
అస్తానా (కజకిస్తాన్): ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని సంచలనం సృష్టించాడు. ప్రపంచ మాజీ ఎనిమిదో ర్యాంకర్ మిఖాయిల్ యూజ్నీ (రష్యా)ని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో 357వ ర్యాంకర్ సాకేత్ 3–6, 6–4, 6–3తో టాప్ సీడ్, ప్రపంచ 105వ ర్యాంకర్ యూజ్నీపై గెలిచాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ 14 ఏస్‌లు సంధించడంతోపాటు యూజ్నీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment