జైలు నుంచి ఇంద్రాణి విడుదల | Indrani Mukherjea out of jail for a day | Sakshi
Sakshi News home page

జైలు నుంచి ఇంద్రాణి విడుదల

Published Tue, Dec 27 2016 8:14 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

జైలు నుంచి ఇంద్రాణి విడుదల

జైలు నుంచి ఇంద్రాణి విడుదల

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతితో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమెకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఒకరోజు పాటు పోలీసుల పర్యవేక్షణలో ఆమె జైలు బయట గడపనున్నారు.

తన కుమార్తె షీనా బోరా హత్యకేసులో గత ఏడాది ఆగస్టులో ఇంద్రాణి అరెస్టయ్యారు. మాజీ భర్త సంజీవ్‌ ఖన్నాతో కలిసి షీనాను ఇంద్రాణి  హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంద్రాణి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త పీటర్‌ ముఖర్జియా కూడా ఇదే కేసులో జైలుపాలయ్యారు. తన మేనకోడలి పెళ్లి చూసేందుకు బెయిల్‌ ఇవ్వాలని ఆయన ఇటీవల పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement