Yuki Bhambri and Saketh Myneni Pair Lose in Hall of Fame Open Tourney - Sakshi
Sakshi News home page

Hall of fame open: పోరాడి ఓడిన సాకేత్‌–యూకీ జోడీ

Published Mon, Jul 24 2023 2:01 PM | Last Updated on Mon, Jul 24 2023 3:06 PM

Yuki Bhambri AND Saketh Myneni pair lose in hall of fame open tourney - Sakshi

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జోడీ పోరాటం ముగిసింది. అమెరికాలోని న్యూపోర్ట్‌లో జరిగిన ఈ టోరీ్నలో సాకేత్‌–యూకీ ద్వయం పురుషుల డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్లో పోరాడి ఓడింది.

గంటా 59 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్‌ సాకేత్‌–యూకీ జంట 7–6 (7/2), 6–7 (2/7), 9–11తో టాప్‌ సీడ్‌ నథానియల్‌ లామోన్స్‌–జాక్సన్‌ విత్రో (అమెరికా) ద్వయం చేతిలో ఓటమి చవిచూసింది. సాకేత్‌–యూకీలకు 10,660 డాలర్ల (రూ. 8 లక్షల 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement