స్టార్ ఇండియా మాజీ చీఫ్ భార్య అరెస్టు | Ex-Star India Chief's Wife Indrani Mukherjea Arrested in Murder Case: Sources | Sakshi
Sakshi News home page

స్టార్ ఇండియా మాజీ చీఫ్ భార్య అరెస్టు

Published Wed, Aug 26 2015 8:12 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

స్టార్ ఇండియా మాజీ చీఫ్ భార్య అరెస్టు - Sakshi

స్టార్ ఇండియా మాజీ చీఫ్ భార్య అరెస్టు

ముంబయి: స్టార్ ఇండియా మాజీ చీఫ్ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాని ముఖర్జిని రాయగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై ఓ హత్య కేసు విషయంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తి ఆమె సొంత సోదరి హత్యకు కుట్ర చేశారని, అందుకు ఆమె కారు డ్రైవర్ కూడా సహకరించాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2012లో ఇంద్రాని సోదరి షీనా బోరా హత్యకు గురైంది. ఆమె దేహం కుళ్లిపోయిన స్థితిలో ఓ అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన ఇంద్రాని కారు డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా ఇంద్రానినే ఆమె సోదరిని హత్య చేశారని, మృతదేహాన్ని తరలించేందుకు తాను సహకరించానని తెలిపినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో ఇంతకంటే వివరాలు పోలీసులు చెప్పలేమన్నారు. ఇంద్రానిని అరెస్టు చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించగా ఈ నెల 31 వరకు రిమాండ్ విధించారు. కారు డ్రైవర్ను కూడా అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement