్నాడు. ఇంద్రాణి అరెస్టు నేపథ్యంలో గువాహతిలో మీడియాతో మాట్లాడారు. 'నాకు తెలియదు. 2012లో మా సోదరి షీనా బోరాను హత్య చేసిన తర్వాత బహుషా నన్నే టార్గెట్ పెట్టుకొని చంపేసేదేమో. ఆ రోజు నన్ను పిలిచింది. కానీ నేను రావడం కుదరదని చెప్పాను. ఆమె చాలా శక్తిమంతురాలు. ఏమనుకుంటే అది చేయగలదు' అని పేర్కొన్నాడు. ఈ కేసు దర్యాప్తుకు సహాయపడేందుకు ముంబయికి వెళ్లాలని ఉంది. కాని ఒంటరిగా వెళ్లడం భయంగా ఉంది. మా తాతయ్యఅమ్మమ్మల బాధ్యతలు చూసుకునేందుకు అసోం ప్రభుత్వం ఇద్దరు నర్సులను ఏర్పాటుచేయగలిగితే వెళ్లగలను' అని చెప్పాడు. సొంత కూతురు షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసిన విషయం తెలిసిందే. -
షీనా బోరా హత్య కేసులో సరికొత్త ట్విస్ట్
ముంబై:నగరంలో కలకలం రేపిన షీనా బోరా హత్య కేసులో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా కేసులో తాజాగా 'రాజీనామా లేఖ' ఒకటి వెలుగుచూడటం ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కు గురైన కొన్ని రోజుల అనంతరం తాను పనిచేసే కార్యాలయంలో ఓ స్నేహితురాలికి రాజీనామా లేఖను పంపిందట. ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తున్న షీనా రాజీనామా లేఖపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.2012, ఏప్రిల్ 24వ తేదీన షీనా బోరా హత్యకు గురైతే.. అదే సంవత్సరం మే నెలలో తన రాజీనామా లేఖను ఆఫీసుకు పంపినట్లు తన ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. 1990 లో అస్పాం నుంచి తల్లి ఇంద్రాణి ముఖర్జీతో కలిసి ముంబైకు వచ్చిన షీనా బోరా.. ఆపై సెయింట్ ఎక్స్ వీర్ కళాశాలలో బీఏ ఎకనామిక్స్ చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు పది సంవత్సరాల అనంతరం 2011 జూన్ లో రిలయన్స్ ముంబై మెట్రో సంస్థలో ఉద్యోగం పొందిన షీనా బోరా . . కొన్ని రోజుల అనంతరం ఉద్యోగానికి పూర్తిగా రావడం మానేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ సంవత్సరమే తన ఫేస్ బుక్ అకౌంట్ ను కూడా క్లోజ్ చేసిందన్నారు. 2012వ సంవత్సరం ఏప్రిల్ 24 హత్య కు గురైన షీనా బోరా రాజీనామా లేఖపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. షీనా హత్య తేదీపై నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. అసలు ఆ లేఖను పంపిందెవరు?అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పరువు హత్య అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. 2012లో హత్యకు గురైన షీనా బోరా కేసులో టీవీ మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణిని బుధవారం అరెస్టు చేశారు. స్టార్ ఇండియా 2002లో స్టార్ ఇండియా సీఈఓగా పీటర్ ఉన్నప్పుడు ఇంద్రాణిని పెళ్లాడాడు. అంతకుముందే ఇద్దరికీ జరిగిన వివాహాలకు విడాకులూ అయ్యాయి. అయితే ఆమెకు సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నాలతో తనకు జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని పీటర్ దగ్గర దాచింది. అనంతరం చోటు చేసుకున్నపరిణామాలు కూతురు షీనా బోరా హత్యకు దారి తీశాయి. ఆ విషయాన్ని దాచి పెట్టిన ఇంద్రాణి.. షీనా అమెరికాకు వెళ్లినట్లు అందర్నీనమ్మించింది. ఈ హత్య కేసులో ఇంద్రాణి పాత్ర ఉందని తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు. -
కూతుర్ని చంపిన తల్లి!
-
కూతుర్ని చంపిన తల్లి!
షీనా బోరా హత్య కేసులో మలుపుల మీద మలుపులు కూతురిని సోదరిగా భర్తకు పరిచయం చేసిన భార్య ♦ సవతి సోదరుడితో డేట్ చేసిన షీనా! ♦ గొంతునులిమి.. సజీవ దహనం.. హత్య చేసినట్లు ఒప్పుకున్న డ్రైవర్ ముంబై: భర్తను పదిహేనేళ్లుగా బురిడీ కొట్టించిన భార్య.. కూతుర్ని సోదరిగా పరిచయం చేసిన భార్య.. ఆ కూతురితో డేట్ చేసిన సవతి కొడుకు.. ఆ కూతుర్ని హత్య చేసిన కన్న తల్లి.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. నమ్మరాని బాంధవ్యాలు.. విస్మయం కలిగించే నిజాలు.. దేశంలోని ఓ సంపన్న కుటుంబంలో జరిగిన ఒకానొక హత్యకేసు తవ్వుతున్న కొద్దీ చిత్రవిచిత్రంగా మలుపులు తిరుగుతోంది. 2012లో హత్యకు గురైన షీనా బోరా కేసులో టీవీ మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణిని అరెస్టు చేయటంతో ఊహకందని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పీటర్ స్టార్ ఇండియా 2002లో స్టార్ ఇండియా సీఈఓగా ఉన్నప్పుడు ఇంద్రాణిని పెళ్లాడాడు. అంతకుముందే ఇద్దరికీ జరిగిన వివాహాలకు విడాకులూ అయ్యాయి. అయితే సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నాలతో తనకు జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని ఇంద్రాణి పీటర్ దగ్గర దాచింది. చనిపోయిన షీనా సిద్ధార్థ కూతురని సమాచారం. రెండు రోజుల క్రితం ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేసేంతవరకూ ఈ విషయం పీటర్‌కు తెలియదు. ఈ నమ్మలేని అనుబంధాల కథ పీటర్ మాటల్లోనే.. ‘కలలో కూడా ఊహించని ఘటన ఇది. అదీ నా భార్య విషయంలో నాకెదురవుతుందనుకోలేదు. ఇన్నేళ్లుగా షీనాను నా భార్య ఇంద్రాణి సోదరిగానే నమ్ముతూ వచ్చాను. ఇప్పుడు షీనా.. ఇంద్రాణి కూతురని పోలీసులు చెప్పారు. అంతేకాదు. ఇంద్రాణి సోదరుడిగా నాకింతకాలం పరిచయంలో ఉన్న మిఖైల్ ఆమెకు అంతకుముందు జరిగిన పెళ్లి ద్వారా కలిగిన బిడ్డని తెలిసి షాక్‌కు గురయ్యాను. షీనాను ఎప్పుడూ తన సోదరిగానే ఇంద్రాణి చెప్తూ వచ్చింది. షీనా అలాగే వ్యవహరించింది. నా కొడుకు రాహుల్ ముఖర్జియా షీనాతో డేట్ చేశాడు. ఒక సందర్భంలో అతడు షీనా ఇంద్రాణి కూతురని బయటపెట్టినా నేను నమ్మలేదు. తప్పని వాదించాను. ఇంద్రాణిని అడిగాను. ఆమె తన ముందు వైఖరినే మళ్లీ చెప్పింది. ఆమెనే నమ్ముతూ వచ్చాను. మూడేళ్లుగా నా కొడుకుతో మాట్లాడటం మానేశాను. 2012 నుంచి షీనా అదృశ్యమైనా ఆ సంగతి నాకు తెలియదు. ఒకసారి నేను ఇంద్రాణిని అడిగితే ఆమె అమెరికాకు వెళ్లినట్లుగా నమ్మించింది. షీనా లాస్ఏంజెలిస్ ఉన్న కొన్ని ఫోటోలను ఇంద్రాణి నాకు చూపించింది. నా కొడుకు అనుమానం వ్యక్తం చేశాడు’’ రాయ్‌గఢ్ అడవుల్లో షీనా హత్య షీనాబోరాను రాయ్‌గఢ్ జిల్లాలోని అడవుల్లో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 2012 ఏప్రిల్ 24న షీనాను గొంతు నులిమి హత్య చేసి, ఆ తర్వాత అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి పెట్రోల్ పోసి దహనం చేశారని ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా తెలిపారు. మే 23న పోలీసులకు మృతదేహం దొరికిందని, అయితే గుర్తు తెలియని మృతదేహం కావటంతో.. డీఎన్ఏ శాంపిల్స్ సేకరించకుండానే దానికి అంత్యక్రియలు నిర్వహించారని మారియా వివరించారు. విచారణ సందర్భంలో షీనాను ఇంద్రాణి హత్య చేసినట్లు, మృతదేహాన్ని అడవుల్లో కాల్చేందుకు తాను సహకరించినట్లు ఇంద్రాణి డ్రైవర్ ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ హత్య కేసులో ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ ఖన్నా నిందితుడన్నారు. ఖన్నాను కోల్‌కతాలోని అతని స్నేహితుడి ఫ్లాట్‌లో అరెస్టు చేసి ముంబైకి తీసుకువచ్చారు. అయితే హత్యకు నిజమైన కారణాలేమిటన్నది ఇంకా తేలాల్సి ఉందన్నారు. మరోవైపు ఇంద్రాణిని బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం హాజరుపరిచారు. ఆమె పోలీస్ కస్టడీని న్యాయమూర్తి ఈ నెల 31 వరకు పొడిగించారు. -
షీనా బోరా ఆమె సోదరి కాదు.. కూతురు
ముంబయి: ఆస్తి వివాదంలో హత్యకు పాల్పడి అరెస్టయిన ఇంద్రాని ముఖర్జియా కేసు కీలక మలుపు తిరిగింది. హత్యకు గురైన షీనా బోరా ఆమె సోదరి కాదని ఆమె సొంత కూతురని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయం తెలిసి ఆమె భర్త స్టార్ ఇండియా మాజీ చీఫ్ పీటర్ ముఖర్జియా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. గత రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ కేసు విషయంలో కారు డ్రైవర్ సమాచారం మేరకు ఇంద్రాని అరెస్టు చేసిన పోలీసులు తొలుత షీనా బోరా సోదరి అని పొరపడ్డారు. కానీ కొన్ని గంటల విచారణ అనంతరం షీనా ఇంద్రాని కూతురు అని తేలింది. ఫొరెన్సిక్ ల్యాబ్ నివేదిక కూడా రావాల్సి ఉంది. కూతురు షీనా బోరా విషయంలో ప్రశ్నించగా ఆమె కనిపించడంలేదని, కనిపించకుండా పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా పోలీసులకు ఇవ్వకపోవడంతో వారి అనుమానం మరింత బలపడింది. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
స్టార్ ఇండియా మాజీ చీఫ్ భార్య అరెస్టు
ముంబయి: స్టార్ ఇండియా మాజీ చీఫ్ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాని ముఖర్జిని రాయగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై ఓ హత్య కేసు విషయంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తి ఆమె సొంత సోదరి హత్యకు కుట్ర చేశారని, అందుకు ఆమె కారు డ్రైవర్ కూడా సహకరించాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2012లో ఇంద్రాని సోదరి షీనా బోరా హత్యకు గురైంది. ఆమె దేహం కుళ్లిపోయిన స్థితిలో ఓ అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన ఇంద్రాని కారు డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా ఇంద్రానినే ఆమె సోదరిని హత్య చేశారని, మృతదేహాన్ని తరలించేందుకు తాను సహకరించానని తెలిపినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో ఇంతకంటే వివరాలు పోలీసులు చెప్పలేమన్నారు. ఇంద్రానిని అరెస్టు చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించగా ఈ నెల 31 వరకు రిమాండ్ విధించారు. కారు డ్రైవర్‌ను కూడా అరెస్టు చేశారు.