Mikhail
-
సాకేత్ సంచలనం
అస్తానా (కజకిస్తాన్): ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని సంచలనం సృష్టించాడు. ప్రపంచ మాజీ ఎనిమిదో ర్యాంకర్ మిఖాయిల్ యూజ్నీ (రష్యా)ని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 357వ ర్యాంకర్ సాకేత్ 3–6, 6–4, 6–3తో టాప్ సీడ్, ప్రపంచ 105వ ర్యాంకర్ యూజ్నీపై గెలిచాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ 14 ఏస్‌లు సంధించడంతోపాటు యూజ్నీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. -
'మైఖెల్ చంపాడు.. నేను అండగా ఉన్నాను'
ముంబయి: తన కుమార్తె షీనాబోరాను తన మాజీ భర్త మైఖెల్ హత్య చేశాడని, ఆ సమయంలో తాను సహాయం మాత్రమే చేశానని ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా భర్త పీటర్ ముఖర్జియాకు తెలిపినట్లు తెలిసింది. దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ఇంద్రాణిని 2015 ఆగస్టులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె నేరాన్ని అంగీకరించలేదు. జైలుకు తీసుకెళ్లిన తర్వాత పీటర్ ఓసారి ఆమెను జైలులో కలిశారు. ఆ సమయంలో తాను ఆ హత్య చేయలేదని, మైఖెలే చేశాడని, మృతేదేహాన్ని కనిపించకుండా చేసేందుకే సహాయపడినట్లు ఆయనతో చెప్పారని పీటర్ సోదరుడు గౌతమ్ ముఖర్జియా తెలిపారు. అనవసరంగా తన సోదరుడు పీటర్‌ను ఈ కేసులో ఇరికించారని, 250 ఆధారాలు ఉన్నా అందులో ఏ ఒక్కటీ పీటర్ పాత్ర ఉందని రుజువు చేయలేకపోతున్నాయని అన్నారు. -
'వాళ్లను ఉరి తీయండి'
గువాహటి: తన తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు మరణశిక్ష విధించాలని షీనా బోరా సోదరుడు మైఖేల్ కోరుకుంటున్నాడు. తన సోదరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితులకు ఉరి శిక్ష పడాలిని కోరుకుంటున్నట్టు చెప్పాడు. షీనా బోరా హత్య గురించి ఇంద్రాణి రెండో పీటర్ ముఖర్జియాకు అంతా తెలుసునని తాను ముందు నుంచి చెబుతున్నానని గుర్తు చేశాడు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరగదని అన్నాడు. భార్య(ఇంద్రాణి)తో కలిసి జీవిస్తున్న పీటర్ కు ఇందతా తెలియకుండా ఎలా వుంటుందని మైఖేల్ ప్రశ్నించాడు. పీటర్ పై సీబీఐ మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో అతడు స్పందించాడు. 'నా సోదరి షీనా బోరా హత్యకు సుదీర్ఘమైన కుట్ర జరిగింది. నన్ను చంపేందుకు కూడా ప్రణాళిక వేశారు. నలుగురు నిందితులు ఇంద్రాణి, పీటర్, సంజీవ్ ఖన్నా, శ్యామవర్ రాయ్ లను ఉరి తీయాలి. వీరికి జీవించే హక్కు లేద'ని మైఖేల్ పేర్కొన్నాడు.