షీనా కేసు: సంజీవ్కు జ్యుడీషియల్ రిమాండ్
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమె సవతి తండ్రి సంజీవ్ ఖన్నాకు ఈ నెల 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మంగళవారం ముంబై పోలీసులు ఖన్నాను బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
షీనా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి, కారు డ్రైవర్ రాయ్లకు నిన్న జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఇంద్రాణి తన మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి కారు డ్రైవర్ సాయంతో షీనాను హత్య చేసినట్టు విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే.