US Mens Clay Court Championship: Saketh And Mhambrey Pair Exits In 1st Round - Sakshi

US Men's Clay Court Championship: పోరాడి ఓడిన సాకేత్‌–యూకీ జోడీ 

Apr 7 2023 7:37 AM | Updated on Apr 7 2023 10:24 AM

US Mens Clay Court Championship: Saketh And Mhambrey Pair Exits In 1st Round - Sakshi

యూఎస్‌ పురుషుల క్లే కోర్టు టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్‌ జోడీ సాకేత్‌ మైనేని, యూకీ బాంబ్రీ జోడీ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. అమెరికాలోని హ్యూస్టన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌–యూకీ ద్వయం 6–7 (6/8), 6–2, 5–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రాబర్ట్‌ గాలోవే (అమెరికా)–మిగేల్‌ ఎంజెల్‌ రేయస్‌ వరేలా (మెక్సికో) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.

గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్‌ పాయింట్లను కాపాడుకున్న సాకేత్, యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశారు. అయితే నిర్ణాయక సూపర్‌ టైబ్రేక్‌లో మాత్రం గాలోవే–వరేలా ద్వయం పైచేయి సాధించింది. తొలి రౌండ్‌లో నిష్క్రమించిన సాకేత్, యూకీలకు 3,510 డాలర్ల (రూ. 2 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement