ఇంద్రాణి, పీటర్ ముఖర్జియా(ఫైల్)
గువాహటి: తన తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు మరణశిక్ష విధించాలని షీనా బోరా సోదరుడు మైఖేల్ కోరుకుంటున్నాడు. తన సోదరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితులకు ఉరి శిక్ష పడాలిని కోరుకుంటున్నట్టు చెప్పాడు. షీనా బోరా హత్య గురించి ఇంద్రాణి రెండో పీటర్ ముఖర్జియాకు అంతా తెలుసునని తాను ముందు నుంచి చెబుతున్నానని గుర్తు చేశాడు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరగదని అన్నాడు. భార్య(ఇంద్రాణి)తో కలిసి జీవిస్తున్న పీటర్ కు ఇందతా తెలియకుండా ఎలా వుంటుందని మైఖేల్ ప్రశ్నించాడు.
పీటర్ పై సీబీఐ మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో అతడు స్పందించాడు. 'నా సోదరి షీనా బోరా హత్యకు సుదీర్ఘమైన కుట్ర జరిగింది. నన్ను చంపేందుకు కూడా ప్రణాళిక వేశారు. నలుగురు నిందితులు ఇంద్రాణి, పీటర్, సంజీవ్ ఖన్నా, శ్యామవర్ రాయ్ లను ఉరి తీయాలి. వీరికి జీవించే హక్కు లేద'ని మైఖేల్ పేర్కొన్నాడు.