peter Mukherjea
-
‘చనిపోయేలోపు నా పిల్లలతో మాట్లాడనివ్వండి’
ముంబై: చనిపోయే లోపు తన పిల్లలతో మాట్లాడే అవకాశం కల్పించండి అంటూ ముంబై సీబీఐ కోర్టును వేడుకున్నారు మాజీ మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా ప్రధాన నిందితుడనే సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం సీబీఐ కోర్టుకు హాజరైన పీటర్ ముఖర్జియా ‘నేను ఎంతకాలం జీవిస్తానో నాకు తెలియదు. నేను చనిపోయేలోపు విదేశాల్లో ఉన్న నా పిల్లలతో మాట్లాడాలనుకుంటున్నాను. అందుకు నాకు అనుమతివ్వండి’ అంటూ ముఖర్జియా న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఇందుకు జడ్జి సానుకులంగా స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని తెలిపారు. షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జియా పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నందుకే షీనాను హత్య చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. (చదవండి: వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..) -
వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్థాపకులు ఇంద్రాణీ ముఖర్జీ–పీటర్ ఈ మనీలాండరింగ్ కేసులో అప్రూవర్లుగా మారడంతో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మెడకు ఉచ్చు బిగుసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం అనుమతులు ఇవ్వాలంటే తన కుమారుడు కార్తీకి వ్యాపారంలో సహకరించాలని 2008లో అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కోరినట్లు ఇంద్రాణీ, పీటర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. తన కుమారుడికి సాయం చేస్తే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతులు వచ్చేస్తాయని చిదంబరం చెప్పారన్నారు. దీంతో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తాము కార్తీతో సమావేశమయ్యామనీ, ఈ సందర్భంగా తనకు 10 లక్షల డాలర్లు చెల్లిస్తే ఎఫ్‌ఐడీల కోసం అనుమతులు లభిస్తాయని కార్తీ చెప్పినట్లు ఇంద్రాణి ముఖర్జీ వెల్లడించారు. కార్తీకి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కంపెనీ ఖాతాలో రూ.10 లక్షలు జమచేసినట్లు పీటర్ ముఖర్జీ వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని ‘క్విడ్ ప్రో కో’గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభివర్ణించింది. అయితే 10 లక్షల డాలర్లలో మిగతా మొత్తాన్ని ఇంద్రాణీ–పీటర్లు కార్తీకి చెల్లించారా? లేదా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇంద్రాణీ–పీటర్ ముఖర్జీలు ఎవరో తెలియదు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ అధికారులు పి.చిదంబరాన్ని అరెస్ట్ చేశారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం తెలిపారు. చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్న కార్తీ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీలను కలుసుకోలేదు. సీబీఐ విచారణలో భాగంగా ఓసారి బైకుల్లా జైలులో కలిశా. అలాగే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ)లో ఎవ్వరితోనూ నేను భేటీకాలేదు. కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. -
ఇదీ.. చిదంబరం చిట్టా
యూపీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం తన కొడుకు కార్తీ కంపెనీలకు భారీగా లబ్ధి చేకూర్చారని ఆరోపణలున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియాతోపాటు మరి కొన్ని కేసుల్లో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనపై ఉన్న కేసుల వివరాలివీ... ఐఎన్ఎక్స్: విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా! స్టార్ టీవీ ఇండియాకు సీఈఓగా దాదాపు పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత బయటకు వచ్చేసిన పీటర్ ముఖర్జియా సంస్థ పేరే ఐఎన్ఎక్స్ మీడియా. ఈయన తన భార్య ఇంద్రాణి ముఖర్జీతో కలిసి 2007లో ఐఎన్ఎక్స్ మీడియాను ఆరంభించారు. దాన్లో ఇంద్రాణి సీఈఓగా ఉండగా... పీటర్ ముఖర్జియా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా చేరారు. ఈ సంస్థలోకి విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిన రూ.305 కోట్లకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) పచ్చజెండా ఊపింది. ఈ ఎఫ్ఐపీబీ అనుమతుల విషయంలో అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న పి.చిదంబరం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన అభియోగం. అంతేకాక విదేశీ పెట్టుబడుల రూపంలో ఐఎన్‌ఎక్స్‌లోకి వచ్చిన డబ్బులు వేరెవరివో కావని, చిదంబరం తనయుడు కార్తీకి చెందిన వివిధ కంపెనీలు ఈ పెట్టుబడుల్ని ఇండియాకు తరలించడానికి ఐఎన్ఎక్స్ మార్గాన్ని ఎంచుకున్నాయని, ఇది స్పష్టమైన మనీ లాండరింగ్ వ్యవహారమని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలు ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా మారిపోయారు. ఈ కేసులో తమను ఇరికించకుండా చూడడానికి వారు కార్తీకి 10 లక్షలు లంచం కూడా ఇచ్చారని సీబీఐ చెబుతోంది. ఎయిర్‌సెల్– మాక్సిస్: అక్రమ అనుమతులు! ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసు 2011వ సంవత్సరం మేలో వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌సెల్ సంస్థ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ తన సంస్థలోని 74 శాతం వాటాలను 2006లో మలేసియా కంపెనీ మాక్సిస్‌కు విక్రయించారు. అప్పటి కేంద్ర టెలికం మంత్రి దయానిధి మారన్ బలవంతంగా తనతో ఈ పని చేయించారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ఆరంభించగా... ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. రూ.3,500 కోట్ల విలువ చేసే పెట్టుబడులను మాక్సిస్ సంస్థ ఎయిర్‌సెల్‌లో పెట్టిన సమయంలో ఆర్థిక మంత్రిగా చిదంబరమే ఉన్నారు. వాస్తవానికి ఈ స్థాయి విదేశీ పెట్టుబడులకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం నిబంధనల్ని తోసిరాజని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ద్వారా అనుమతులు మంజూరు చేశారని అభియోగాలున్నాయి. నిజానికి ఎఫ్ఐపీబీకి రూ.600 కోట్ల వరకు విలువున్న పెట్టుబడులకు మాత్రమే అనుమతినిచ్చే అధికారం ఉంది. ఈ ఒప్పందం కుదరడానికి చిదంబరం కుమారుడు కార్తీకి భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. 20 సార్లు చిదంబరానికి ఊరట ఐఎన్ఎక్స్, ఎయిర్‌సెల్, మాక్సిస్ కేసుల్లో ఇప్పటికే పలు దఫాలు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ చిదంబరాన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాయి. చిదంబరం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేసుకొని అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఈ ముందస్తు బెయిల్‌కు సంబంధించిన గడువుల్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. అలా మొత్తంగా 20 సార్లు చిదంబరానికి ఊరట లభించింది. ఇప్పటికే ఈడీ చిదంబరాన్ని గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో రెండు సార్లు ప్రశ్నించింది కూడా. బెయిల్‌పై ఉన్న కార్తీ ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం కుమారుడు కార్తీని గత ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేసింది. 23 రోజుల పాటు జైల్లో ఉన్న కార్తీ మార్చిలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి భారత్, యూకే, స్పెయిన్ దేశాల్లో కార్తీ చిదంబరానికి చెందిన రూ.54 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. పెండింగ్‌లో మరిన్ని కేసులు ► ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.1,272 కోట్ల విలువైన అవినీతి జరిగినట్టు కూడా చిదంబరంపై కేసు ఉంది. దీనిపై విచారణకు హాజరు కావాలని ఇటీవలే ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ► రూ.5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ ్చంజ్ వ్యవహారంలో చిదంబరం తీసుకున్న నిర్ణయాల వల్లే తమ సంస్థ భారీగా దెబ్బతిన్నదని ‘63 మూన్స్ టెక్నాలజీస్’సంస్థ (గతంలో దీనిపేరు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్) ఫిర్యాదు చేసింది. ► ఇక శారదా చిట్‌ఫండ్ కేసులో చిదంబరం భార్య నళిని ప్రమేయం ఉన్నట్టుగా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో 1.4 కోట్ల రూపాయల ముడుపులు నళినికి అందినట్టుగా ఆరోపణలున్నాయి. ► బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్, 2015 కింద చిదంబరం, ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ, కోడలు శ్రీనిధిని విచారించాలంటూ ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఆదేశాలను గత ఏడాది మద్రాస్ హైకోర్టు కొట్టివేసినప్పటికీ, సుప్రీం కోర్టులో ఇంకా ఇది పెండింగ్‌లో ఉంది. ► చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పడు ఇష్రాత్ జహాన్ కేసులో అఫిడవిట్‌ను తారుమారు చేసినట్టుగా ఆరోపణలున్న కేసు ఢిల్లీ పోలీసుల వద్ద పెండింగ్‌లో ఉంది. దాక్కోలేదు.. నిందితుడిని కాను న్యూఢిల్లీ: బుధవారం రాత్రి అరెస్టవ్వడానికి కొద్దిసేపటి ముందు చిదంబరం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. అక్కడ చిదంబరం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. ‘ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేను కనీసం నిందితుడిని కూడా కాను. చట్టం నుంచి దాక్కోలేదు. చట్టపరంగా రక్షణ కోరుతున్నాను. నేను చట్టం నుంచి దాక్కుంటున్నానని అంటుండటం చూసి విస్మయం చెందాను. న్యాయం కోసం పోరాడుతున్నాను. ఐఎన్ఎక్స్ కేసులో నేను కానీ, నా కుటుంబీకులు కానీ, లేదా మరెవ్వరూ నిందితులు కాదు. ఈ కేసులో సీబీఐ, ఈడీలు అభియోగపత్రం కూడా దాఖలు చేయలేదు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలాల్లోనూ నేను తప్పు చేసినట్లు ఎక్కడా లేదు. అయినా నేను, నా కొడుకు ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు చెప్పడమనే రోగం ఉన్నవారు వ్యాప్తి చేస్తున్న అసత్యాలే ఇవన్నీ. నిజాన్ని దాటి ఏదీ ముందుకు వెళ్లలేదు. సీబీఐ, ఈడీలు నన్ను విచారించడం కోసం నోటీసులు ఇచ్చాయి. ముందుజాగ్రత్తగా అరెస్టు నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లి తాత్కాలిక రక్షణ కోరాను. నాకు దాదాపుగా గత 15 నెలలపాటు ఆ రక్షణ లభించింది. నేను ఎక్కడా దాక్కోలేదు. నిన్న రాత్రంతా నేను నా లాయర్లతో కలిసి కూర్చొని కోర్టులో సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నా. ఈ రోజు ఉదయానికే పని ముగిసింది. నా కేసును సుప్రీంకోర్టు శుక్రవారమే విచారిస్తుందని తెలిసింది. నేను న్యాయస్థానం ఆదేశాలకు తలవంచుతున్నాను. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేయకపోయినా సరే, నేను చట్టాన్ని గౌరవిస్తాను’అని మీడియాతో అన్నారు. కక్షగట్టారు: కాంగ్రెస్ చిదంబరానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే ఆయనపై కక్షగట్టి కేంద్రం వేధిస్తోందని వారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థ లను, ఓ వర్గం మీడియాను ఉపయోగించి చిదంబరం వ్యక్తిత్వాన్ని హతమార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహు ల్ గాంధీ ఆరోపించారు. చిదంబరాన్ని కేంద్రం వేటాడుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఓ ట్వీట్ చేస్తూ ఏది ఏమైనా తాము చిదంబరానికి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపింది. ‘అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా నిజం మాట్లాడే పౌరులను పీడించడం ద్వారా ప్రభుత్వం తన పిరికితనాన్ని మళ్లీ మళ్లీ బయటపెట్టుకుంటోంది. చిదంబరం ఎన్నో అర్హతలున్న, గౌరవనీయ నాయకుడు. అంకితభావం, వినయంతో ఆయన ఈ దేశానికి సేవ చేశారు. సత్యాన్వేషణలో మేం ఆయనకు మద్దతుగా ఉంటాం. ఏది ఏమైనా సరే’అని కాంగ్రెస్ ట్విట్టర్లో పేర్కొంది. పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, ఇతర సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ, శశి థరూర్ తదితరులు చిదంబరానికి మద్దతుగా మాట్లాడా రు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులపై ఎన్ని ఆరోపణలున్నా వారంతా పదవులు అనుభవిస్తున్నారని వారు ఆరోపించారు. తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు: బీజేపీ చిదంబరంపై కేసు విషయంలో కాంగ్రెస్ చేసిన కక్షసాధింపు వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. విచారణలో తాము జోక్యం చేసుకోవడంలేదనీ, చిదంబరం తాను చేసిన పనుల వల్లే ఈ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది. ‘ఆయన (చిదంబరం) ఏదైనా తప్పు చేసి ఉంటే, తప్పకుండా ఆయన ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాదేశాలతో పనిచేయవు. స్వతంత్రంగా పనిచేసే అధికారాలు వాటికి ఉన్నాయి’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. అరెస్ట్‌కు ముందు ఏఐసీసీ కార్యాలయంలో చిదంబరం చిదంబరం ఇంట్లోకి వస్తున్న సీబీఐ అధికారుల కారును అడ్డుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు -
‘అతడు ఓ సైలెంట్ కిల్లర్; అప్పుడు తనేం చేశాడు మరి?’
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మాజీ మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియా సైలెంట్ కిల్లర్‌లా వ్యవహరించారని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. సవతి కూతురును దారుణంగా హత్య చేయించారనే ఆరోపణలతో 2015లో పీటర్ అరెస్టైన సంగతి తెలిసిందే. షీనా తల్లి, పీటర్ రెండో భార్య ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన నిందితురాలిగా ఉన్న ఈ కేసులో తనకు బెయిలు కావాలంటూ పీటర్ మరోసారి అప్పీలు చేశారు. ఈ క్రమంలో షీనా బోరా హత్యకేసు శుక్రవారం మరోసారి సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది.(వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..) ఈ నేపథ్యంలో పీటర్‌కు బెయిలు నిరాకరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ భరత్ బదామీ కోర్టుకు విఙ్ఞప్తి చేశారు. ఈ కేసులో పీటర్ ముద్దాయి అని నిరూపించడానికి సీబీఐ వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నాయని విన్నవించారు. షీనా హత్య జరిగినపుడు తన క్లైంట్ లండన్‌లో ఉన్నారని పీటర్ న్యాయవాది పేర్కొనగా.. ఇందుకు ప్రతిగా భరత్ వాదిస్తూ 26/11 ముంబై పేలుళ్ల కేసును ప్రస్తావించారు. ‘లష్కర్ ఏ తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ అతడికి ఈ పేలుళ్ల కేసుతో సంబంధం లేదని చెప్పలేం. అలాగే పీటర్ లండన్‌లో ఉన్నప్పటికీ అతడు షీనా కేసులో నిందితుడు కాకుండా పోడు’ అని వాదించారు. ‘ పీటర్‌కు అన్నీ తెలుసు. తన కొడుకు రాహుల్ షీనా గురించి ఆరా తీసినపుడే మందలించి ఉండాల్సింది. పీటర్ ఓ సైలెంట్ కిల్లర్. కొడుకును మార్చకుండా అతడు ఏం చేశాడు మరి’ అని భరత్ తన వాదనలు వినిపించారు. దీంతో ఆయన బెయిలు అప్పీలు మరోసారి తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది.(‘ఆ రెండు రోజులు ఎవరినీ ఫ్లాట్‌లోకి రానివ్వలేదు’) షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నందుకే షీనాను హత్య చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. -
‘ఆ రెండు రోజులు ఎవరినీ ఫ్లాట్‌లోకి రానివ్వలేదు’
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు విచారణలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. షీనా తల్లి, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ కలిసి ఉద్దేశపూర్వకంగానే షీనా బోరాను హత్యచేసినట్లు ఇటీవలే కీలక సాక్షి సీబీఐ కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్.. వర్లీ ఏరియాలోని మార్లో బిల్డింగ్(ఇంద్రాణీ- పీటర్ల నివాసం) మేనేజర్ మధుకర్ ఖిల్జీని విచారించారు. ఈ క్రమంలో... షీనా బోరా హత్య జరిగిన నాటి నుంచి(ఏప్రిల్ 24, 2012) రెండు రోజుల పాటు (ఏప్రిల్ 24-26) రెండు రోజుల పాటు ఇంద్రాణీ తన ఫ్లాట్‌లోకి ఎవరినీ రానివ్వలేదని మధుకర్ పేర్కొన్నాడు. షీనాతో పాటుగా ఆమె సోదరుడు మైఖేల్ బోరాను కూడా హత్య చేసేందుకు ఇంద్రాణీ ప్రణాళిక రచించారని తెలిపాడు. ’ షీనా తన చెల్లెలని ఇంద్రాణీ చెప్పారు. ఏప్రిల్ 23 న నన్ను పిలిచి తన అనుమతి లేకుండా ఎవరినీ ఫ్లాట్ దగ్గరికి కూడా రానివ్వొద్దని చెప్పారు. ముఖ్యంగా పీటర్ కొడుకు రాహుల్ ముఖర్జీ(ఇంద్రాణీ సవతి కొడుకు)ని అస్సలు అనుమతించొద్దన్నారు. అందుకే రాహుల్ మార్లోకు వచ్చినప్పుడు మేము అడ్డుకున్నాం’ అని మధుకర్ కోర్టుకు తెలిపాడు. కాగా ఇప్పటికే ఈ కేసులో మధుకర్‌తో కలిసి 28 సాక్షులను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలు, షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న ఇంద్రాణీ ప్రస్తుతం బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు సీబీఐ కోర్టులో బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా 27వ సాక్షిని ప్రాసిక్యూషన్ లాయర్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా... షీనా తల్లి, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ కలిసి ఉద్దేశపూర్వకంగానే షీనా బోరాను హత్యచేసినట్లు సదరు సాక్షి పేర్కొన్నారు. ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న ఇంద్రాణి స్నేహితుడు, ఆమె వద్ద పనిచేసే ఉద్యోగి అయిన ప్రితుల్ సంఘ్వీ విచారణలో భాగంగా పలు విషయాలు కోర్టుకు వెల్లడించారు.‘ 2002 నుంచి నాకు ఇంద్రాణి పరిచయం. నా ఇంట్లో తను అద్దెకు ఉండేది. ఆ తర్వాత ఆమె కంపెనీలో మేనేజర్‌గా జాయిన్ అయ్యాను. ఇంద్రాణి, ఆమె భర్త పీటర్ ముఖర్జీ ఇచ్చే పార్టీలకు తరచుగా హాజరయ్యేవాడిని. ఆ సమయంలో షీనా కూడా ఒకటి రెండుసార్లు అక్కడికి వచ్చింది. ఇంద్రాణి.. షీనాను తన చెల్లిగా మా అందరికీ పరిచయం చేసింది. అయితే పీటర్ కొడుకు రాహుల్‌తో షీనా రిలేషన్షిప్లో ఉండటం ఆ దంపతులిద్దరికీ నచ్చలేదు. 2008 నుంచి వాళ్లను విడదీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ కుదరకపోవడంతో ఓరోజు.. వాళ్లిద్దరు ఉండే ఏరియాకు నన్ను కూడా రమ్మన్నారు. అయితే నాకు ఆరోజు వేరే పని ఉండటంతో రాలేనని చెప్పాను. ఆ తర్వాత ఇంద్రాణి.. షీనాను తనతో పాటు తీసుకువెళ్లగా, రాహుల్‌ని.. పీటర్ తీసుకువెళ్లాడు. ఇంతలోనే షీనా కనిపించడం లేదనే వార్త బయటికి వచ్చింది’ అని ప్రితుల్ సింగ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షీనాను హత్య చేయడం వెనుక ఇంద్రాణికి ఉన్న ఉద్దేశమేమిటో నిరూపించేందుకు సీబీఐకి బలమైన సాక్ష్యం లభించినట్లైంది. (విడిపోనున్న ఇంద్రాణి దంపతులు) ఇంద్రాణి- పీటర్ ముఖర్జీ షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
విడిపోనున్న ఇంద్రాణి దంపతులు
సాక్షి, ముంబై : షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం ముంబైలోని ఫ్యామిలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్న ముఖర్జియా దంపతులు.. ఆస్తుల పంపకానికి సంబంధించిన విషయాలను కూడా పిటిషన్లో పొందుపరిచారు. బ్యాంకు అకౌంట్లతో సహా.. ఇప్పటివరకు సంయుక్తంగా లావాదేవీలు జరిపిన బ్యాంకు అకౌంట్లను ఇకపై వ్యక్తిగత అకౌంట్లుగా మార్పు చేసుకునేందుకు ఇరువురు అంగీకరించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఇద్దరి పేరిట సిండికేట్ బ్యాంకులో ఉన్న 53 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు, అంతర్జాతీయ బ్యాంకుల్లో కలిగి ఉన్న అకౌంట్లు, విదేశాల్లో ఉన్న బంగ్లాలు, విలువైన నగలు, ఖరీదైన వాచ్‌లు, బ్యాంకు లాకర్లను సమంగా పంచుకునేందుకు తామిద్దరికీ సమ్మతమేనని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా 16 ఏళ్ల క్రితం ఇంద్రాణి, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. వైవాహిక జీవితంలో ఆటుపోట్ల వల్లనే.. దక్షిణ ముంబైలో ఓ ఫైవ్ స్టార్ హోటర్‌లో ఇంద్రాణి, పీటర్ల ప్రేమ చిగురించింది. 2002లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లైన కొన్ని ఏళ్లలోనే వీరి వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. పీటర్ కొడుకు రాహుల్‌తో.. ఇంద్రాణి కూతురు(మొదటి భర్త ద్వారా జన్మించింది) షీనా బోరా సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత ఆమెను 2012లో చంపేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 2015 ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
విడాకులు కోరుతున్న ఇంద్రాణి
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు అయిన ఇంద్రాణి ముఖర్జియా తన పెళ్లి జీవితానికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నారు. విడాకులు కోరుతూ తన భర్త పీటర్ ముఖర్జియాకు నోటీసులు పంపించారు. ఈ కేసులో సహ నిందితుడు పీటర్ నుంచి పరస్పర అంగీకారం ద్వారా విడాకులు కోరుతున్నట్టు లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు చేసుకోలేదు. ఏప్రిల్ 25న ఈ నోటీసులు పంపినట్టు తెలిసింది. తమిద్దరి వివాహ బంధం సయోధ్యగా ఉండేందుకు ఎలాంటి అవకాశం లేదని, విడాకుల అనంతరం ఒకరి జీవితంలోకి మరొకరం ఎలాంటి జోక్యం చేసుకోమని ఇంద్రాణి చెప్పారు. కాగా, పీటర్ ముఖర్జియా ఇంద్రాణికి రెండో భర్త. ఇంద్రాణికి అంతకముందు సంబంధం ద్వారా జన్మించిన కూతురు షీనా బోరా. ఇంద్రాణి, తన ప్రస్తుత భర్త పీటర్‌తో కలిసి అత్యంత పాశవికంగా తన చేతులతోనే గొంతుపిసికి చంపేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. పీటర్ కొడుకు రాహుల్‌తో షీనా బోరా సంబంధం పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోవడంతో ఆ ఘాతుకానికి పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి. దక్షిణ ముంబైలో ఓ ఫైవ్ స్టార్ హోటర్‌లో ఇంద్రాణి, పీటర్ల ప్రేమ చిగురించింది. 2002లో వీరిద్దరికి పెళ్లి జరిగింది. పెళ్లైన కొన్ని ఏళ్లలోనే వీరి వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. పీటర్ కొడుకు రాహుల్‌తో షీనా బోరా సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత ఆమెను 2012లో చంపేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 2015 ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంద్రాణి అరెస్ట్ తర్వాత పీటర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే షీనాను చెల్లిగా తనకు ఇంద్రాణి పరిచయం చేసిటనట్టు పీటర్ చెప్పారు. అసలు విషయం తాను గుర్తించలేకపోయినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంద్రాణి, పీటర్ అసలు మాట్లాడుకోవడం లేదని తెలిసింది. పీటర్ మొదటి భార్యకు ఇద్దరు కొడుకులున్నారు. ఇంద్రాణి, పీటర్ ప్రస్తుతం బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ముంబై, గోవా, ఇంగ్లాండ్‌లో వీరు ఆస్తులు కొన్నట్టు తెలుస్తోంది. -
ఇంద్రాణి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. ఐఎన్ఎక్స్ మీడియా ఆదాయపు పన్ను ఎగవేత, ఇతరత్రా ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం ఇంద్రాణి జ్యుడీషియల్ కస్టడీని 2 వారాలు పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ ఫిబ్రవరి 5న ప్రత్యేక న్యాయస్థానం ఇంద్రాణిని అరెస్ట్ చేయాని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే షీనాబోరా హత్యకేసులో నిందితురాలైన ఇంద్రాణి ఇదివరకే అరెస్టయి ముంబైలోని బైకుల్లా జైల్లో కస్టడీలో ఉంది. ఐఎన్ఎక్స్ మీడియా ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) నియమాలను ఉల్లంఘించి మారిషస్ నుంచి పెట్టుబడులు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి.మనీ లాండరింగ్ విషయంలో ఐఎన్ఎక్స్ మీడియా అధిపతి పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణిపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. కాగా, 2012 ఏప్రిల్ 23న జరిగిన షీనా బోరా హత్యకు గురికాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్ గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పిన విషయం తెలిసిందే.షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్ ముఖర్జియా పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
'పూడ్చి పెట్టకముందు.. పెట్టిన తర్వాత ఫోన్ చేసింది'
సాక్షి, ముంబయి : దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా పాత్ర ఉన్నట్లు మరోసారి తేటతెల్లమైంది. స్వయంగా పీటర్ ముఖర్జియానే షీనా హత్యకు ప్లాన్ చేయించారా అనే కోణంలో కూడా కేసు మలుపు తిరగనుంది. ఎందుకంటే ఆ రోజు హత్య చేసిన తర్వాత షీనాను పూడ్చి పెట్టిన ప్రాంతం నుంచి పీటర్‌కు ఇంద్రాణి ఫోన్ చేసినట్లు ఆమె డ్రైవర్ ఈ కేసులో అప్రూవర్ అయిన శ్యామ్వర్ రాయ్ చెప్పాడు. దీంతో పీటర్‌కు తెలిసే ఈ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. 2012 ఏప్రిల్ 23న షీనా బోరా హత్య జరిగిన విషయం తెలిసిందే. ఇంద్రాణి తన మాజీ భర్త, డ్రైవర్ శ్యామ్వర్రాయ్తో కలిసి కన్న కూతురునే కడతేర్చింది. ఈ హత్య ఘటన దేశంలో సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన సాక్షి శ్యామ్వర్ రాయ్ అప్రూవర్‌గా మారి ప్రస్తుతం సీబీఐకు సహకరిస్తున్నాడు. అయితే, పీటర్ తరపు న్యాయవాది ప్రస్తుతం శ్యామ్వర్ రాయ్ వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ఆయనకు శ్యామ్ ఈ విషయాలు వెల్లడించాడు. ఆ రోజు ఇంద్రాణి రెండుసార్లు పీటర్‌కు ఫోన్ చేశారని, హత్య చేసిన తర్వాత పూడ్చిపెట్టేందుకు వెళ్లే సమయంలో ఓసారి, పూడ్చిపెట్టిన తర్వాత మరోసారి రెండుసార్లు ఫోన్ చేసినట్లు తెలిపాడు. తనకు కూడా పనిబాగా పూర్తి చేశావంటూ కితాబిచ్చారని వెల్లడించాడు. -
త్వరలో షీనా బోరాపై సినిమా విడుదల!
ముంబై: షీనాబోరా హత్య ఆధారంగా నిర్మిస్తున్న బెంగాలీ చిత్రం 'డార్క్ చాక్లెట్' విడుదలపై బొంబాయి హైకోర్టు స్టేను తిరస్కరించింది. ఈ చిత్రానికి సంబంధించి కోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్లపై కోర్టుకు నమ్మకం ఉందని.. ఈ చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలలించిన మీదటే విడుదలకు సర్టిఫిట్ ను ఇస్తారని అంది. త్వరలో రానున్న చిత్ర విడుదలను సవాలు చేస్తూ షీనా పిన తండ్రి పీటర్ ముఖర్జీయా వేసిన పిటీషన్‌ను డివిజన్ బెంచ్ సిట్టింగ్ జడ్జీ ఎస్సీ ధర్మధికారీ గురువారం విచారించారు. ఈ సినిమా విడుదలయితే తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని పీటర్ కోర్టుకు తెలిపారు. సినిమాను విడుదల చేయడానికంటే ముందే తనను వీక్షించేందుకు అనుమతించాలని, ఆమేరకు వారికి ఆదేశించాలని కోర్టును కోరారు. సినిమా ఇంకా పూర్తి కాలేదని నిర్మాణానంతరం సీబీఎఫ్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఏవైనా అనుమానాలు ఉంటే మరలా కోర్టుకు రావొచ్చని ధర్మాసనం తెలిపింది. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ప్రజావాణీలో ఈ కేసు గురించి వినిపించిన కథనే తాము తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. చిత్ర దర్శకుడు అగ్నిదేవ్ ఛటర్జీ, నిర్మాతలు మాట్లాడుతూ న్యాయస్థానాలపై వారికి పూర్తి నమ్మకం ఉందని అన్నారు. త్వరలో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసి సెన్సార్ బోర్డుకు పంపుతామని చెప్పారు. ఈ చిత్రంలో మహిమా చౌదరి, రియా సేన్లు ఇంద్రాణీ ముఖర్జీయా, షీనాబోరా పాత్రల్లో కనిపించనున్నారు. -
'భార్య కుటిలత్వానికి బాధితుడిని'
ముంబై: షీనాబోరా హత్యకేసులో పీటర్ ముఖర్జియాకు విధించిన సీబీఐ కస్టడీని ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ముంబై కోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. షీనాబోరాను చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియా భర్త అయిన పీటర్ ను రెండురోజుల కస్టడీ నిమిత్తం ఢిల్లీకి తరలించి.. తమ కార్యాలయంలో ప్రశ్నించిన సీబీఐ.. అతన్ని గురువారం ముంబైకి తీసుకొచ్చింది. కస్టడీ గడువు ముగియడంతో ముంబై కోర్టులో ప్రవేశపెట్టింది. ఈసందర్భంగా పీటర్ తరఫు న్యాయవాది మిహిర్ ఘీవాలా వాదనలు వినిపిస్తూ తన భార్య ఇంద్రాణి కుటిల పద్ధతులకు తాను బాధితుడినయ్యానని పీటర్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారని కోర్టుకు తెలిపారు. షీనాబోరా హత్యకు కారణం రాహుల్-షీనా అనుబంధం పట్ల ఇంద్రాణికి ఉన్న భయాలే కారణమని సీబీఐ చార్జ్ షీట్ లో పేర్కొందని, అలాంటప్పుడు పీటర్ ఖాతా వివరాలు తెలుసుకునేందుకు ఆయనను సీబీఐ కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే, సీబీఐ మాత్రం పీటర్ కస్టడీ పొడిగించాలని కోర్టును అభ్యర్థించింది. పీటర్ కంపెనీ నుంచి షీనాకు పెద్ద మొత్తం డబ్బు తరలిందని, ఈ డబ్బును ఎందుకు మళ్లించారు? దీని వెనుక కారణాలేమిటి తదితర వివరాలు పత్రాలతో సహా రాబట్టేందుకు పీటర్ కస్టడీ అవసరమని సీబీఐ పేర్కొంది. -
ఆ హత్య పీటర్‌కు ముందే తెలుసా?
ముంబయి: షీనా బోరా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. తన తండ్రికి షీనా బోరా హత్యకు ఏ సంబంధం లేదని, ఆయన అమాయకుడని పీటర్ ముఖర్జియా తనయుడు రాహుల్ ముఖర్జియా చెప్పిన మరుసటి రోజే సీబీఐ వెల్లడించిన కొన్ని విషయాలు పీటర్‌కు షీనా హత్యకు ఏవో సబంధాలున్నాయని పరోక్షంగా చెబుతున్నాయి. షీనా చనిపోయిందన్న విషయం పీటర్ ముఖర్జియాకు ముందే తెలుసని సీబీఐ వర్గాలు పరోక్షంగా చెబుతున్నాయి. అందుకే కావాలని పోలీసు అధికారి దేవెన్ భారతీని కలిశారని, కనిపించకుండా పోయినా షీనా ఫోన్ కాల్ డేటా తమకు ఇవ్వాలని, ఆమె ఎక్కడ ఉందో గుర్తించాలని ఆయనను కోరినట్లు సీబీఐ అధికారులు దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ హత్యను ఒక మిస్సింగ్ కేసుగా మార్చే ప్రయత్నం ఇంద్రాణి, పీటర్ చేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో గత ఆగస్టులోనే షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు అరెస్టు చేయగా పీటర్ ను గత వారం అరెస్టు చేశారు. సీబీఐ వర్గాలు విశ్వసిస్తున్న ప్రకారం షీనా చనిపోయిన విషయం ముందే తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదుచేసేందుకు ప్రయత్నించిన రాహుల్ ముఖర్జియాను కూడా తప్పుదోవపట్టించాడని తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఇంద్రాణి, పీటర్ సంప్రదించిన పోలీసులు అధికారి భారతీని ఈ కేసులో ఆధారంగా చేర్చారు. -
ఆ హత్య పీటర్‌కు ముందే తెలుసా?
-
కూతుర్ని చంపిన తల్లి!
-
కూతుర్ని చంపిన తల్లి!
షీనా బోరా హత్య కేసులో మలుపుల మీద మలుపులు కూతురిని సోదరిగా భర్తకు పరిచయం చేసిన భార్య ♦ సవతి సోదరుడితో డేట్ చేసిన షీనా! ♦ గొంతునులిమి.. సజీవ దహనం.. హత్య చేసినట్లు ఒప్పుకున్న డ్రైవర్ ముంబై: భర్తను పదిహేనేళ్లుగా బురిడీ కొట్టించిన భార్య.. కూతుర్ని సోదరిగా పరిచయం చేసిన భార్య.. ఆ కూతురితో డేట్ చేసిన సవతి కొడుకు.. ఆ కూతుర్ని హత్య చేసిన కన్న తల్లి.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. నమ్మరాని బాంధవ్యాలు.. విస్మయం కలిగించే నిజాలు.. దేశంలోని ఓ సంపన్న కుటుంబంలో జరిగిన ఒకానొక హత్యకేసు తవ్వుతున్న కొద్దీ చిత్రవిచిత్రంగా మలుపులు తిరుగుతోంది. 2012లో హత్యకు గురైన షీనా బోరా కేసులో టీవీ మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణిని అరెస్టు చేయటంతో ఊహకందని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పీటర్ స్టార్ ఇండియా 2002లో స్టార్ ఇండియా సీఈఓగా ఉన్నప్పుడు ఇంద్రాణిని పెళ్లాడాడు. అంతకుముందే ఇద్దరికీ జరిగిన వివాహాలకు విడాకులూ అయ్యాయి. అయితే సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నాలతో తనకు జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని ఇంద్రాణి పీటర్ దగ్గర దాచింది. చనిపోయిన షీనా సిద్ధార్థ కూతురని సమాచారం. రెండు రోజుల క్రితం ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేసేంతవరకూ ఈ విషయం పీటర్‌కు తెలియదు. ఈ నమ్మలేని అనుబంధాల కథ పీటర్ మాటల్లోనే.. ‘కలలో కూడా ఊహించని ఘటన ఇది. అదీ నా భార్య విషయంలో నాకెదురవుతుందనుకోలేదు. ఇన్నేళ్లుగా షీనాను నా భార్య ఇంద్రాణి సోదరిగానే నమ్ముతూ వచ్చాను. ఇప్పుడు షీనా.. ఇంద్రాణి కూతురని పోలీసులు చెప్పారు. అంతేకాదు. ఇంద్రాణి సోదరుడిగా నాకింతకాలం పరిచయంలో ఉన్న మిఖైల్ ఆమెకు అంతకుముందు జరిగిన పెళ్లి ద్వారా కలిగిన బిడ్డని తెలిసి షాక్‌కు గురయ్యాను. షీనాను ఎప్పుడూ తన సోదరిగానే ఇంద్రాణి చెప్తూ వచ్చింది. షీనా అలాగే వ్యవహరించింది. నా కొడుకు రాహుల్ ముఖర్జియా షీనాతో డేట్ చేశాడు. ఒక సందర్భంలో అతడు షీనా ఇంద్రాణి కూతురని బయటపెట్టినా నేను నమ్మలేదు. తప్పని వాదించాను. ఇంద్రాణిని అడిగాను. ఆమె తన ముందు వైఖరినే మళ్లీ చెప్పింది. ఆమెనే నమ్ముతూ వచ్చాను. మూడేళ్లుగా నా కొడుకుతో మాట్లాడటం మానేశాను. 2012 నుంచి షీనా అదృశ్యమైనా ఆ సంగతి నాకు తెలియదు. ఒకసారి నేను ఇంద్రాణిని అడిగితే ఆమె అమెరికాకు వెళ్లినట్లుగా నమ్మించింది. షీనా లాస్ఏంజెలిస్ ఉన్న కొన్ని ఫోటోలను ఇంద్రాణి నాకు చూపించింది. నా కొడుకు అనుమానం వ్యక్తం చేశాడు’’ రాయ్‌గఢ్ అడవుల్లో షీనా హత్య షీనాబోరాను రాయ్‌గఢ్ జిల్లాలోని అడవుల్లో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 2012 ఏప్రిల్ 24న షీనాను గొంతు నులిమి హత్య చేసి, ఆ తర్వాత అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి పెట్రోల్ పోసి దహనం చేశారని ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా తెలిపారు. మే 23న పోలీసులకు మృతదేహం దొరికిందని, అయితే గుర్తు తెలియని మృతదేహం కావటంతో.. డీఎన్ఏ శాంపిల్స్ సేకరించకుండానే దానికి అంత్యక్రియలు నిర్వహించారని మారియా వివరించారు. విచారణ సందర్భంలో షీనాను ఇంద్రాణి హత్య చేసినట్లు, మృతదేహాన్ని అడవుల్లో కాల్చేందుకు తాను సహకరించినట్లు ఇంద్రాణి డ్రైవర్ ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ హత్య కేసులో ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ ఖన్నా నిందితుడన్నారు. ఖన్నాను కోల్‌కతాలోని అతని స్నేహితుడి ఫ్లాట్‌లో అరెస్టు చేసి ముంబైకి తీసుకువచ్చారు. అయితే హత్యకు నిజమైన కారణాలేమిటన్నది ఇంకా తేలాల్సి ఉందన్నారు. మరోవైపు ఇంద్రాణిని బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం హాజరుపరిచారు. ఆమె పోలీస్ కస్టడీని న్యాయమూర్తి ఈ నెల 31 వరకు పొడిగించారు. -
షీనా బోరా ఆమె సోదరి కాదు.. కూతురు
ముంబయి: ఆస్తి వివాదంలో హత్యకు పాల్పడి అరెస్టయిన ఇంద్రాని ముఖర్జియా కేసు కీలక మలుపు తిరిగింది. హత్యకు గురైన షీనా బోరా ఆమె సోదరి కాదని ఆమె సొంత కూతురని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయం తెలిసి ఆమె భర్త స్టార్ ఇండియా మాజీ చీఫ్ పీటర్ ముఖర్జియా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. గత రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ కేసు విషయంలో కారు డ్రైవర్ సమాచారం మేరకు ఇంద్రాని అరెస్టు చేసిన పోలీసులు తొలుత షీనా బోరా సోదరి అని పొరపడ్డారు. కానీ కొన్ని గంటల విచారణ అనంతరం షీనా ఇంద్రాని కూతురు అని తేలింది. ఫొరెన్సిక్ ల్యాబ్ నివేదిక కూడా రావాల్సి ఉంది. కూతురు షీనా బోరా విషయంలో ప్రశ్నించగా ఆమె కనిపించడంలేదని, కనిపించకుండా పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా పోలీసులకు ఇవ్వకపోవడంతో వారి అనుమానం మరింత బలపడింది. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
స్టార్ ఇండియా మాజీ చీఫ్ భార్య అరెస్టు
ముంబయి: స్టార్ ఇండియా మాజీ చీఫ్ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాని ముఖర్జిని రాయగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై ఓ హత్య కేసు విషయంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తి ఆమె సొంత సోదరి హత్యకు కుట్ర చేశారని, అందుకు ఆమె కారు డ్రైవర్ కూడా సహకరించాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2012లో ఇంద్రాని సోదరి షీనా బోరా హత్యకు గురైంది. ఆమె దేహం కుళ్లిపోయిన స్థితిలో ఓ అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన ఇంద్రాని కారు డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా ఇంద్రానినే ఆమె సోదరిని హత్య చేశారని, మృతదేహాన్ని తరలించేందుకు తాను సహకరించానని తెలిపినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో ఇంతకంటే వివరాలు పోలీసులు చెప్పలేమన్నారు. ఇంద్రానిని అరెస్టు చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించగా ఈ నెల 31 వరకు రిమాండ్ విధించారు. కారు డ్రైవర్‌ను కూడా అరెస్టు చేశారు.