Yuki bambri Saket Maine
-
పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ
యూఎస్ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడీ సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ జోడీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని హ్యూస్టన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 6–7 (6/8), 6–2, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ గాలోవే (అమెరికా)–మిగేల్ ఎంజెల్ రేయస్ వరేలా (మెక్సికో) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న సాకేత్, యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం గాలోవే–వరేలా ద్వయం పైచేయి సాధించింది. తొలి రౌండ్లో నిష్క్రమించిన సాకేత్, యూకీలకు 3,510 డాలర్ల (రూ. 2 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
విజేత సాకేత్–యూకీ జోడీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని తన కెరీర్లో 12వ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పోర్చుగల్‌లో శనివారం ముగిసిన పోర్టో ఓపెన్‌లో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జంట డబుల్స్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–4, 3–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ నునో బోర్జెస్–ఫ్రాన్సిస్సో కబ్రాల్ (పోర్చుగల్) జోడీపై గెలిచింది. విజేత సాకేత్–యూకీ జంటకు 2,670 యూరోలు (రూ. 2 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీ, 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: IND Vs ENG 2nd T20: అదరగొట్టారు.. టీమిండియాదే సిరీస్ -
సెమీస్‌లో యూకీ
న్యూఢిల్లీ: జుహై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో యూకీ 6-4, 7-6 (7/3)తో భారత్‌కే చెందిన సాకేత్ మైనేనిపై గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీకి నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో యూకీ-సాకేత్ ద్వయం 6-3, 3-6, 11-13తో మావో జిన్ గాంగ్ (చైనా)-చు హువాన్ యి (చైనీస్ తైపీ) జంట చేతిలో పోరాడి ఓడింది.