విజేత సాకేత్‌–యూకీ జోడీ | Yuki Saketh Win doubles title In Porto Open | Sakshi
Sakshi News home page

Porto Open 2022: విజేత సాకేత్‌–యూకీ జోడీ

Published Sun, Jul 10 2022 8:36 AM | Last Updated on Sun, Jul 10 2022 12:59 PM

Yuki Saketh Win doubles title In Porto Open - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్, భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు సాకేత్‌ మైనేని తన కెరీర్‌లో 12వ అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పోర్చుగల్‌లో శనివారం ముగిసిన పోర్టో ఓపెన్‌లో సాకేత్‌–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట డబుల్స్‌ చాంపియన్‌గా నిలిచింది.

ఫైనల్లో సాకేత్‌–యూకీ ద్వయం 6–4, 3–6, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ నునో బోర్జెస్‌–ఫ్రాన్సిస్సో కబ్రాల్‌ (పోర్చుగల్‌) జోడీపై గెలిచింది. విజేత సాకేత్‌–యూకీ జంటకు 2,670 యూరోలు (రూ. 2 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీ, 80 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.
చదవండిIND Vs ENG 2nd T20: అదరగొట్టారు.. టీమిండియాదే సిరీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement