
షీనా బోరా ఆమె సోదరి కాదు.. కూతురు
ముంబయి: ఆస్తి వివాదంలో హత్యకు పాల్పడి అరెస్టయిన ఇంద్రాని ముఖర్జియా కేసు కీలక మలుపు తిరిగింది. హత్యకు గురైన షీనా బోరా ఆమె సోదరి కాదని ఆమె సొంత కూతురని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయం తెలిసి ఆమె భర్త స్టార్ ఇండియా మాజీ చీఫ్ పీటర్ ముఖర్జియా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.
గత రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ కేసు విషయంలో కారు డ్రైవర్ సమాచారం మేరకు ఇంద్రాని అరెస్టు చేసిన పోలీసులు తొలుత షీనా బోరా సోదరి అని పొరపడ్డారు. కానీ కొన్ని గంటల విచారణ అనంతరం షీనా ఇంద్రాని కూతురు అని తేలింది. ఫొరెన్సిక్ ల్యాబ్ నివేదిక కూడా రావాల్సి ఉంది. కూతురు షీనా బోరా విషయంలో ప్రశ్నించగా ఆమె కనిపించడంలేదని, కనిపించకుండా పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా పోలీసులకు ఇవ్వకపోవడంతో వారి అనుమానం మరింత బలపడింది. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.